
కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు
వర్ధన్నపేట: కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట టౌన్, వర్ధన్నపేట, పర్వతగిరి, వరంగల్ 3, 14, 43 డివిజన్ల నా యకులతో పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశాన్ని గురువారం వర్ధన్నపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలి పించిన ప్రజలు, కార్యకర్తలను మరిచిపోనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పార్టీ పదవి అయినా, ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినా పార్టీకి ప్రజలకు సేవచేయాలని సూచించారు. 2017 ముందు నుంచి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి బ్లాక్ అధ్యక్షులు, మండల, వార్డు, గ్రామ అధ్యక్షులుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీపీసీసీ అబ్జర్వర్ అమర్ అలీఖాన్, మేడి రవిచంద్ర, టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ వెంకటయ్య, నాయకులు సత్యనారాయణ, దేవేందర్‌రావు, రాజిరెడ్డి, అనిల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాగరాజు