
లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి
నల్లబెల్లి: గొట్టపు పురుగుల నివారణ కోసం లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మండలంలోని రంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను విరివిగా వినియోగించాలని రైతులకు సూచించారు. రసంపీల్చు పురుగుల ఉధృతి నివారించడానికి ఎర పంటలను వేసుకోవాలని కోరారు. శాస్త్రవేత్త యశస్విని మాట్లాడుతూ తృణ ధాన్యాలు, అపరాలు పండించాలని రైతులకు సూచించారుఎ. అనంతరం నల్లబెల్లి రైతువేదికలో నిర్వహించిన ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, విత్తన డీలర్ల సమావేశంలో నర్సంపేట వ్యవసాయ సంచాలకులు కె.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలు సబ్సిడీపై త్వరలోనే రానున్నాయని వెల్లడించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తనాలు విక్రయించినప్పుడు రైతులకు కచ్చితంగా రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ఈఓపీఎస్ మిషన్లతోనే విక్రయాలు చేపట్టాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏఓ రజిత, ఏఈఓ శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్, పంచాయతీ కార్యదర్శి రామారావు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ
శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్
రంగాపురంలో ‘రైతు ముంగిట్లో
శాస్త్రవేత్తలు’ కార్యక్రమం