
భక్తులను క్షేమంగా చేరవేయాలి
● ఆర్టీసీ ఆర్‌ఎం డి.విజయభాను
హన్మకొండ: సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులను క్షేమంగా తరలించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను సూచించారు. శనివారం హనుమకొండ బస్ స్టేషన్‌లో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను ఆయన పరిశీలించారు. ప్రయాణికుల రద్దీ ఎలా ఉందని, డ్రైవర్లు వడదెబ్బకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శనివారం వరంగల్ రీజియన్ వ్యాప్తంగా 230 బస్సులలో 15 వేల మంది సరస్వతి పుష్కరాలకు తరలివెళ్లినట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం కేశరాజు భాను కిరణ్, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.