
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
న్యూశాయంపేట/విద్యారణ్యపురి: ఇంటర్, పదోతరగతి సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి 28 వరకు ఇంటర్ సప్లమెంటరీ, జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించే పదోతరగతి పరీక్షలకు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో 16 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో 5,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయనునున్నట్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక ప్లయింగ్ స్క్వాడ్, సీఎస్‌డీఓలను 16మంది చొప్పున నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ శ్రీధర్ సుమన్, డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల, డీఈఓ జ్ఞానేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
భూములు కోల్పోయిన
రైతుల ఆర్బిట్రేషన్ పూర్తి
న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే 163–జి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయ్యిందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. హైవేలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలం నెక్కొండ, పత్తిపాక, వెంకటాపూర్, ఆలంఖాన్‌పేట, చంద్రుగొండ, తోపనపల్లి, అప్పలరావుపేట, గ్రామాల రైతులతో సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఆర్డీఓ ఉమారాణి, నెక్కొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎన్‌హెచ్ హైవే టీం లీడర్ సంపత్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు పాటిస్తే బిల్లులు చెల్లిస్తాం..
దుగ్గొండి: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు మంజూరైన వారు నిబంధనల మేరకు వేగంగా ఇళ్లు నిర్మించుకుంటే బిల్లులు చెల్లిస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని రేకంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని సోమవారం సాయంత్రం ఆమె తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఇంటిని నిర్మించుకుంటున్న రంపీస అశ్విని, రంపీస కళావతితో మాట్లాడారు. బేస్మెంట్‌కు రూ. లక్ష, రూఫ్ లెవెల్‌కు రూ.లక్ష చెల్లించి నిర్మాణం పూర్తి చేశాక మిగతావి చెల్లించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, హౌసింగ్ పీడీ గణపతి, డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ శ్రీధర్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష