
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
ఖానాపురం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌తోపాటు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద, పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు, స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులపాత్ర కీలకమైందన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్టభద్రతలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు సాయిరమణ, రఘు, ఎస్సై రఘుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
డీసీపీ అంకిత్