
కూతురు సాకడం లేదు..
కన్న కూతురు తమను సాకడం లేదని, తన ఆస్తి తనకు ఇప్పించాలని భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పంజ నాగయ్య, ఎల్లవ్వ ప్రజావాణిలో కలెక్టర్‌తో మొరపెట్టుకున్నారు. సర్వేనంబర్ 469లో 1.8 ఎకరాల భూమిని తన కూతురు నగరబోయిన అనిత పేరుపై పట్టా చేశానని, ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. కూతురు నుంచి తమ భూమి తమకు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. వినతిపత్రం తీసుకున్న కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు.
జీవితాంతం పోషిస్తానని..
జీవితాంతం పోషిస్తానని చెప్పి తన పేరుపై ఉన్న ఆస్తిని కాజేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని దామెరకు చెందిన ఎడ్ల శాంతమ్మ ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. తన పేరుపై ఉన్న ఆస్తి 3.30 ఎకరాల భూమి, ఇంటి పక్కన ఉన్న 10 గుంటల జాగాను చిన్న కూతురు గాలి కల్పన రిజిస్ట్రేషన్ చేయించుకుందని, ఇప్పుడు తనను పోషించడం లేదని, చంపుతానని బెదిరిస్తోందని కలెక్టర్‌తో మొరపెట్టుకుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ రద్దు చేసి తన ఆస్తిని తనకు ఇప్పించాలని, చిన్న కూతురు కల్పన తన ఆస్తిని అనుభవించే హక్కు లేదని, న్యాయం చేయాలని కోరారు.

కూతురు సాకడం లేదు..