
స్లాట్ బుకింగ్‌తో సత్వర రిజిస్ట్రేషన్
కాజీపేట అర్బన్: స్లాట్ బుకింగ్ విధానంతో సత్వర రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ పేర్కొన్నారు. సోమవారం వరంగల్ ఆర్వోలో స్లాట్‌బుకింగ్ సేవలను ఫణీందర్ ప్రారంభించి దస్తావేజులను భూ క్రయదారులకు 15 నిమిషాల్లో అందజేశారు. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతీరోజు 96 స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నామని, స్లాట్ బుకింగ్ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్లు ఆనంద్, నస్రీమా, సిబ్బంది పాల్గొన్నారు.
తొలి రోజు ఇలా..
పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రెండో దశలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఆర్వో, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎంపిక చేశారు. వరంగల్ ఆర్వోలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండగా 96 స్లాట్ బుకింగ్స్, మిగతా మూడు కార్యాలయాల్లో 48 స్లాట్ బుకింగ్స్‌కు అవకాశం కల్పించారు. తొలిరోజు వరంగల్ ఆర్వోలో 71, జనగామ 25, స్టేషన్ ఘన్‌పూర్ 22, నర్సంపేట 24 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్