
అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ కార్యవర్గం
గీసుకొండ: టీఎన్జీవోస్ అ నుబంధ అంగన్‌వాడీ టీచ ర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నికలు మంగళవారం వరంగల్ నగరంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలిగా గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లకు చెందిన మేక అని తాకుమారి ఎన్నికయ్యారు. సహ అధ్యక్షురాలి గా కె.భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులుగా కుంట లలి త,టి.శోభారాణి, ఎన్.రమ, కార్యదర్శిగా వి.భవాని, సహాయ కార్యదర్శులుగా సీహెచ్ రమ, సీహెచ్ సునీత, ఎం.స్వరూప, ఆర్గనైజింగ్ కా ర్యదర్శులుగా రాణి, బి.సునీత, ప్రచార కార్యదర్శులుగా బి.భవాని,కె.ఉమాదేవి,కోశాధికారి గా పి.హైమావతి, కార్యవర్గ సభ్యులుగా ఆర్. ఎస్తేర, రాజసులోచన, ఎండీ నస్రీన్ ఎన్నికై న ట్లు ప్రకటించారు. కాగా, నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి సదా నందం అభినందించారు. అంగన్‌వాడీ టీచ ర్లు, హెల్పర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
పాకాలలో రేపు నేచర్‌వాక్
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో ఈనెల 22న నేచర్‌వాక్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఔల్స్ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీశాఖ సహకారంతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకు సమావేశం, 6.30 గంటలకు నేచర్‌వాక్, 10.15 గంటలకు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంపై అవగాహన సదస్సు, 11 గంటలకు బటర్ ఫ్లైగార్డెన్ సందర్శన, 11.30 గంటలకు బోటింగ్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రకృతి, వనప్రేమికులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగేశ్వర్‌రావు కోరారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరి మృతి
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..చెన్నారావుపేట గ్రామానికి చెందిన మర్రి రాములు(65) సైకిల్‌పై మంగళవారం ఉదయం రోజు మాదిరిగానే పాల బాటి ల్ ఇవ్వడానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ప్రధాన సెంటర్ వద్దకు వచ్చి తన ఇంటి వైపు వెళ్లడానికి రోడ్డు దాటుతున్నాడు. నర్సంపేట నుంచి నెక్కొండ వైపు వెళ్తున్న టాటాఏస్ వా హనం వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రగాయాల పాలైన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సమ్మక్క, కుమారుడు,కూతురు ఉన్నారు.మృతుడి కుమారు డు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహా న్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో
వృద్ధుడు..
గీసుకొండ: ధర్మారం–స్తంభంపల్లి మార్గంలోని కోళ్లఫాం దగ్గర ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన చిట్టిమల్ల మనోహర్ (71) మంగళవారం కోళ్లఫాం దగ్గర చనిపోయి ఉన్నాడని స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు రవికుమార్ ఫిర్యాదు చేయగా అనుమాన్పాద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు.