
ఉర్సుకు రావాలని సీఎంకు ఆహ్వానం
దామెర: ఒగ్లాపూర్ సమీపంలోని సైలానిబాబా దర్గా ఉర్సు ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని దర్గా పీఠాధిపతి మహ్మద్ అబ్దుల్ హమీద్ షామియా,ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రె డ్డితో కలిసి శనివారం హైదరాబాద్‌లో ఆహ్వా న పత్రం అందజేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా పీఠాధిపతి సీఎంకు దట్టి కట్టారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న సైలాని బాబా గంధం ఉత్సావాలకు రావాలని సీఎంను కోరా రు.మహ్మద్ అహమ్మద్ తదితరులు ఉన్నారు.
కేయూ ఎంబీఏ
పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ సందర్శించి, పరిశీలించారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ పరీక్షలు కొనసాగుతున్నాయి.దూర విద్యాకేంద్రంలోని పరీక్షల కేంద్రాన్ని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం సందర్శించి, పరిశీలించారు. ఆయన వెంట దూర విద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ, వై.వెంకయ్య, సీతారాం ఉన్నారు.
ప్రొఫెసర్లుగా పదోన్నతి
విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. సంస్కృత అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇ.కృష్ణయ్య, పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, ప్రభుత్వ పింగిళి మహిళా కాలేజీ తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతను ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ కళాశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఆయా ప్రొఫెసర్లను కేడీసీ ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం.రవికుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీనాథ్, పరీక్షల నియంత్రణాధికారి శివనాగ శ్రీను, అధ్యాపకులు పాల్గొన్నారు.
వరంగల్ డీసీసీబీకి ‘ఐఎస్‌ఓ’
హన్మకొండ: వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న సేవలకు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ (ఐఎస్‌ఓ) సర్టిఫికెట్ జారీ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కార్యాలయంలో టెస్కాబ్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ తమ పాలకవర్గం, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేస్తూ బ్యాంకు అభివృద్ధితో పాటు, వ్యవసాయ, రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
కూలిన పాఠశాల ప్రహరీ
కమలాపూర్: మండల వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అకాల వర్షం కురవడంతో పలు గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలవాలింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం స్వల్పంగా తడిసిపోయింది. అలాగే మండల కేంద్రంలోని టాకీస్ ఏరియా ప్రాథమిక పాఠశాల ప్రహరీ అకాల వర్షంతో కూలిపోయింది. మండల వ్యాప్తంగా 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఉర్సుకు రావాలని సీఎంకు ఆహ్వానం

ఉర్సుకు రావాలని సీఎంకు ఆహ్వానం

ఉర్సుకు రావాలని సీఎంకు ఆహ్వానం