
ప్రొఫెసర్ మల్లారెడ్డికి ఫెల్లోషిప్ ప్రదానం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని అకాడమీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ హానరీ ఫెల్లోషిప్ ప్రదానం చేసింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పద్మవిభూషన్ డాక్టర్ దువ్వారు నాగేశ్వర్‌రెడ్డి ఫెల్లోషిప్ అందుకున్నారు. మల్లారెడ్డిని సోమవారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అభినందించారు. ప్రొఫెసర్లు కె.రాజేందర్, నాగరాజు, ఎల్‌పీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.