
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
గీసుకొండ: బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో మండలంలోని కొనాయమాకులలోని పీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో గీసుకొండ, సంగెం మండలాలతో పాటు 15,16,17 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, పీసీసీ పరిశీలకులుగా ఎమ్మెల్సీ ఎండీ అమీర్ అలీఖాన్, పీసీసీ అబ్జర్వర్ రవిచంద్ర పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కమిటీల ఎన్నికలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని, పార్టీకి అంకితమై పూర్తిస్థాయిలో పనిచేసే ఉత్సహవంతులు ము ందుకు రావాలన్నారు. 2017కు ముందు నుంచి పార్టీ మారకుండా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసిన వారికి బ్లాక్ అధ్యక్షులు, మండల, డివిజన్ అధ్యక్షులుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పటిష్టమైన నాయకత్వంతోనే పార్టీ బలోపేతం
సంగెం: పటిష్టమైన నాయకత్వంతోనే పార్టీ బలోపేతమవుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం గీసుకొండ మండలం కొనాయమాకులలోని పీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో సంగెం, గీసుకొండ, 15, 16, 17 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పీసీసీ పరిశీలకులుగా ఎమ్మెల్సీ ఎండి.అమీర్ అలీఖాన్, అబ్జర్వర్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి