
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
● కలెక్టర్ సత్యశారద
పర్వతగిరి: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మండలంలోని కొంకపాక, చౌటపల్లి, జమాల్‌పురం గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే లారీల ద్వారా దిగుమతి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడువకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. తడిసిన ధా న్యాన్ని వెంటనే ఎండబెట్టి, ఆరిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ నీరజ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, రైస్‌మిల్లర్లు, పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.