
ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు
దుగ్గొండి: గిర్నిబావి– దుగ్గొండి ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే వారు సబ్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పివేశారు. మంటలు చెలరేగిన సమయంలో కొంతమంది ద్విచక్ర వాహనాలు సమీపంలో ఉన్నాయి. యువకులు చాకచక్యంగా వాహనాలను బయటికి తెచ్చారు. దీంతో ప్రమాదం తప్పింది. దీనిపై ఏఈ ప్రత్యూషను వివరణ కోరగా ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇన్స్‌లేటర్ పగిలిపోవడంతో మంటలు అంటుకున్నాయని, మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని ఆదివారం తెలిపారు.