వరంగల్ క్రైం: కాజీపేట, నర్సంపేట డివిజన్ల నూతన ఏసీ పీలుగా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలన్నారు. పోలీస్ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు.
కేయూ కామర్స్ బీఓఎస్ చైర్‌పర్సన్‌గా వరలక్ష్మి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంటు కళాశాల బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్‌గా ఆ కళాశాల ప్రొఫెసర్ పి.వరలక్ష్మిని నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆమె వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ప్రస్తుతం వరలక్ష్మి సీడీసీ డీన్‌గా, యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నియామకం
రామన్నపేట: హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్ స్టోర్స్ కల్పలత సూపర్ బజార్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, మేనేజింగ్ డైరెక్టర్‌గా జిల్లా సహకార అడిట్ అధికారి కె.కోదండరాములు నియామకం అయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తించిన ఎ.జగన్‌మోహన్‌రావు ఇదే శాఖలో డీసీఓగా బదిలీ అయ్యారు. సూపర్ బజార్ అధ్యక్షుడు వర్ధమాన్ జనార్దన్, మేనేజర్ రఘురామరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అందాల పోటీలతో మహిళల ఆత్మగౌరవానికి భంగం
● ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రమాదేవి
హన్మకొండ: అందాల పోటీలతో మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతోందని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రమాదేవి పేర్కొన్నారు. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. మహిళలను వ్యాపార వస్తువుగా చూసే సంస్కృతి పోవాలని, వెంటనే అందాల పోటీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను పక్కనపెట్టి అందాల పోటీలు నిర్వహించడం విచారకరమన్నారు. అందాల పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షురాలు, రమాతార, సభ్యులు శ్వేత, రాధిక, సునీత, రాధ, అనిత, ఉమా, పద్మ, లచ్చమ్మ పాల్గొన్నారు.

సీపీని కలిసిన ఏసీపీలు