
అత్యాధునిక వసతులతో రైల్వేస్టేషన్
ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ తరహాలో అత్యాధునిక హంగులు, వసతులతో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ రైల్వేస్టేషన్‌ను మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, అరూరి రమేశ్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో కలిసి గంట రవికుమార్ సందర్శించారు. ఈసందర్భంగా రూ.25.41 కోట్ల తో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌ను ఈనెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రత్న సతీశ్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, తాబేటి వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు.
రూ.25.41 కోట్లతో అభివృద్ధి పనులు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్