
ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్ట్‌ల సర్వేకు నిధులు
కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేకు 2025–26 ఆర్థిక సంవత్సరం సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్‌లో కేటాయింపు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు.
ఏ ప్రాజెక్టుకు ఎంత అంటే..
● పెండ్యాల–హసన్‌పర్తి బైపాస్‌లైన్ పైనల్ లొకేష న్ సర్వేకు రూ.64 లక్షలు, డోర్నకల్–మణుగూర్ డబ్లింగ్ 104కి.మీ థర్డ్‌లైన్ సర్వే కోసం రూ.2.08 కోట్లు, సికింద్రాబాద్–కాజీపేట మధ్య మూడో లైన్ సర్వేకు రూ.1.56 కోట్లు కేటాయించారు.
● సికింద్రాబాద్–కాజీపేట వరకు 85,48 కి.మీ డబ్లింగ్ లైన్ సర్వే కోసం రూ.1.71 కోట్లు, కాజీ పేట–విజయవాడ క్వార్డర్ అఫ్‌లింగ్ 220 కి.మీ సర్వేకు రూ.4.40 కోట్లు, కాజీపేట–బల్లార్షా క్వార్డర్ అప్ లింగ్ 234 కి.మీ సర్వేకు రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ క్వార్డర్ అఫ్‌లింగ్ 120 కి.మీ రూ.2.40 కోట్లు, భూపాలపల్లి–కాజీపేట (హసన్‌పర్తి) కొత్తలైన్ 64 కి.మీ ఫైనల్ సర్వేకు రూ.1.60 కోట్లు ఇచ్చారు.
● ఘన్‌పూర్–రఘునాథపల్లి 17,2 కి .మీ మూడో, నాలుగో లైన్ సర్వేకు రూ.0.34 లక్షలు, మణుగూరు–రామగుండం కొత్త లైన్ సర్వేకు రూ.5 కోట్లు, కాజీపేట–ఘన్‌పూర్ మధ్య 21.25 కి.మీ మూడో రైల్వే లైన్ సర్వేకు రూ.43 లక్షలు కేటాయింపులు చేశారు.
● వరంగల్ స్టేషన్ సమీపంలో రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్) మంజూరుకు రూ.10 లక్షలు, కాజీపేట–వరంగల్ రూట్‌లో బైపాస్‌లైన్‌లో రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్)కు రూ. 75లక్షలు, డోర్నకల్‌లో 15 కి.మీ. ఆర్వోఆర్ సర్వేకు రూ.30 లక్షలు మంజూరు చేశారు.
● సికింద్రాబాద్–కాజీపేట మధ్య ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ 134 కి.మీ మూడో లైన్ సర్వేకు రూ.52 లక్షలు, బల్లార్షా–కాజీపేట ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ 234 కి.మీ బల్లార్షా–కాజీపేట మధ్య నాలుగో లైన్ సర్వేకు రూ.1.17 కోట్లు, కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైన్ 219 కి.మీ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ రూ.1.10 కోట్లు నిధులు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
● కాజీపేట రైల్వే వ్యాగన్ షెడ్‌కు సంబంఽధించిన ఈ ఏడాది కావాల్సిన నిధులు కన్సాలిడేటెడ్ బడ్జెట్ కేటాయింపుల్లో పేర్కొనలేదని అధికారులు పేర్కొన్నారు.
2025–26 కన్సాలిడేటెడ్
స్టేట్‌మెంట్‌లో స్పష్టత