
వైద్య కళాశాలలో సమస్యలు పరిష్కరిస్తా
నర్సంపేట రూరల్: నర్సంపేట వైద్య కళాశాలలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించడానికి కృషిచేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. వైద్య కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై సూపరింటెండెంట్ నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. కళాశాల అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు హుస్సేన్‌నాయక్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహారాములు పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, నాయకులు కంభంపాటి పుల్లారావు, ఠాకూర్ రవీందర్‌సింగ్, గడ్డం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సైనిక్ స్కూల్ సందర్శన..
మండలంలోని అశోక్‌నగర్ గిరిజన సైనిక్ స్కూల్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్‌నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గట్ల సురేందర్‌తో సైనిక్ స్కూల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య, స్కూల్, విద్యార్థుల అవసరాలపై చర్చించారు. అగ్నివీర్‌కు ఎంపికై న విద్యార్థుల సంఖ్యను వివరించారు. అనంతరం హుస్సేన్‌నాయక్ మాట్లాడుతూ దేశ రక్షణలో యువత పాత్ర కీలకమని, యువతను అగ్నివీర్‌కు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా కృషిచేయాలని సూచించారు. మండల స్పెషల్ ఆఫీసర్ సౌజన్య, డైరెక్టర్ శ్రీనివాసస్వామి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్
జాటోత్ హుస్సేన్‌నాయక్