
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
నర్సంపేట: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సివిల్ సప్లయ్, ఐకేపీ, కో ఆపరేటివ్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ.. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మిల్లర్లపై చర్యలు తప్పవన్నారు. సేకరించిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా మిల్లులకు పంపించాలని సూచించారు. జిల్లాలో మిగతా ప్రాంతాల్లో ధాన్యం సేకరణ దాదాపు పూర్తయినందున నర్సంపేట నియోజకవర్గంపై అధికారులు పూర్తిగా శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సివిల్ సప్లయ్ సంధ్యారాణి, డీఆర్‌డీఓ కౌసల్యదేవి, డీసీఓ నీరజ, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి