
కేయూ డిగ్రీ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల రెండో, ఆరో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. హనుమకొండలో పలు పరీక్షా కేంద్రాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం,పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, వెంకటయ్య సందర్శించి పరిశీలించారు.