
‘సీబీఎస్‌ఈ’లో సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ఖానాపురం: సీబీఎస్‌ఈ ఫలితాల్లో అశోక్‌నగర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. ఇంటర్‌లో 80 మంది విద్యార్థులకు 80 మంది, పదో తరగతిలో 61 మందికి 61 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్‌లో గణేశ్ 442, గోపాల్ 435, ముఖేశ్ 415 సాధించారని పేర్కొన్నారు. పదో తరగతిలో రాజ్‌కుమార్ 456, నవదీప్ 452, గణేశ్ 448 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. విద్యార్థులను డైరెక్టర్ శ్రీనివాసస్వామి అభినందించారు.

‘సీబీఎస్‌ఈ’లో సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ