
పీడిత ప్రజల మహాశక్తి ఓంకార్
గీసుకొండ: ఓంకార్ ఓ వ్యక్తి కాదని పీడిత ప్రజల మహాశక్తి అని ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. సోమవారం మండలంలోని మచ్చాపూర్‌లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఎంసీపీఐ వ్యవస్థాపకుడు, కమ్యూనిస్టు యోధుడు మద్దికాయల ఓంకార్ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఓంకార్‌ను అసెంబ్లీ టైగర్ అనే వారని గుర్తు చేశారు. సామాజిక ఐక్యతే మార్గమన్నారు. ప్రజా గాయకుడు జయరాజ్, నాయకులు గోనె కుమారస్వామి, పలు సంఘాల జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన
కార్యదర్శి అశోక్
ఘనంగా శత జయంతి సభ