
గెలుపు గుర్రాలకే ఎన్నికల్లో చాన్స్
పరకాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో ఆదరణ ఉండడంతోపాటు కచ్చితంగా గెలిచే వారికే పోటీచేసే అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీపీసీసీ అబ్జర్వర్ మక్సుద్ అహ్మద్ స్పష్టం చేశారు. బుధవారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణంలో పరకాల, నడికూడ మండలాల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మక్సుద్ అహ్మద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. కేడర్ బాగుంటే పార్టీ బాగుంటుందని అని చెప్పడానికి పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నిదర్శనమని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పరకాల, నడికూడ మండలాల అధ్యక్షులు కట్కూరి దేవేందర్‌రెడ్డి, బుర్ర దేవేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి