Guntur District News
-
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
బాపట్ల టౌన్: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 69వ సమావేశంలో 2014 సెప్టెంబర్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా ప్రతిపాదించారని గుర్తు చేశారు. దీన్ని 177 దేశాలు ఆమోదించాయని తెలిపారు. 2015 నుంచి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. జూన్ 21వ తేదీన వైజాగ్‌లో ఐదు లక్షల మందితో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. యోగాంధ్ర క్యాంపెయిన్‌లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ధైర్యం వస్తుందని చెప్పారు. జిల్లాలోని 17 లక్షల మందికి యోగాంధ్ర చేరే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్‌లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో యోగా ఒకటిగా చేర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, చీరాల శాసనసభ్యులు ఎం. ఎం. కొండయ్య పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి -
● కారు ఢీకొని కూలీ మృతి ● మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు
పొట్టకూటి కోసం వచ్చి అనంత లోకాలకు... సత్తెనపల్లి: పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పట్టణంలోని గడియారస్తంభం వద్ద బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు (48), బి.జోసెఫ్ అలియాస్ శ్రీనివాసరావు ఇరువురు కూలి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో దామచర్లకు చెందిన ఓ వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో గడియార స్తంభం వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉప్పుతల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా జోసెఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చి ప్రమాదవ శాత్తు రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
గుంటూరు వెస్ట్: తుది ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా తయారు చేసుకోవడానికి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.ఎన్.శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితాపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహించే ఈ సమావేశంలో స్వీకరించే సూచనలు, సలహాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాలసీలకు సంబంధించిన అంశాలపై వారికే ఫిర్యాదులు పంపిస్తున్నామని పేర్కొన్నారు. కొందరు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన వారిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారన్నారు. వాటిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోపు ఓటరు, ఆధార్ కార్డుల అనుసంధానం చేయించాలని తెలిపారు. పోలింగ్ బూత్‌లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్వోలు క్లయిమ్స్ వెరిఫికేషన్‌కు వెళ్లేటప్పుడు వారితోపాటు బీఎల్ఏలను కూడా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పై సమస్యలపై స్పందించిన ఇన్చార్జి కలెక్టర్.. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం గురించి ఏ నిర్ణయమైనా ఎన్నికల సంఘం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తుది ఓటర్ల జాబితా 2026 జనవరి 5న రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ -
ఎండీయూ వాహనదారులను కాపాడాలని వినతి
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా విధానాన్ని రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సిబ్బంది రోడ్డున పడ్డామని ఎండీయూ వాహనాల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో ఆటుపోట్ల్లను ఎదుర్కొని ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు ఎండీయూ వాహనాలు రేషన్ పంపిణీకి తప్ప దేనికీ పనికిరావని తెలిపారు. తమకు ఉపాధి చూపించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి బి.తిరుపతి రామయ్య, కోశాధికారి కె.డాని, నాయకులు పాల్గొన్నారు.డీఆర్ఎం కార్యాలయంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం లక్ష్మీపురం: గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని డీఆర్ఎం సుధేష్ఠ సేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా సిబ్బందితో డీఆర్ఎం కార్యాలయ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్ఎం సుధేష్ఠసేన్ మాట్లాడుతూ ప్రతి ఏటా మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తారన్నారు. అహింస, శాంతి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ప్రతిజ్ఞ చేశామన్నారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం పెదకాకాని: స్థానిక భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి పెదకాకాని గ్రామానికి చెందిన గరికపాటి వరుణ్‌దేవ్ రూ.1,00,116 అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ బుధవారం తెలిపారు. గరికపాటి లక్ష్మీకాంతం, వుయ్యూరు మాసమ్మ జ్ఞాపకార్థం వరుణ్ దేవ్ ఈ మొత్తంతోపాటు వెండి బిందె, గిన్నెలు విరాళంగా అందించినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. దాతకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు. అమ్మవారి హుండీ కానుకల లెక్కింపు దుర్గి: శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగింది. అమ్మవారికి హుండీ కానుకల ద్వారా రూ. 31,30,423 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి సైదమ్మ తెలిపారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన లెక్కింపులో పేటసన్నెగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణ అధికారి శివనాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామి వారి కల్యాణం మాచర్ల: పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణం ఘనంగా జరిపారు. అమ్మవారి జన్మదినమైన శ్రవణా నక్షత్రాని పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, బి.రఘురామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు రాధ, రమణారెడ్డి, కమిటీ నిర్వాహకులు కె.బ్రహ్మారావు, కె.గురవయ్య, పిచ్చయ్యల ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. భక్తులకు తీర్థప్రసాదం అందించారు. -
వైభవంగా ఆంజనేయ స్వామి శోభాయాత్ర
తెనాలి: హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక షరాఫ్‌బజార్‌లోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీహనుమజ్జయంతి మహోత్సవాలు ప్రారంభం కానున్నందున బుధవారం పట్టణంలో స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని కొలువుదీర్చి, పూజలు చేశారు. శ్రీపంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22 నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార్షిక శ్రీ హనుమజ్జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీహనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు విశేష పూజలు, హోమాలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కల్యాణం, 31న శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం ఉంటాయన్నారు. జూన్ ఒకటో తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనూరాధ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్రప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
రేషను బండి పైనా కూటమి కక్ష!
గుంటూరు వెస్ట్: గత ప్రభుత్వ హయాంలో ప్రజాదరణ పొందిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా నాశనం చేయడమే కూటమి నేతల లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఎంత మంది సిబ్బంది రోడ్డున పడుతున్నా పాలకులకు ఏమాత్రం పట్టడం లేదు. నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపాల్సిన ప్రభుత్వం ఉన్న వాటిని కూడా దూరం చేయడం అత్యంత దారుణం. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే అద్భుత వ్యవస్థ ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్) వాహనాలను రద్దు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రేషన్ మాఫియా దందాకు అధిక శాతం కూటమి నేతలే నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసి కూడా నిందలన్నీ ఎండీయూ వాహనదారులపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర యూనియన్ నాయకులతో జరిపిన చర్చలు పరిగణనలోనికి తీసుకోకుండా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నాయకులు వాపోతున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎండీయూ వాహనాల కాంట్రాక్ట్ 2027 వరకు ఉందని, ఇంతలోనే ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో వెయ్యి మంది... రాష్ట్రవ్యాప్తంగా ఎండీయూ వాహన వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2021 ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టారు. రేషన్ దుకాణం నుంచి సరకులు తీసుకుని ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ప్రారంభమైన ఈ వ్యవస్థ.. సిబ్బంది పనితీరుతో తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. జిల్లాలో 972 రేషన్ దుకాణాల నుంచి 353 వాహనాల ద్వారా బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరకులను 5,99,511 మంది రేషన్ కార్డుదారులకు నెల ప్రారంభం నుంచి సుమారు 17వ తేదీ వరకు సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క ఎండీయూ వాహనానికి మూడు రేషన్ దుకాణాలు కేటాయించారు. ఈ మూడింటి పరిధిలో 6 వేల నుంచి 9 వేల వరకు రేషన్ కార్డులు ఉంటాయి. ఈ క్రమంలో కొందరు ఎండీయూ వాహనదారులు తప్పులు కూడా చేసేవారు. పౌరసరఫరాల శాఖాధికారులు తనిఖీలు చేసి వారిపై ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఖర్చులు పెరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వాహనానికి రూ.21 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిలో వాహన కిస్తీకి రూ.3 వేలు కట్ చేసి రూ.18 వేలు ఇచ్చేది. ఇందులోనూ ఇంధనం ఖర్చు, రిపేర్లు, ఇన్సూరెన్స్, డ్రైవర్ జీతం, ముఠా కూలీల ఖర్చు, బండి ఇన్సూరెన్స్ వంటి వాటిని ఆ వాహనదారుడే చూసుకోవాలి. ఉపాధితోపాటు సేవ కూడా మిళితం కావడంతో చాలామంది ఎండీయూ వాహనదారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారు. కుంటి సాకులతో సిబ్బంది, పేదలపై కక్ష తీర్చుకుంటున్న సర్కారు కూలీనాలీ చేసుకునే వారికి ఎంతో ఉపయోగపడిన వ్యవస్థ ఎండీయూ వాహనాల రద్దుతో తప్పని అవస్థ పాలకుల తీరుతో రోడ్డున పడ్డ సిబ్బంది రేషన్ బియ్యం అక్రమ దందా కూటమి నేతలది కాదా? అసలైన వారిని వదిలిపెట్టి అమాయకులపై కుట్రతో నిర్ణయం సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్న కూటమి సర్కార్ప్రాణాలకు సైతం తెగించి... కరోనా కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటింటికీ రేషన్ డెలివరీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కృష్ణా జిల్లాలో వచ్చిన వరదలకు సుమారు 10 రోజులపాటు అక్కడే ఉండి వాహనాల ద్వారా బాధితులకు ఆహారం తదితరాలు అందించారు. వరద నిధికి తమ జీతంలో 10 శాతం మొత్తం విరాళంగా ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా 100 ఎండీయూ వాహనాల ద్వారా ఆహార పంపిణీ చేయించారు. అంగన్వాడీ, ఐసీడీఎస్‌లకు బియ్యం సరఫరా కార్యక్రమం కూడా వీళ్లే అదనంగా చేస్తున్నారు. -
ఏ క్షణం కావాలన్నా ఎంతైనా రెడీ...
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అర్ధరాత్రి దాటాక 2.39 గంటలకు కూడా మద్యం విక్రయిస్తున్నారు. ప్రధాన షట్టర్‌కు చిన్న షట్టర్ అమర్చి అమ్మకాలు చేస్తున్నారు. పక్కనే మరో బార్ అండ్ రెస్టారెంట్లో అర్ధరాత్రి దాటాక 2.53 గంటలకు కూడా పక్కన ఉన్న సన్న సందులో నుంచి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. ఈ బార్‌కు పక్కనే ఉండే మరొక బార్లో ఏకంగా ఒక వాచ్‌మెన్‌ను పెట్టి 3.05 గంటలకు కూడా విక్రయాలు జరుపుతున్నారు. వీటికి కొద్దిగా దూరంలో ఓల్డ్‌క్లబ్ రోడ్డు మూలన ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అసలు టైంతో పనే లేదు. ఎప్పుడు కావాలన్నా మందుబాబులకు సొంత ఇంటికి వచ్చి వెళ్లినట్టే ఉంది పరిస్థితి. పట్నంబజారు: అర్ధరాత్రి సమయాల్లో సైతం షట్టర్ కొడితే చాలు తలుపులు నిస్సంకోచంగా తెరుచుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. బహిరంగ మద్యపానం విచ్చలవిడిగా సాగుతున్నా... అనధికారిక పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు అవుతున్నా.. పట్టించుకునే నాథుడు కాదు కదా.. కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గుంటూరు నగరంలోని ఈస్ట్, వెస్ట్ పరిధిలో మొత్తం 37 వైన్స్ దుకాణాలు, 64 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అన్నిచోట్లా కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం విక్రయాలు 24/7గా మారాయి. మద్యం మత్తులో గొడవలు అరండల్‌పేట ఒకటో లైనులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కూడా మందుబాబులకు 24 గంటలూ సేవలను అందిస్తున్నారు. వెస్ట్ పరిధిలోని జేకేసీ కళాశాల రోడ్డులో ఉన్న పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లు కస్టమర్లను బార్ వెనుక గార్డెన్లో కూర్చొబెట్టి మరీ తాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మణిపురం ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న బార్లో సైతం నిత్యం మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటితోపాటు ఈ ప్రాంతంలో అనేక వివాదాలు చెలరేగి అర్ధరాత్రి పూట దాడులు చేసుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. నందివెలుగు రోడ్డులోని ఉన్న రెండు బార్ల పరిస్థితి ఇక చెప్పాల్సిన పనే లేదు. మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లు.. అనే చందంగా సాగుతున్నాయి. వైన్స్ దుకాణాలలో కంటే బార్లలో క్వార్టర్‌కు రూ.60 అధికంగా తీసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయాల్లో రూ.100కుపైగానే అధికంగా తీసుకుంటున్నారు. ఇలా అందినకాడికి దండుకుంటున్నారు. నిర్లక్ష్యంగా అధికారులు అర్ధరాత్రి వేళ బార్లు, వైన్స్‌ల్లో మద్యం అమ్మకాలు బహిరంగ రహస్యమే అన్నట్లు పరిస్థితి మారింది. ఈ విషయం పోలీసు, ఎకై ్సజ్ అధికారులకు తెలిసినప్పటికీ తమకేమీ పట్టని చందంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మద్యం షాపులకు సంబంధించి కొంత మంది కూటమి నేతలు సిండికేట్‌గా ఏర్పడి వైన్స్ దుకాణాల వారి నుంచి రూ.12 వేలు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల వద్ద నుంచి రూ.15 వేలు చొప్పున వసూలు చేసి ఆయా పోలీసుస్టేషన్ అధికారులు, ఎకై ్సజ్ సిబ్బందికి నెలవారీగా యారక్ అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల్లో ఆయా స్టేషన్ల మఫ్టీ పార్టీ కానిస్టేబుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ వైన్స్‌లో కొత్తగా అనధికారిక పర్మిట్ రూమ్‌కు రిబ్బన్ కట్ చేశారు. కొద్ది కాలం క్రితం వరకు పక్కనే ఉన్న బడ్డీకొట్లలో యథేచ్ఛగా తాగేవారు. ఇప్పుడు బహిరంగ మద్యపానం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నేరుగా గోడ పగులకొట్టి మరీ పర్మిట్ రూమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ పక్కనే ఆంధ్రా ముస్లిం కళాశాల ఉంది. అదే క్రమంలో బైపాస్ పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ మేరీస్, పలు కళాశాలల విద్యార్థినులు ఇటుగానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ వైన్స్ నిర్వాహకులు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌కు తెరలను అడ్డుకట్టి మరీ తాగించేస్తున్నారు. పట్టపగలు మధ్యాహ్నం 2.34 గంటల సమయంలో సైతం మందుబాబులు ఇక్కడి రోడ్డుపై దర్జాగా తాగేస్తున్నారు. దీంతోపాటు వైన్స్ వెనుక భాగంలో, వైన్స్ ఉన్న డాబా పైభాగంలో అడ్డూ అదుపు లేకుండా పర్మిట్ రూములు పెట్టారు. ఇక నందివెలుగు రోడ్డులో అనేక వివాదాల మధ్యన ఏర్పాటు చేసిన వైన్స్ నిర్వాహకులు కూడా పర్మిట్ రూమ్ ఓపెన్ చేశారని, మద్యం అడ్డగోలుగా విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ లోపల అనుమతి లేని పర్మిట్ రూమ్ ఓ బార్ అండ్ రెస్టారెంట్లో క్వార్టర్ మద్యానికి ఫోన్‌పేలో పంపిన నగదు రశీదు బహిరంగ మద్యపానంపై చర్యలు బహిరంగ మద్యపానం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డ్రోన్లు, పోలీసు అధికారులు, సిబ్బంది ద్వారా చర్యలు చేపడుతున్నాం. బహిరంగంగా మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయటంతోపాటు కోర్టుకు హాజరు పరుస్తున్నాం. పూర్తి స్థాయిలో కట్టడిపై దృష్టి సారిస్తాం. – షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ, ఈస్ట్ డివిజన్ న్యూస్రీల్కూటమి ‘మత్తు’కు చిత్తు 24/7 మద్యం అమ్మకాలు కాసుల కక్కుర్తిలో పాలకులు వంత పాడుతున్న అధికారులు గోడలు పగులగొట్టి...సమయపాలన పాటించేలా చూస్తాంబార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ దుకాణాలు సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడపాలి. లేకుంటే తనిఖీలు నిర్వహించి, తగిన చర్యలు చేపడతాం. – అరుణకుమారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
జర్నలిస్టులపై దాడులు గర్హనీయం
చిలకలూరిపేట: జర్నలిస్టులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్వర్దన్పై కారెంపూడిలో టీడీపీ వర్గీయులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే అనుబంధ చిలకలూరిపేట ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాల్గో స్తంభంగా పరిగణించే మీడియా స్వేచ్ఛపై దాడులు జరగడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. జర్నలిస్టులు వ్యక్తిగత అభిప్రాయంతో పనిచేయరని, వారు ఏ పార్టీకి అనుకూలం, లేదా వ్యతిరేకం కాదని వెల్లడించారు. కేవలం నిజాలు మాత్రమే వెలికితీసే పనిని జర్నలిస్టులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తప్పులు చేయకుంటే జర్నలిస్టులు వారి గురించి తప్పుగా రాయాల్సిన అవసరం ఉండదని, తప్పు చేసిన వారే దాడులకు పాల్పడటం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. ప్రభుత్వం, పోలీసులు జర్నలిస్టులపై దాడికి పాల్పడేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ జిలాని, చిలకలూరిపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అన్నలదాసు శేషగిరి, షేక్ అబ్దుల్ సత్తార్, సభ్యులు షేక్ అల్లాబక్షు, కాట్రు శ్రీనివాసరావు, షేక్ హసన్‌వలి, షేక్ కరిముల్లా, దార్ల బుజ్జిబాబు, మలాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భక్తవత్సలరావు -
వీరాంజనేయునికి మామిడి ఫలార్చన
తెనాలి: పట్టణ మారీసుపేటలోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో గల వీరాంజనేయ స్వామికి ఈ నెల 22వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష ప్రదక్షిణముల మహాయజ్ఞం కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఆరంభమైన కార్యక్రమంలో భాగంగా రోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. భక్తులు తమ శక్తిని అనుసరించి ప్రదక్షిణములు చేస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంలోనూ సామూహికంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్వామి వారికి మామిడి ఫలార్చన చేశారు. తదుపరి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగాయి. లలితా గోష్టి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. 22న హనుమజ్జంతి వేడుకను నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంధి సేతుమాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధరరావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఇబ్బంది లేకుండా రేషను పంపిణీ – వీడియో కాన్ఫరెన్సులో మంత్రి మనోహర్ తెనాలి: రాష్ట్రప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరకుల పంపిణీ నిలిపివేతకు తీసుకున్న నిర్ణయం సున్నితమైనందున లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రేషను పంపిణీ నిర్వహించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బుధవారం సాయంత్రం తెనాలి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీ సంబంధిత చౌకధరల దుకాణాల వద్దే జరుగుతుందని చెప్పారు. అరవై అయిదేళ్లు పైబడిన కార్డుదారులు, అంగవైకల్యం కలిగిన లబ్ధిదారులకు మాత్రం ఇంటి వద్దే సరకులు పంపిణీ చేస్తారని తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తుల దాఖలు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల కారణంగా కొంత వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు సత్తెనపల్లి: కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు గద్దె చలమయ్య, ఆయన సతీమణి ఐద్వా రాష్ట్ర నాయకురాలు గద్దె ఉమశ్రీ కారులో బుధవారం గుంటూరు వెళ్లి తిరిగి సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో సత్తెనపల్లి నుంచి ఆటోలో పరుచూరి రాధా, పరుచూరి ఉషశ్రీ, శ్యాం సాయి, ఆటో డ్రైవర్ బలుసు పాటి సాంబశివరావులు గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో మండలంలోని కంటెపూడి రిథమ్ హోటల్ సమీపంలో రెండు వాహనాలు ఢీ కొనడంతో ఆటో పూర్తిగా రోడ్డు పక్కన కంపలోకి పల్టీకొట్టింది. కారు ముందు భాగం ధ్వసంమైంది. కారులోని ఇరువురికి, ఆటోలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్దె చలమయ్య, ఉమాశ్రీలను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి తరలించగా మిగిలిన నలుగురిని గుంటూరు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. -
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025లో భాగంగా ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 కేంద్రాల పరిధిలో ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ)లకు దరఖాస్తు చేసిన 6,845 మంది విద్యార్థుల్లో 6,603 మంది హాజరయ్యారు. గుంటూరు జిల్లా పరిధిలోని 15 కేంద్రాల్లో 4,317 మందికిగాను 4,144, బాపట్ల జిల్లాలోని రెండు కేంద్రాల్లో 684 మందికిగాను 662, పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో 1,844 మందికిగాను 1,797 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తనిఖీ చేసి లోనికి అనుమతించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,603 మంది హాజరు -
కిల్కారి కాల్ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని బుధవారం ఆర్మ్ సెంట్రల్ బృందం విజిట్ చేసింది. ఈ సందర్భంగా కిల్కారి కార్యక్రమం అమలు గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకుంది. పనితీరును అభినందించింది. అనంతరం సంగం జాగర్లమూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బృంద సభ్యులు సందర్శించారు. ఆరోగ్యకేంద్రం స్థాయిలో కిల్కారి కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తల పని తీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలతో ముచ్చటించారు. కిల్కారి కాల్ సర్వీస్‌ను కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రవేశం పెట్టినట్లు వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించటానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని, 01244451660 అనే నంబర్ నుంచి కాల్ రావడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, ఇన్చార్జి డీపీహెచ్ఎన్ఓ డాక్టర్ ప్రియాంక, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజు, డీసీఎం సురేష్ పాల్గొన్నారు. -
యోగా మన దేశ అపూర్వ సంపద
గుంటూరు వెస్ట్: వేల సంవత్సరాల క్రితం రుషుల కృషి ఫలితంగా యోగా అనే అపూర్వ సంపద మన దేశానికి దక్కిందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. యోగా మాసంలో భాగంగా బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాపై విస్తృత అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమాలు నెల రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. యోగాంధ్ర థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతను, ఉపయోగాలను వివరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా రంగోలి, ర్యాలీ, మారథాన్, పరుగు, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. యోగా సాధన నిర్వహించనున్న ప్రాంతాల్లో ట్రైనర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఎం వర్సిటీలో స్పోర్ట్స్ కోటా అడ్మిషన్లు
మంగళగిరి: నీరుకొండ గ్రామంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో స్పోర్ట్స్’ కోటా అడిషన్లు ప్రారంభమయినట్లు మంగళవారం డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. బీటెక్ ఇంజినీరింగ్‌తో పాటు బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డిగ్రీ కోర్సులలో అడిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు నూరు శాతం స్కాలర్షిప్ కల్పించామన్నారు. టెన్త్ , ఇంటర్ పాసై క్రీడారంగంలో ప్రతిభ చూపుతున్న విద్యార్థులు బీటెక్, బీఎస్సీ, బీఏ, బీబీఏ కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. బీటెక్‌లో చేరే విద్యార్థులు టెన్త్, ఇంటర్లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి వుండాలని, అదే విధంగా బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సులలో విద్యార్థులు 45 శాతం మార్కులు వచ్చి వుండాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒలింపిక్ గేమ్స్, సౌత్ ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నవారు డైరెక్ట్‌గా అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. రాష్ట్రస్థాయిలో పేరున్న క్రీడాకారులకు స్పోర్ట్ప్ ట్రయల్ రన్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 18 వరకు స్పోర్ట్స్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ ఎగుమతిదారుల సమావేశం కొరిటెపాడు(గుంటూరు): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచి ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఓ హోటల్లో మంగళవారం ఎగుమతిదారుల సమావేశం జరిగింది. సమావేశానికి ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి.ప్రభు అధ్యక్షత వహించారు. ఎగుమతిదారులకు బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల రుణాలు, విదేశీ మారక ద్రవ్య లావాదేవీల పద్ధతులు, అంతర్జాతీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఎస్బీఐ ఏజీఎంలు రామ్‌ప్రసాద్, రమేష్‌బాబు, విజయ రాఘవయ్య, సూర్యశేఖర్, మేనేజర్ శ్రీను నాయక్, ఈసీజీసీ అధికారులు, పలువురు ఎగుమతిదారులు పాల్గొన్నారు. -
పాత్రికేయులపై దాడులు సిగ్గుచేటు
పట్నంబజారు: పాత్రికేయులపై కూటమి నేతలు దాడులు చేయటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా కారంపూడిలో కూటమినేతల చేతిలో దాడికి గురైన సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో ఇన్చార్జ్ అశోక్ వర్ధన్‌ను మంగళవారం ఏటీ అగ్రహారంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా తెలియజేసే పత్రికలు, పాత్రికేయులపై ఇటువంటి దాడులు హేయమైన చర్య అని అన్నారు. కేవలం ఉద్దేశపూర్వకంగా ‘సాక్షి’పై కావాలనే కూటమి నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను ప్రజలకు చాటి చెబుతుందన్న అక్కస్సుతోనే పాత్రికేయులపై దాడి చేశారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అశోక్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే నిందితులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట కార్పొరేటర్లు షేక్ రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. సాక్షి టీవీ ప్రతినిధిపై దాడి గర్హనీయం సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సాక్షి టీవీ ప్రతినిధి అశోక్ వర్ధన్‌పై సర్పంచి వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారే దాడులకు పాల్పడడం గర్హనీయమని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం అశోక్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడే పత్రికలు, పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులపై దాడులు సహేతకం కాదని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అన్ని వర్గాల వారు ఖండించాలని.. బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బడేపురంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్
తాడికొండ: తాడికొండ మండలం బడేపురం గ్రామంలో కూటమి నేతల కనుసన్నల్లో అక్రమంగా మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. అర్ధర్రాతిళ్లు పొక్లెయిన్ల సాయంతో మట్టి తవ్వి ఇష్టానుసారంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి అక్రమ మైనింగ్ జరుగుతుండగా గుర్తించిన మణికంఠ అనే యువకుడు ఇదేమని ప్రశ్నించాడు. దీంతో యువకుడిపై కూటమి నేతలు బెదిరింపుల పర్వానికి దిగారు. మాకు అడ్డువచ్చేంత మాత్రపు వాడివా, నీ అంతు చూస్తా.. పోలీసు స్టేషన్లో పెట్టి కొట్టిస్తా అంటూ బూతు పదజాలంలో బెదిరించారు. దీనిపై సదరు యువకుడు సోమవారం తాడికొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ యువకుడు మీడియాకు సైతం సమాచారం ఇచ్చి, సోమవారం అర్ధరాత్రి సమయంలో మైనింగ్ ప్రాంతానికి తీసుకెళ్లగా మీడియా ప్రతినిధులను చూసిన కూటమి నేతలు మైనింగ్ వాహనాలు తీసుకుని పరుగులు పెట్టారు. దీనిపై ఇప్పటికే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాగా, విచారించి తగు చర్యలు తీసుకుంటామని సీఐ కె.వాసు తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రశ్నించిన యువకుడికి బెదిరింపులు తాడికొండ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు -
మాతృ మరణాలపై సమీక్ష
లక్ష్మీపురం: జిల్లాలో మాతృమరణాలు సంభవించకుండా క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది గర్భిణుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రణాళిక ప్రకారం పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం కలక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి మాతృ మరణాల సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లాలో గత సంవత్సరం చివరి త్రైమాసికం, ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో జరిగిన ఐదు మాతృ మరణాలపై సంబంధిత వైద్య అధికారులు, వైద్యనిపుణులు, బాధితుల బంధువులతో ఇన్చార్జి కలెక్టర్ సమీక్షించారు. డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, డీఐఓ శ్రావణ బాబు, డీసీహెచ్ఎస్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్లను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలి లక్ష్మీపురం: ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యే కొత్త స్కానింగ్ సెంటర్స్ మరియు రెన్యువల్ స్కానింగ్ సెంటర్లను తప్పనిసరిగా ప్రోగ్రాం ఆఫీసర్లు సందర్శించి తనిఖీ చేయాలని, చట్టాన్ని ఉల్లఘించిన కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధ్యక్షతన గర్భస్థ లింగ నిర్ధారణ చట్టంపై డిస్ట్రిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేయాలన్నారు. స్కానింగ్ కోసం కేంద్రాలకు వచ్చే గర్భిణుల నుంచి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలపై అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి, ప్రోగ్రామ్ నోడల్ అధికారి డా. శ్రావణ్ బాబు మాట్లాడుతూ తెనాలిలో డెప్యూటీ డీఎంహెచ్ఓ , మిగిలిన చోట్ల ప్రోగ్రామ్ ఆఫీసర్లు స్కానింగ్ ఆఫీసర్లుగా తనిఖీ చేస్తారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌కు తెలిపారు. జిల్లాలో మొత్తం 298 గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షా కేంద్రాలు వున్నాయని, వాటిలో రెన్యువల్ రిజిస్ట్రేషన్ కోసం ఐదు, మాడిఫికేషన్ కోసం 25 , క్యాన్సిలేషన్ కొరకు ఆరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. అలాగే కొత్తగా 11 స్కానింగ్ సెంటర్లు రిజిష్ట్రేషన్ చేసుకొన్నారని వాటిని కమిటీ సభ్యులు, ప్రోగ్రాం ఆఫీసర్లు తనిఖీ చేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా కమిటీ కొత్త స్కానింగ్ సెంటర్లు, రెన్యువల్, మాడిఫికేషన్, క్యాన్సిలేషన్‌ను ఆమోదం తెలపడం జరిగింది. కమిటీ సభ్యులు డాక్టర్ రాజ్యలక్ష్మి , డాక్టర్ అనిత , డీఎస్పీ శ్రీనివాసులు, ఎన్జీఓ సీడ్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.రోషన్ కుమార్ డా. రవీంధ్ర నాయక్ , డీఏడబ్ల్యూ ఎన్.నిర్మల మేరీ , డెమో జయప్రసాద్ , లీగల్ కన్సల్టెంట్ బి.వాణి , హెల్త్ ఎడ్యుకేటర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు -
● వజ్రోత్సవ జూబిలీ ముగింపు వేడుకల్లో విశ్రాంత బిషప్ గాలిబాలి ● 8 జిల్లాలనుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు ● తరలి వచ్చిన భక్తులు ● ప్రత్యేక ఆకర్షణగా తేరు ఊరేగింపు
క్రీస్తు చూపిన మార్గంలో నడుద్దాం అచ్చంపేట: ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి గౌరవ ప్రదమైన జీవితాన్ని పొందాలని, ఏసు క్రీస్తుపై నమ్మకం ఉంచాలని గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత బిషప్ గాలిబాలి అన్నారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు దేవాలయం నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గత మూడు రోజులుగా జరుగుతున్న జూబిలి వేడుకలు సోమవారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో 8 జిల్లాల నుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు, 100 మంది కన్యాసీ్త్రలు, 50 మంది విచారణ గురువులు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత పీఠాధిపతి గాలిబాలి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. వైభవంగా తేరు ప్రదక్షిణ విశాఖపట్నం అగ్రిపీఠాధిపతులు ఉడముల బాల, నల్గొండ జిల్లా విశ్రాంత పీఠాధిపతి గోవిందుజోజి, ఏలురు పీఠాధిపతి పొలిమేర జయరావు, శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్, నెల్లూరు మేత్రాసన కోఆజ్యుటర్ పీఠాధిపతులు పిల్లి అంథోనిదాస్, వరంగల్ మేత్రాసన పరిపాలాధికారి విజయపాలేరెడ్డిలతో పాటు అనేమంది విచారణ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక విచారణ గురువులు పుట్టి అంతోనిరాజు, సహాయ విచారణ గురువులు శ్యామ్‌కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నృత్యరీతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాలనుంచి క్రైస్తవులు తండోప తండాలుగా తరలి వచ్చారు. రాత్రి 10 గంటలకు నిర్వహించిన తేరు ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. రంగురంగుల కాంతులతో బాణసంచా కాలుస్తూ గ్రామ వీధులలో తేరు (రథం)పై బాలఏసును అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి, గ్రామాలనుంచి తరలి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్స్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
గుంటూరు వెస్ట్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిందేనని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ మాట్లాడుతూ 2004 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన వారి సంఖ్య 3.5 లక్షలు ఉందన్నారు. ఈ ఉద్యోగుల భవిష్యత్తును నూతన పెన్షన్ స్కీం ద్వారా ప్రభుత్వాలు కొలిమిలోకి నెట్టేసినట్లు అయ్యిందన్నారు. తమ పోరాటాల ఫలితంగా 2017లో గ్యాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్లు సాధించామని చెప్పారు. ఏపీఈఏఈ జిల్లా అద్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల కనీస సమస్యలు కూడా పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరుకాదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. అనంతంర జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో కార్యదర్శి లక్ష్మీనారాయణ, సుబ్బారావు, ఉద్యోగులు పాల్గొన్నారు. సీపీఎస్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ -
సువర్ణ భారతి మహాద్వారం ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేటలోని శ్రీశృంగేరీ శంకరమఠం మార్గంలో నూతనంగా నిర్మించిన సువర్ణ భారతి మహాద్వారాన్ని మంగళవారం శ్రీశృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీ మహాస్వామి ప్రారంభించారు. అనంతరం శంకరమఠంలోని శ్రీశంకర చంద్రమౌళీశ్వరస్వామి, శ్రీశారదాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాద్వారం నిర్మాణానికి సహకరించిన వేదాంతం సీతారామ అవధాని, కపలవాయి విజయకుమార్‌లకు ఆశీస్సులు అందజేశారు. స్వామివారి రాకతో మఠంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళా బృందాలు కోలాటాలు, భక్తి గీతాలాపనలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. -
జర్నలిస్టుపై దాడి హేయం
గుంటూరు మెడికల్: మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వైఎస్ ఎంపీపీ ఉప ఎన్నిక న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అశోక్వర్ధన్పై కొందరు స్థానిక వ్యక్తులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) నేతలు ఖండించారు. ఈమేరకు మంగళవారం బాధితుడు అశోక్వర్ధన్తో పాటు పలువురు జర్నలిస్టులు ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా జర్నలిస్టు యూనియన్ నగర అధ్యక్షుడు వి.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా వార్తల సేకరణకు వెళ్లిన అశోక్‌వర్ధన్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. యూనియన్ నగర కార్యదర్శి కె.ఫణీంద్ర మాట్లాడుతూ కూటమి నేతలు జర్నలిస్టులపై దాడులు జరగకుండా నిలువరించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘సాక్షి’ మీడియాపై మూడు సార్లు దాడులు జరిగాయయని వెల్లడించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జి డి.రమేష్‌బాబు, ఫొటోగ్రాఫర్ రామ్‌గోపాలరెడ్డి, సుభాని, మొండితోక శ్రీనివాసరావు, పి.ప్రశాంత్(నాని), డి.ప్రకాష్, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, ఎం.కోటిరెడ్డి, సీహెచ్ కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సురేంద్రనాథ్, రాఘవ, జయపాల్, శ్రీనివాస్, తుమ్మలకిరణ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన అడిషనల్ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేత -
హనుమత్ జయంత్యుత్సవాలు
తెనాలి: స్థానిక మారీసుపేటలోని శ్రీకోదండ రామస్వామివారి దేవస్థానం (రామభక్త అప్పలస్వామిగుడి)లో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామికి హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పూజా కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజున స్వామివారికి ఆకు పూజ, ప్రాతఃకాల అర్చన, వడమాల, అప్పలమాల సమర్పించారు. హనుమత్ జయంతి రోజు స్వామివారికి విశేష కార్యక్రమాల్లో భాగంగా భక్తుల చేత పంచామృత అభిషేకం, డ్రై ఫ్రూట్స్ పళ్లరసాలతో అభిషేకం, తమలపాకులతో సహస్రనామావళి పూజ, మామిడి పండ్లతో అష్టోత్తరం, ఎంతో విశేషమైన మన్య సూక్తం హోమం జరిపిస్తున్నట్లు ధర్మకర్త లంక శివానంద్ కుమార్ తెలియజేశారు. ధర్మకర్తలు కునపల్లి నారాయణస్వామి, లంక శివాంజనేయ ప్రసాద్ పర్యవేక్షించగా, విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ కార్యక్రమాలను జరిపించారు. వీరాంజనేయుడుకి తులసి దళార్చన తెనాలి: పట్టణ మారీసుపేటలోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో గల వీరాంజనేయస్వామికి ఈనెల 22వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష ప్రదక్షిణముల మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈనెల 12వ తేదీనుంచి ఆరంభమైన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణంలోనూ సామూహికంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వామివారికి తులసి దళార్చన చేశారు. తదుపరి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. లలితా గోష్టి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. సామూహిక సిందూరార్చన జరిపించారు. 22న హనుమజ్జంతి వేడుకను నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంధి సేతుమాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధరరావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025చీరాల: తీరం వద్ద ఘోరం జరిగింది. వాడరేవు సాగర తీరంలో స్నేహితులందరూ సరదాగా సేద తీరేందుకు ఉత్సాహంగా నవ్వుతూ, కేరింతలు కొడుతూ కారులో వచ్చారు. సాయంత్రం వరకు సరదాగా గడిపారు. తిరిగి ఏమైనా అల్పాహారం తినేందుకు చీరాల వస్తున్న వారి కారు టైరు పేలిపోవడంతో అదుపు తప్పిన ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా ఏమైందో తెలియదు. ప్రమాదం నుంచి తేరుకుని ఏమైందో తెలుసుకునే సరికి అప్పటి వరకు సరదాగా గడిపిన స్నేహితులు రక్తగాయాలతో చెల్లాచెదురుగా పడిపోయారు. హహాకారాలు, రోదనలతో వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు అంబులెన్స్‌లో క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలంలో ఇద్దరు మృతిచెందగా మరొకరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందారు. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...చీరాల మండలం వాడరేవు–పిడుగురాళ్ల 167ఎ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నల్లపాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజికి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఇన్నోవా కారులో గుంటూరు నుంచి చీరాల మండలం వాడరేవు బీచ్‌కు వచ్చారు. సాయంత్రం వరకు సరదాగా గడిపిన వీరు తిరిగి అల్పాహారం తీసుకునేందుకు చీరాల వస్తున్నారు. జాతీయ రహదారిపై వాడరేవు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన రోహిత్ నాయక్ (19), అజయ్ (18) సంఘటనా స్థలంలో మృతిచెందారు. స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కార్తీక్ (24) మృతిచెందాడు. మరో ఐదుగురు యవకులకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ ఎండి మోయిన్, రూరల్ ఎస్సై చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చీరాల వచ్చిన వారిలో ఒకరిది తెనాలి కాగా మిగిలిన వారందరు గుంటూరుకు చెందిన వారే. గుంటూరుకు చెందిన వారిలో ముగ్గురు మృతిచెందారు. మృతుల కుటుంబ సభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. ప్రమాద ఘటనపై రూరల్ సీఐ శేషగిరిరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషాదం నింపిన విహారయాత్ర... సరదాగా గడిపేందుకు స్నేహితులుతో విహార యాత్రకు వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. అందరూ చిన్న వయస్సు వారే. పాలిటెక్నిక్ సీనియర్లు, జూనియర్లు అందరూ కలిసి సరదాగా గడుపుదామని కారులో చీరాల వాడరేవు బీచ్‌కు వచ్చారు. గుంటూరు నుంచి బాపట్ల వచ్చి అనంతరం చీరాల వచ్చారు. మధ్యాహ్నం తర్వాత చీరాల వచ్చిన వీరు సాయంత్రం వరకు బీచ్‌లో ఆనందంగా గడిపారు. ఇంటికి వెళ్లే క్రమంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. కారు యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో రెప్పపాటులో స్నేహితులు విగతజీవులయ్యారు. కళ్లముందే స్నేహితులు రక్తపుమడుగులో ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తీవ్రగాయాలైన వారు రోదనలతో వైద్యశాల నిండిపోయింది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు గుండెలవిసేలా రోధిస్తున్నారు. అందరూ చిన్న వయస్సు వారు. తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా ఉంటారని అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. న్యూస్‌రీల్ టైరు పేలి పల్టీ కొట్టిన కారు గుంటూరు నుంచి వాడరేవుకు కారులో వచ్చిన 9 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు సంఘటనా స్థలంలో ఇద్దరు, వైద్యశాలలో ఒకరు మృతి క్షతగాత్రులకు ఏరియా వైద్యశాలలో చికిత్స -
వైఎస్ జగన్ ఫొటో ఉందని సెక్రటరీ సస్పెన్షన్
నెహ్రూనగర్: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో ఫ్లెక్సీలో ఉందనే కారణంతో గుంటూరు నగరంలోని 91వ వార్డు సచివాలయం అడ్మిన్ సెక్రటరీ పూర్ణిమను సస్పెండ్ చేస్తూ నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలు ప్రత్యేకంగా సచివాలయం కనిపించే ఉద్దేశంతో బోర్డులను ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు. అయితే గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బోర్డుల్లోని మాజీ సీఎం ఫొటోలు కనిపించకుండా స్టిక్కర్లు, అంటించుకోవాలని సిబ్బందికి అధికారులు తగు ఆదేశాలు జారీ చేశారు. కొత్త బోర్డులు రాకపోవడంతో సచివాలయాల వద్ద పాత బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయితే రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఏటీ అగ్రహారం జీరో లైన్ 91వ సచివాలయం బయట బోర్డుకు ఉన్న స్టిక్కర్ వర్షానికి తడిచి ఊడిపోయింది. దీంతో అటుగా వెళ్లే కొంత మంది మాజీ సీఎం ఉన్న ఫొటోను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని అదునుగా తీసుకున్న నగరపాలక సంస్థ అధికారులు సచివాలయ వార్డు అడ్మిన్ సెక్రటరీ ఎన్.పూర్ణిమను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు సకాలంలో బోర్డులు తొలగించి ఉంటే ఈ సస్పెన్షన్ ఉండేది కాదు కాదా.. అధికారులు చేసిన తప్పిదానికి మమ్మల్ని బలిని చేస్తారా అంటూ సచివాలయ సెక్రటరీల యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. -
శ్రీవారికి వైభవంగా శ్రీచక్రస్నానం
తెనాలి: పట్టణంలో చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ అనంతరం స్వామివారికి వసంతోత్సవం, శ్రీచక్రస్నానం సంప్రదాయబద్ధంగా జరిపించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణం, పూర్ణాహుతి జరిపించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు.మహంకాళీ దేవస్థానంలో చండీ హోమందుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో 48వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా నాల్గవ రోజు మంగళవారం చండీ హోమం నిర్వహించారు. పోసాని నాగేశ్వరరావు దంపతులు హోమంలో పాల్గొన్నారు. భక్తులకు అమ్మవారు ధనలక్ష్మీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈఓ కె.సునీల్ కుమార్ పర్యవేక్షించారు.వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలంకొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. జూన్ 2వ తేదీ లోపు వ్యవసాయ శాఖలోని అన్ని విభాగాల్లో బదిలీలు పూర్తి చేయాలని తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల మేరకు ఒక ప్రాంతంలో ఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. మిగిలిన వారు కూడా రిక్వస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ), మండల వ్యవసాయ అధికారులు(ఏఓ), ఏడీఏ, డీడీఏ, మినిస్టీరియల్ స్టాఫ్, వాచ్మెన్, అటెండర్స్ తదితర అన్ని విభాగాల్లోనూ బదిలీల ప్రక్రియ ఉండటంతో ఎవరికి వారు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు ప్రజాప్రతినిధుల సిఫారసుల కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. కొన్ని స్థానాలకు ఉద్యోగుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో డబ్బు ఖర్చు చేయడానికి సైతం వెనకాడటం లేదని చెబుతున్నారు.సమగ్రశిక్ష ఏపీసీగా పద్మావతి బాధ్యతలు స్వీకరణగుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ)గా ఐ.పద్మావతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని సమగ్రశిక్ష విభాగంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.సాయుధ దళాల నిధికి రూ.లక్ష విరాళంగుంటూరు వెస్ట్: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు తరఫున రూ.లక్ష చెక్కును జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చేతులమీదుగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఆర్.గుణషీలాకు బ్యాంకు అధికారులు అందజేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ దేశం కోసం పాటుపడే సైనికుల సంక్షేమాన్ని కేవలం ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా పంచుకోవాలన్నారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు క్లస్టర్ హెడ్ జె.హరిప్రసాద్, ఎస్కె గౌస్‌బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐసెట్‌లో సత్తా చాటిన మనోళ్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన రావూరి మాధుర్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా నుంచి ఐసెట్‌కు హాజరైన 1,528 మంది విద్యార్థుల్లో 1,485 మంది ఉత్తీర్ణులయ్యారు. బాపట్ల, చీరాల నుంచి పరీక్షలు రాసిన 354 మంది విద్యార్థుల్లో 338 మంది ఉత్తీర్ణత సాధించారు. పల్నాడు జిల్లాలో పరీక్షకు హాజరైన 725 మంది విద్యార్థుల్లో 678 మంది ఉత్తీర్ణులయ్యారు. కోచింగ్ లేకుండానే 5వ ర్యాంకు ఐసెట్‌లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించిన విద్యార్థిని రావూరి మాధుర్య ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. ఆమె తండ్రి నాగేశ్వరరావు గతంలో వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం ఆర్కెస్ట్రా గ్రూప్‌లో తబలా వాయిద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు ఇద్దకు కుమార్తెలు కాగా పెద్దమ్మాయి స్రవంతి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతోంది. రెండో కుమార్తె మాధుర్య 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ప్రామాణిక పుస్తకాలను చదువుతూ సొంతంగా ప్రిపేర్ అవుతోంది. ఎస్సెస్సీ పరీక్షలకు వ్యవధి ఉండటంతో ఏపీ ఐసెట్‌కు దరఖాస్తు చేసి, ఎటువంటి కోచింగ్ లేకుండా నేరుగా పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు కై వసం చేసుకుంది. ఆమెతో పాటు ఐసెట్ రాసిన ఆమె అక్క స్రవంతి 1,233వ ర్యాంకు సాధించింది. ఐసెట్ ర్యాంకు ఆధారంగా ఆంధ్ర విశ్వ విద్యాలయంతో పాటు ఏదైనా ప్రముఖ వర్శిటీలో ఎంబీఏలో చేరి, తన లక్ష్యమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎస్సెస్సీకి సన్నద్ధమవుతానని చెబుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత లాం విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు -
పశ్చిమ డెల్టా మరమ్మతులకు రూ.25 కోట్లు మంజూరు
జలవనరుల శాఖ ఎస్ఈ వెంకటరత్నం తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలోని పంట, మురుగు కాల్వల మరమ్మతులను జూన్ పదో తేదీలోగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ పులిపాటి వెంకటరత్నం సూచించారు. పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం స్థానిక జలవనరుల శాఖ డివిజన్ కార్యాలయం హాలులో నిర్వహించారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు అధ్యక్షత వహించారు. ఇంజినీర్ వెంకటరత్నం మాట్లాడుతూ ఖరీఫ్ సీజను ఆరంభానికి మరమ్మతుల పనులన్నీ పూర్తికావాలని ఆదేశించారు. నారుమడులకు సాగునీటిని జూన్ పదో తేదీ నాటికి పంట కాల్వలకు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆలోగా కాల్వలు, డ్రెయిన్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసిందని వెల్లడించారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు మాట్లాడుతూ పశ్చిమ డెల్టాలో పంట, మురుగు కాల్వలకు మరమ్మతుల్లో మొత్తం 746 పనులను గుర్తించినట్టు తెలిపారు. -
దుగ్గిరాల మండల ఉపాధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం
దుగ్గిరాల: స్థానిక మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నిక సోమవారం నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి డ్వామా పీడీ శంకర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. టీడీపీ నుంచి ఎనిమిది మంది, జనసేన నుంచి ఒకరు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ప్రిసైండింగ్ అధికారి ఎన్నిక ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ సభ్యులంతా గైర్హాజర్ అయ్యారు. తుమ్మపూడి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు వాసిరెడ్డి లక్ష్మీదేవి మంచికలపూడి ఎంపీటీసీ సభ్యుడు మరీదు రాము పేరును ప్రతిపాదించారు. ఈమని–1 ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి సాయి చైతన్య బలపరిచారు. దీంతో మరీదు రాము ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రిసైడింగ్ అధికారి ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించి ప్రమాణం చేయించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు.ఆర్టీసీ స్థలాల లీజుపై 22న సమావేశంపట్నంబజారు: గుంటూరు జిల్లా పరిధిలోని పెదకాకాని, తెనాలి, పెదనందిపాడు బస్సు స్టేషన్ల పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు ఈనెల 22న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ తెలిపారు. ఆసక్తి గల వారు ఆ రోజు సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఆర్టీసీ.ఏపీ.జీవోవి.ఇన్‌లో లేదా 9959225412 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.గరుడ వాహనంపై గ్రామోత్సవంతెనాలి టౌన్: వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 7.30 గంటలకు నిత్య హోమం, బలిహరణ, ఉదయం 8గంటలకు గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దివ్య రథోత్సవం, ప్రత్యేక పుష్పాలంకరణ, మేళతాళాలు, విద్యుత్ దీప కాంతుల నడుమ స్వామి గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణ ప్రజలంతా తిలకించి తరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు.ఈఏపీ సెట్ ప్రారంభంగుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రిక ల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) సోమవారం ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 3,347 మంది విద్యార్థులు హాజరయ్యారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 22 కేంద్రాల పరిధిలో సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో జరిగిన ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 3,588 మంది విద్యార్థుల్లో 3,347 మంది హాజరయ్యారు. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా, ఈనెల 21 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఆయా కేంద్రాల పరిధిలో ఆన్లైన్ సీబీటీ పరీక్షలు సజావుగా జరిగాయి. -
ఏదీ.. ఆనీటి వైభవం !
తాడేపల్లి రూరల్: రెండు రాష్ట్రాల మధ్య ప్రముఖ జల రవాణా మార్గమైన బకింగ్ హామ్ కెనాల్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. వేల ఎకరాల కాలువ భూములు ఆక్రమణల చెరలో ఉండటంతో రూపురేఖలను కోల్పోయింది. కెనాల్ మొత్తం పొడవు 427 కిలోమీటర్లు. కృష్ణా, గోదావరి డెల్టాలను కలుపుతూ ప్రవహిస్తుంది. కొన్నిచోట్ల సముద్రానికి మూడు మైళ్లు, ఎక్కువ భాగం అర కిలోమీటరు దూరంలోనూ ఉండడం విశేషం. కొంత భాగం పులికాట్ సరస్సు పరిధిలో ఉంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కాలువ బకింగ్ హామ్ కెనాల్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. 1806లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కో క్రైన్స్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు. దీంతో కొంతకాలం ఆయన పేరు మీదే కోక్రైన్స్ కెనాల్ అని పిలిచేవారు. లీజుకు తీసుకున్న ఆయన ఓడల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. 1837లో బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి గవర్నర్ డ్యూక్ బకింగ్‌హామ్ పర్యవేక్షణలో కాలువ పనులు జరగడంతో ఆ పేరు వచ్చింది. బంగాళాఖాతం తీరానికి కిలోమీటరు దూరంలో, ఆంధ్రాలోని కాకినాడ నుంచి, చైన్నెలోని విల్లుపురం వరకు కాలువ నిర్మాణం జరిగింది. ఈ కాలువ ఆంధ్రప్రదేశ్‌లో 262 కి.మీ., తమిళనాడులో 165 కి.మీ. పొడవు ఉంది. ప్రధాన జల రవాణా మార్గం బకింగ్ హామ్ కాలువ బ్రిటిష్ వారి హయాంలో ఒక వెలుగు వెలిగింది. ఈ మార్గంలో రైల్వేలైన్ ఏర్పాటు చేయక ముందు ఇదే ప్రధాన జల రవాణాగా ఉంది. కాకినాడ నుంచి చైన్నె వరకు ఉన్న కాలువల్లో ఇది ఒకటి. గోదావరి జిల్లాలో కాకినాడ కాలువ, కృష్ణా జిల్లాలో ఏలూరు కాలువ, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల నుంచి బాపట్ల జిల్లా పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువగా దీన్ని పిలుస్తారు. పెదగంజాం నుంచి ఒంగోలు, కొత్తపట్నం మీదుగా చైన్నె వరకు బకింగ్‌హామ్ కెనాల్‌గా పిలుస్తారు. దుగ్గిరాల లాకుల వద్ద చీలిక 1855లో కృష్ణా బ్యారేజ్‌ని నిర్మించిన తరువాత ఈ కాలువ నిర్మాణం పూర్తయింది. విజయవాడ వద్ద కృష్ణా బ్యారేజ్ వద్ద నుంచి కుడి ప్రధాన కాలువ దుగ్గిరాల లాకుల వద్ద రెండుగా చీలుతుంది. వాటిలో ఒక కొమ్మమూరు కాలువ కాగా, రెండవది నిజాంపట్నం కాలువ. దుగ్గిరాల లాకుల వద్ద మొదలైన కొమ్మమూరు కాలువ సంగం జాగర్లమూడి, చేబ్రోలు, కొల్లిమర్ల, నర్సాయపాలెం, కారంచేడు, సంతరావూరుల మీదుగా పెదగంజాంవద్ద వరకు ఉంది. పెదగంజాం వద్ద ఇది బకింగ్‌హామ్ కాలువతో కలుస్తుంది. కొమ్మమూరు కాలువ మంచినీటితో కూడిన పంట కాలువ కాగా, బకింగ్ హామ్ కాలువ ఉప్పునీటి కాలువ. అప్పట్లో కాలువపై రవాణాకు అనుగుణంగా కాకినాడ నుంచి చైన్నె వరకు పలు చోట్ల లాకులను నిర్మించారు. వీటిని 150 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు గల చాంబర్లతో ఏర్పాటు చేశారు. జాతీయ జలమార్గం–4గా కేంద్రం ప్రతిపాదన జల రవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని వజీరాబాదు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉన్న కృష్ణానది, భద్రాచలం వద్ద నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న గోదావరి, కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కృష్ణా కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్‌హామ్ కాలువలన్నింటినీ కలిపి జాతీయ జలమార్గం–4గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలను కలిపే 1,095 కిలోమీటర్ల పొడవైన దీన్ని జాతీయ జలమార్గం–4గా ప్రకటించారు. జాతీయ జలమార్గాల బిల్లు ద్వారా 2008 నవంబర్‌లో దీన్ని జాతీయ జలమార్గంగా ప్రకటించారు. అప్పట్లో 2013 నాటికి పూర్తి చేయాలని తలపెట్టారు. కానీ నేటికీ జాతీయ జలమార్గం–4 ఊసే లేకపోయింది. పలుచోట్ల ఆక్రమణల చెరలో కాలువ భూములు అభివృద్ధి చేస్తే తక్కువ వ్యయంలో జల రవాణా మార్గం ప్రతిపాదనలను పక్కన పెట్టిన కేంద్రం పూడికతీతకు నోచుకోని బకింగ్ హామ్ కెనాల్ బ్రిటిష్ వారి హయాంలో బకింగ్‌హామ్ కెనాల్ ఒక వెలుగు వెలిగింది. ఇప్పటి పాలకుల నిర్లక్ష్యంతో ఉపయోగంలో లేకుండా పోయింది. దక్షిణ భారతావని 1876, 1878లో కరువు కోరల్లో చిక్కుకున్న సమయంలో ఆహార ధాన్యాల తరలింపులో కీలకపాత్ర పోషించింది. 1880 నుంచి 1940 వరకు అతి తక్కువ ఖర్చులో ప్రజల, సరుకుల రవాణా సౌకర్యానికి ఉపయోగపడింది. స్వాతంత్య్రానంతరం 1947 నుంచి దీన్ని ఉపయోగించడం తగ్గింది. అప్పటికి రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో ఈ కాలువ ద్వారా రవాణా నిలిచిపోయింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న కొమ్మమూరు కాలువ ద్వారా పడవల రవాణా నిలిచిపోయినప్పటకీ సాగు, తాగునీటి కాలువగా ఉంది. పెదగంజాం నుంచి పిలువబడే బకింగ్‌హామ్ కాలువ ఉప్పునీటితో ఉంటుంది. జల రవాణా నిలిచిపోవడంతో భారీగా ఆక్రమణలకు గురైంది. కొన్ని చోట్ల రూపురేఖలను కోల్పోయింది. వేల ఎకరాల కాలువ భూములు ఆక్రమణకు గురయ్యాయి. దీన్ని జల రవాణా మార్గంగా అభివృద్ధి చేస్తే తక్కువ వ్యయంలో సరుకులు రవాణా చెయ్యవచ్చు. పర్యాటకంగా కూడా కాలువ ఆకర్షణీయ మార్గంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బకింగ్‌హామ్ కెనాల్‌ను జల రవాణా మార్గంగా అభివృద్ధి చేసే చర్యలు చేపట్టాల్సి ఉంది. కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన గేట్లు సైతం తుప్పు పట్టి శిథిలావస్థ కు చేరుకుంటున్నాయి. -
పూజల్లో సామాన్య భక్తులకు అవకాశం
పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఐదు రోజులపాటు జరిగే పూజల్లో సామాన్య భక్తులకు రిక్త హస్తం చూపుతున్నారని ‘సాక్షి’లో సోమవారం ‘పెద్దలకే పెద్దపీట’ పేరుతో కథనం వెలువడింది. దీనిపై హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు, ఆలయ అధికారులు స్పందించారు. ఐదు రోజులపాటు జరిగే సేవా కార్యక్రమాల్లో సామాన్య భక్తులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా సోమవారం జరిగిన లక్ష తులసి మొక్కల పూజల్లో మహిళలు, సామాన్య భక్తులు పాల్గొన్నారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంపై హర్షం వ్యక్తం చేశారు. కొనసాగుతున్న రశీదుల పరంపర గతంలోనే ‘సాక్షి’లో నాజ్ సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో జరుగుతున్న పూజలకు రశీదు ఇవ్వడం లేదని కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన లక్ష తులసి దళం పూజకు హాజరైన దాతలు రూ. 5,116, ప్రత్యేక హోమానికి రూ. 5,116, క్షీరాభిషేకానికి రూ. 1,116లు రుసుం చెల్లించారు. ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమైన తరువాత అసిస్టెంట్ కమిషనర్ సుభద్ర ఆలయాన్ని సందర్శించారు. రుసుం చెల్లించకుండా ఎట్టి పరిస్థితుల్లో పూజలు నిర్వహించేందుకు అనుమతులు లేవని తేల్చి చెప్పారు. దీంతో దీక్ష సమాజం సభ్యులు ప్రతి పూజకు రశీదులు అందిస్తున్నారు. -
అర్జీదారులను పదే పదే తిప్పుకోవద్దు
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను అధికారులు పదే పదే తమ కార్యాలయాలకు తిప్పుకోవద్దని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా రోజుల తరబడి వేచి చూస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలు వినాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పారు. ప్రజలు కూడా అర్జీలను స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చని, దీంతో ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని, సమస్యల పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని అధికారులకు తెలిపారు. అనంతరం వచ్చిన 190 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ -
ప్రత్యేక అవసరాలు గల బిడ్డలు ఎందరికో తల్లిగా మారింది
మరెన్నో విజయాలు.. 2014లో భోపాల్‌లో జరిగిన ఓపెన్ ఛాంపియ్షిప్లోనూ కి.మీ, 2 కి.మీ విభాగాల సైక్లింగ్‌లో బంగారుపతకం, రజత పతకాన్ని నీహారిక సాధించింది. ఈ విజయంతో 2015లో లాస్‌ఎంజెల్స్‌లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌కు ఎంపికై నా, అనివార్య కారణాలతో సైక్లింగ్‌లో పాల్గొనేందుకు వీల్లేకపోయింది. యూనిఫైడ్ వాలీబాల్ గేమ్‌లో భారత జట్టుకు ఆడి, కాంస్య పతక సాధనకు తోడ్పడింది. రెండు స్పెషల్ ఒలింపిక్స్‌లో ఆడి పతకాలను సాధించటం నిస్పందేహంగా నీహారిక ఘనతే. ఇందుకు పునాది, పట్టుదల, తపన ఆమె తల్లి భార్గవిది. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదనేందుకు నిదర్శనమే వీరి విజయం. -
అదే.. ఆ తల్లి ప్రత్యేకత
● మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక ● కంటిపాపలా చూసుకున్న తల్లిదండ్రులు ● ఆనందాన్నీ, అవసరాలను వదులుకున్నారు ● బిడ్డ కోసం టీచరుగా మారిందా తల్లి ● ఇష్టమైన సైక్లింగ్‌లోనూ శిక్షణనిచ్చింది ● స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గేలా చూశారు ● ఇప్పుడా బిడ్డలాంటి మరికొందరికోసం ఏకంగా అలాంటి పాఠశాలనే నడుపుతోందా తల్లి తెనాలి: ‘‘అది 2019 సంవత్సరం మార్చి నెల. 14–21 తేదీల్లో దుబాయ్‌లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్. 25 గేమ్స్‌లో 170 పైగా దేశాలకు చెందిన ఏడు వేల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 280 మంది వివిధ పోటీల్లో తలపడ్డారు. ఇందులో సైక్లింగ్‌లో 16 మంది పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ యువతి ఆ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో యువతి 500 మీటర్లు, కిలోమీటరు పోటీలు రెండింటిలోనూ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాలను కై వసం చేసుకుంది. రెండు కి.మీ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ఆ యువతే 2018లో రాంచీలో నిర్వహించిన జాతీయ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో కిలోమీటరు సైక్లింగ్‌లో బంగారు పతకం, రెండు కి.మీ విభాగంలో రజత పతకం గెలిచి, స్పెషల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.’’ మానసిక పరిపక్వత లేదని సమాజం ఈసడించింది. తనపై డబ్బు ఖర్చుచేసినా, శ్రమ వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం లేదు... తిండి, బట్ట ఇస్తే సరిపోతుందని తలిదండ్రులకు జాగ్రత్తలు చెప్పింది. అయితే సమాజం మాటవిని ఆ పాపను తల్లిదండ్రులు వదిలేయలేదు. తనకోసం తమ ఆనందాల్నీ, అవసరాలనూ వదులుకున్నారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు నీహారికను తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలలో చదివిస్తూ తనకెంతో ఇష్టమైన సైక్లింగ్‌లో శిక్షణనిస్తూ వచ్చిందా తల్లి భార్గవి. తద్ఫలితమే.. నీహారిక సాధించిన విజయాలు. భార్గవి సొంతూరు చినపరిమి భార్గవి సొంతూరు తెనాలి సమీపంలోని చినపరిమి. భర్త ఆర్మీ ఉద్యోగి ముక్కామల శివరామకృష్ణ. 2001లో తొలి కాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఏడాదిన్నర వచ్చినా నడక రాకపోవటంతో అనుమానం వేసింది. ఉద్యోగరీత్యా అప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఉన్నారు. ‘ఒకసారి న్యూమోనియాకు ఇచ్చిన మందు ఓవర్‌డోస్ అయి, నాలుగురోజులు పాప కోమాలో ఉంది... తెలివొచ్చేసరికి మాటలు బాగా తగ్గిపోయాయి..చెప్పిందీ అర్థం చేసుకోవటం తగ్గింది. డ్రమ్స్ మోగినా, బాణసంచా పేలుళ్లు విన్నా, భయంతో వణికేది...పెరిగేకొద్దీ ఆ భయం ఎక్కువైంది’ అని భార్గవి గుర్తుచేసుకున్నారు. అయిదో ఏడు వచ్చేసరికి ఆగ్రాకు వెళ్లారు. అక్కడి డాక్టర్లు ‘ఇంటలెక్చువల్ డిసేబిలిటీ’ అన్నారు. ‘పిల్లలతో విపరీతంగా ప్రవర్తించేది అప్పుడే...డ్రమ్స్, బాణసంచా మోతకు భయపడిపోయేది. ఎవరినీ దగ్గరకు రానిచ్చేదికాదు...తనొక్కతే ఏదొక వస్తువుతో ఆడుకుంటూ ఉండేది...ఆ క్రమంలో సైకిల్ తనను బాగా ఆకర్షించింది...చిన్న సైకిల్ నడిపేది. పాడైపోతే కొత్తది కొనేదాకా ఊరుకునేది కాదు...ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను’ అన్నారు భార్గవి. అప్పటికి తనకు మరో బాబు కలిగాడు. కుమార్తె కోసం త్యాగాలు.. పాప ఆరోగ్యం కారణంగా హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చేర్పించారు. కొడుక్కి హోం వర్క్ చేయించేటపుడు, నీహారికను దగ్గరుంచారు. స్పీచ్ థెరపీనీ ఇప్పించారు. 2013లో విజయవాడకు వచ్చేశారు. 2013 నవంబరులో ఇలాంటి పిల్లల కోసం ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని తెలుసుకున్నారు. 2014లో పార్టిసిపేట్ చేసేలా చూశారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు పాపను నిద్రలేపటం, హైవేపై 10 కి.మీ ప్రాక్టీస్ చేయించి, ఇంటికి తీసుకొచ్చేవారు. తర్వాత ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’కు తీసుకెళ్తారు. నీహారిక కోసం తనుకూడా అదే స్కూలులో ఉద్యోగం చేశారు భార్గవి. శివరామకృష్ణ కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. విభిన్న ప్రతిభావంతులకు తల్లిలా.. తన బిడ్డ నీహారిక లాంటి మరికొందరి కోసం ఇప్పుడా తల్లి ఏకంగా స్కూలునే నడుపుతోంది. 2020లో ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టరు చేశారు. 2022 నుంచి ఆ సొసైటీ తరఫున సాయి అంకుర్ స్పెషల్ స్కూల్‌ను ఆరంభించారు. 2019లో స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాల సాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్‌మనీతో మొదలుపెట్టిన స్కూలుకు ఇప్పుడు సొంత డబ్బులు పడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల మద్దతు తోడవుతోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం, అవసరాలను తీర్చుకోవటం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా శిక్షణనివ్వటం తమ ఆశయమని చెప్పారు భార్గవి. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని ‘సాయి అంకుర్ స్పెషల్ స్కూల్’ ఇప్పుడు భార్గవి ప్రపంచం. 24 ఏళ్ల కుమార్తె నీహారికతో సహా పదిహేనుమంది విభిన్న ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడ పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఆటలతో బోధన ఉంటుంది. రోజువారీ స్కూలుకు వెళుతూ రెమిడియల్ క్లాసుకు వచ్చేవారూ ఉన్నారని భార్గవి చెప్పారు. తనతోపాటు అక్కడ ముగ్గురు టీచర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. పాప కోసం ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’ టీచరుగా పనిచేసిన భార్గవి, ఇప్పుడు ఏకంగా అలాంటి స్కూలునే నడుపుతూ ఎందరికో తల్లిలా మారింది. -
వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
ఈ ఏడాది ఫిబ్రవరిలో నా భర్త సాయిబాబు బల్బు బిగిస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు చేయి మణికట్టు వద్ద విరిగింది. స్థానిక కొత్తపేటలోని హాస్పిటల్‌కు తీసుకెళితే సర్జరీ చేశారు. చేసిన మరుసటి రోజే ఆయనకు కుడివైపు పక్షవాతం వచ్చింది. కనీసం ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయకపోగా హడావుడిగా మమ్మల్ని బయటకు పంపేశారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబాన్ని నడిపించే నా భర్త అచేతనంగా పడి ఉండడానికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. మెడికల్ వెరిఫికేషన్ పెట్టించాలని మనవి. –జక్కంపూడి శ్రీవల్లి, గుంటూరు -
ప్రజారవాణాలో డ్రైవర్లది ముఖ్యపాత్ర
నరసరావుపేట: శిక్షణ తీసుకున్న డ్రైవర్లు ప్రమాదరహితంగా వాహనాలను నడుపుతూ ఇంధన పొదుపు డ్రైవర్లుగా మెలగాలని జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.మధు ఆకాంక్షించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఉన్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న 19వ బ్యాచ్ డ్రైవర్లకు సోమవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణాలో డ్రైవర్లది ముఖ్యపాత్రని, శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండాలని సూచించారు. చెడు అలవాట్లకు స్వస్తి పలికి సేవా దృక్పఽథం అలవర్చుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించి ప్రమాదాలు నివారించాలని వెల్లడించారు. డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డిపో మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు వివరించారు. కార్యక్రమంలోడ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు పి.బొల్లయ్య, షేక్ సుభాని పాల్గొన్నారు. పీటీడీ జిల్లా అధికారి మధు శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు ప్రదానం -
ఉద్యోగాల పేరిట మోసం
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో మోసగించారని కొందరు, కంపెనీలో వచ్చే లాభాల్లో పర్సంటేజీలు ఇస్తామని మోసగించారని ఓ మహిళ వాపోయింది. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు– పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) నిర్వహించారు. బాధితుల ఫిర్యాదులను జిల్లా ఏఎస్పీలు (పరిపాలన) రమణమూర్తి, కె.సుప్రజ (క్రైం) స్వీకరించారు. వారి మొరను అలకించారు. ఫిర్యాదిదారులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు స్వీకరించిన వారిలో డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), శివాజీరాజు (సీసీఎస్), శ్రీనివాసరెడ్డి (మహిళ పీఎస్) ఉన్నారు. బాధితుల గగ్గోలు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో మొర -
సమాజంలో ఉత్తమ వైద్యులుగా సేవలందించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య రంగంలో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి విద్యార్థి అందిపుచ్చుకుని సమాజంలో ఉత్తమ వైద్యులుగా సేవలందించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. చంద్రమౌళీనగర్‌లోని భాష్యం మెడెక్స్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ హరిబాబు అధ్యక్షత వహించారు. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భాష్యం మెడెక్స్ నుంచి వందలాది మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ఎయిమ్స్, జిప్మర్ వంటి సంస్థల్లో సీట్లు సాధించి వైద్యవిద్యనభ్యసించడం అభినందనీయమని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. వైద్యవృత్తిలో నైపుణ్యం సాధించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం మెడెక్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు సీట్లు సాధించి ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలల ద్వారా వైద్యవిద్యనభ్యసించి దేశ, విదేశాల్లో ఉత్తమ వైద్యులుగా రాణించడం ఒక గురువుగా తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. భాష్యం విద్యార్థులు ప్రపంచం నలుమూలలా భాష్యం ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.చంద్రశేఖర్‌ను భాష్యం రామకృష్ణ దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో భాష్యం మెడెక్స్లో విద్యనభ్యసించిన 300 మంది వైద్య విద్యార్థులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ -
ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు
గుంటూరు లీగల్: ఈనెల 19 నుంచి జులై 5 వరకు జరగనున్న లోక్ అదాలత్‌లో మోటార్ వెహికల్ ప్రమాదాల కేసులు ఎక్కువ సంఖ్యలో పరిష్కరించడానికి కృషి చేయాలని నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్‌బాబు చెప్పారు. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ప్రతినిధులు, న్యాయవాదులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. మోటార్ వెహికల్ ప్రమాదాల కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. కంపెనీ మెంబర్స్, కౌన్సెల్స్ పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. సమస్యలుంటే పిటిషనర్‌ను, అతడి కౌన్సెల్‌ను కూడా పిలిపించి ప్రీ సిట్టింగ్ ద్వారా కేసును రాజీ చేయాలని ఆయన సూచించారు. రెండో అదనపు జిల్లా జడ్జి వై. నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై.సూర్యనారాయణ, ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్కు పలు సలహాలు, సూచనలు చేశారు. సమావేశంలో బార్ కౌన్సెల్ సభ్యుడు వి.బ్రహ్మారెడ్డి, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్, నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్ పాల్గొన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ బాబు -
వ్యాపారంలో వాటా ఇస్తానని..
గుంటూరు లక్ష్మీపురంలోని ఓ ట్రేడింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేశా. వచ్చే లాభాల్లో పర్సంటేజీ ఇస్తానని యజమాని నమ్మించాడు. నేను రూ.20 లక్షలు, మరో ఇద్దరు రూ.10 లక్షలు చెల్లించారు. ఏళ్లు గడిచినా తిరిగి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆ ఏరియాలో కార్యాలయం లేదు. తెలిసిన వారి వద్ద అప్పులు, బ్యాంక్‌లో రుణం తీసుకుని అతనికి చెల్లించాను. ఈ క్రమంలో యజమాని భార్య మాతో అమర్యాదగా మాట్లాడుతోంది. వ్యాపారం లాభాల్లో పర్సంటేజ్ ఇస్తానని మోసగించిన అతనిపై చర్యలు తీసుకోవాలి. – సబ్బినేని రోజ, వైష్ణవినగర్, పొన్నూరు టౌన్. పాప చికిత్సపై విచారణ చేపట్టాలి గత నెల 9న మా కుమార్తె లాస్య(16)కు జ్వరంలో మూర్ఛలు వచ్చాయి. కొత్తపేట గౌరీశంకర్ థియేటర్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాం. రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అక్కడ నుంచి వారి ఆసుపత్రికి తరలించారు. మరో రెండు రోజులు పర్యవేక్షణలో ఉండాలని అక్కడి వైద్యులు సూచించారు. అదే రోజు రాత్రి వైద్యులు పిలిచి, పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో డిశ్చార్జ్ చేయాలని కోరాం. డిశ్చార్జ్ చేయడంలో అలస్యమైంది. రాత్రి తొమ్మిది తర్వాత చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించే క్రమంలో 11వ తేదీ ఉదయం పాప మృతి చెందింది. డిశ్చార్జ్ విషయంలో నిర్లక్ష్యం, పాపకు అందించిన చికిత్సపై విచారించాలని కోరుతున్నాం. – లాస్య తల్లిదండ్రులు కల్యాణ్, ఉమాదేవీ, మారుతీనగర్ బాధితుల సమస్య వింటున్న జిల్లా ఏఎస్పీ రమణమూర్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు ఓ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నా. ఈ క్రమంలో ఓ వ్యక్తి పరిచయమయ్యారు. ఉద్యోగాల నిమిత్తం నలుగురు విద్యార్థులం కలిసి అతడి వద్దకు వెళ్లాం. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరేందుకు ఒక్కొక్కరూ రూ.1.85 లక్షలు చెల్లించాలని చెప్పారు. దీంతో మొత్తమ్మీద రూ.7.40 లక్షలు అతనికి చెల్లించాం. ఈ క్రమంలో చిరునామా లేని ఓ కంపెనీలో ఆఫర్ లెటర్లు ఇచ్చారు. ఆ కంపెనీ ఫేక్ అని, గతంలోనూ పలువురిని మోసగించినట్లు తెలిసింది. ఉద్యోగాల పేర్లతో మోసగించిన వ్యక్తిని విచారించి తమకు న్యాయం చేయాలి. – సయ్యాద్ఖాజా, ఆర్టీసీ కాలనీ ఆర్మీలో ఉద్యోగమని రూ.34 లక్షలు ... ఆర్మీ ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా తెలిసిన బంధువు పరిచమయ్యారు. ఆర్మీలో ఉద్యోగం ఇప్పి స్తానని నన్ను, కుటుంబ సభ్యులను నమ్మించారు. నెల్లో ఉద్యోగం వస్తోందని, అందులో వారికి డబ్బులు చెల్లించాలని చెప్పి దఫాల వారీగా రూ.34 లక్షలు తీసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో వైజాగ్‌లోని ఓ రూంలో బస చేయించాడు. తర్వాత అక్కడ నుంచి పంపించేశాడు. దీంతో మోసగించినట్లు తెలిసి డబ్బులు అడిగితే వాయిదాలు వేస్తున్నాడు. పెద్దల సమక్షంలో డబ్బులు చెల్లిస్తానని ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడు. పొలం, ఇంటి స్థలం విక్రయించగా వచ్చిన సొమ్ము, అప్పులు చేసిన డబ్బులు అతనికి చెల్లించాను. న్యాయం చేయాలి. – బాధితుడు, పొన్నూరు ● -
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
పట్నంబజారు: మహిళపై లైంగిక దాడితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపరిచిన ఘటనపై నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్టేషన్ ఎస్హెచ్ఓ వై.వీరసోమయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 12న మధ్యాహ్నం సుద్దపల్లి డొంక ప్రగతీ నగర్ 7వ లైనుకు చెందిన మహిళ తల్లి ఇంటికి వెళ్లింది. చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన షేక్ షాబాజ్ ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి అమ్మమ్మ రాహెలమ్మ రావడంతో ఆమెను నెట్టివేసి అక్కడి నుంచి షాబాజ్ పరారయ్యాడు. మరుసటిరోజు 13వ తేదీన నిందితుడు షాబాజ్, ఆయన మేనమామ నాగూల్ మీరా, బంధువులు నాసర్ హుసేన్, హనీఫ్‌లు మహిళ ఇంటి వద్దకు వెళ్లి, జరిగిన విషయాన్ని ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. దీంతోపాటు కులం పేరుతో దూషించి వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు షేక్షాబాజ్ను సోమవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ షేక్ అబ్దుల్ రహమాన్, సిబ్బందిని అభినందించారు. నిందితుడు షాబాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
పేదల ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
గుంటూరు వెస్ట్: పేదల ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి సోమవారం అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం ఒక ప్రభుత్వ శాఖతో వీలుపడదని, అన్ని శాఖల మండల, జిల్లా అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇనుము అందుబాటులో ఉందని, ఇసుక కూడా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌసింగ్ లేఅవుట్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని తెలిపారు. గృహ నిర్మాణాలకు గానూ లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. పొలాల్లో నీటి కుంటల తవ్వకాల టార్గెట్ పూర్తి చేయాలని జేసీ చెప్పారు. రైస్ కార్డును ఏడురకాల సర్వీసు ప్రొవైడర్లు ఇస్తున్నారని, కొన్ని కేటగిరిల్లో వచ్చిన 11,446 సర్వీసు రిక్వెస్టులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పురోగతిలో ఉండాలని, దీనికి సంబంధించి ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని జేసీ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, హౌసింగ్ పీడీ ప్రసాద్, స్టెప్ సీఈఓ ఆర్.చంద్రమణి, డ్వామా పీడీ శంకర్, సీపీఓ శేషశ్రీ , అధికారులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ -
విద్యుత్ షాక్‌తో రైతు దుర్మరణం
నాదెండ్ల: విద్యుత్ షాక్‌కు గురై రైతు దుర్మరణం పాలైన సంఘటన మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చేకూరి హనుమంతరావు (70) తూబాడు రోడ్డులో తనకున్న వ్యవసాయ భూమిలో నర్సరీ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో పొలానికి వెళ్లి ఇనుప గేటు తీసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం చుట్టూ రక్షణగా వేసిన ఇనుప కంచెకు విద్యుత్ వైరు తగిలి విద్యుత్ ప్రవహించినట్లు తెలుస్తోంది. దీంతో గేటు తీసే క్రమంలో షాక్‌కు గురైనట్లు భావిస్తున్నారు. ఈ పొలాన్ని కౌలుకు తీసుకున్న చంటి అనే వ్యక్తి సాయంత్రం 4 గంటల సమయంలో వెళ్లగా, విగతజీవిగా పడిఉన్న హనుమంతరావును చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.నగలు చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్టుచిలకలూరిపేట: బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణంలోని డైక్మెన్ కాలనీకి చెందిన పేదాల రాముడు, మదర్ థెరిస్సా కాలనీలో నివాసం ఉంటున్న బీరా సిద్దు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన యలగాల హనుమాయమ్మ ఈ నెల ఆరోతేదీన ఇంటికి తాళం వేసి సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి 11వ తేదీ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. పరిశీలించగా 42 సవర్ల బంగారు నగలు, 59.40 గ్రాముల వెండి వస్తువులు, రాగి బిందెలు, చెంబులు, ఇత్తడి సామగ్రి దొంగతనానికి గురైనట్లు గుర్తించి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వీటి విలువ సుమారు రూ. 34లక్షలు ఉంటుంది. రూరల్ సీఐ బి.సుబ్బనాయుడు, ఎస్ఐ జి.అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి నిందితులను చిన పసుమర్రు గొర్రెల మండి వద్ద అరెస్టు చేసి వారి నుంచి చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందిన వారంలోపు నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి నగలు స్వాధీనం చేసుకోవడంపై పోలీసు సిబ్బందికి డీఎస్పీ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐలు డి.రోసిరాబు, జి.సుబ్బారావు, హెచ్‌సీలు కె.దేవరాజు, జె.శ్రీధర్, పీసీలు ఎం.ఇర్మియా, బి.అశోక్, ఎం.రత్నకిశోర్ పాల్గొన్నారు.ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతిసంతమాగులూరు (అద్దంకి రూరల్): క్వారీలో పనికి వెళ్తూ ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈఘటన ఆదివారం రాత్రి సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన ఇలుమలై నాగరాజ్ (44) సజ్జాపురం గ్రామంలో ఉన్న తిరుమల సాయిచంద్ర గ్రానైట్ క్వారీలో పనిచేస్తుంటాడు. ఆదివారం రాత్రి ట్రాక్టర్ కొండ ఎక్కుతుండగా తిరగబడింది. ట్రాక్టర్ నడుపుతున్న నాగరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్ఐసీ పాలసీలపై జీఎస్టీ తొలగించాలి
సత్తెనపల్లి: పాలసీలపై జీఎస్టీ తొలగించాలని పాలసీదారులకు బోనస్‌ను పెంచాలని ఎల్ఐసీ ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఐదు లాంతర్ల సెంటర్లో గల మాడా విశ్వేశ్వరరావు ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన లియాఫీ ఏజెంట్ల యూనియన్ మచిలీపట్నం డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాలసీదారులకు లోన్‌పై వడ్డీ రేటు తగ్గించాలని, ఏజెంట్లు అందరికీ మెడి క్లైమ్ను కుటుంబ సమేతంగా కల్పించాలని కోరారు. గ్రూప్ ఇన్స్యూరెనన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నంత కాలం కలిపించాలని డిమాండ్ చేశారు. సమాజంలో దిగువ తరగతి వారికి రూ. లక్ష పాలసీ ప్రవేశ పెట్టాలని మేనేన్మెంట్ను ఆయన కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సత్తెనపల్లి బ్రాంచి అధ్యక్షుడు మంచాల రమేష్ మాట్లాడుతూ ఎల్ఐసీ ఏజెంట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు అని, ఎల్ఐసీని బలోపేతం చేయడంలో కీలకమని తెలిపారు. ఏజెంట్లు అభివృద్ధికి సంస్థ కృషి చేయాలని కోరారు. సమావేశంలో డివిజన్ నాయకులు రవీంద్రరెడ్డి, అలిమియా, జగన్నాథం, రఘు, శ్రీనివాసరెడ్డి, మారుతి, సత్తెనపల్లి బ్రాంచి ఎల్ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు. ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ పాలసీదారులకు బోనస్ పెంచాలి -
మద్యం మత్తులో డ్రైవింగ్
తాడేపల్లి రూరల్: ఫూటుగా మద్యం తాగి కారును విచక్షణారహితంగా నడపడంతో వృద్ధుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి రోడ్డులో పెనుమాక–ఉండవల్లి మధ్య ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నరేష్ అనే వ్యక్తి బొలేరో వాహనంలో పెనుమాక నుంచి ఉండవల్లి వెళుతున్నాడు. ఈక్రమంలో ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక వెళ్తున్న బ్రహ్మయ్య (60) ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బ్రహ్మయ్యతో పాటు వాహనంపై వున్న మరో వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. వీరి వెనుక వున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో అతనికీ గాయాలయ్యాయి. బొలెరో వాహనం రెండు వాహనాలను ఢీకొట్టడంతో రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు గాలిలోకి ఎగిరి రోడ్డు మీద పడ్డారు. అనంతరం బొలెరో వాహనం రోడ్డు పక్కన వున్న కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్యతో పాటు గాయపడ్డ ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బ్రహ్మయ్య మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మద్యం మత్తులో వున్న నరేష్‌ను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభంక్రోసూరు: స్థానిక జెడ్పీ పాఠశాల ఆవరణలో వైఎంసీఏ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను కంచేటి సాయిబాబు ఆదివారం ప్రారంభించారు. మొత్తం 40 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు అఖిల్ తెలిపారు. సాయిబాబు మాట్లాడుతూ క్రీడల వల్ల యువతకు ఆరోగ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. పోటీలలో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.50,116, ద్వితీయ బహుమతిగా రూ.25,116, మూడో బహుమతిగా రూ.10,116, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు రూ.5,116 అందించనున్నట్లు వెల్లడించారు. బెస్ట్ బ్యాట్స్‌మన్‌కు రూ.2,116, బెస్ట్ బౌలర్‌కు రూ.2,116 అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దిగుమర్తి అప్పారావు, మన్నెం శ్రీను, వెంకటరామిరెడ్డి, బండారు రాము, కంభంపాటి రాము, బాబు పాల్గొన్నారు. -
గుంటూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు గుంటూరులో జులై 23, 24 తేదీల్లో నిర్వహించనునట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ నరసింహారావు చెప్పారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం బి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇప్పటికై నా సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభకు మేస్త్రిలు, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ సహాయ సహకారాలు అందించాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న, లైసెనన్స్ టెక్నికల్ పర్సనన్స్ ఉద్యోగ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న జీవో నెంబర్ 20ని రద్దు చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, నాయకులు కే శ్రీనివాసరావు, బీ ముత్యాలు, పి దీవెనరావు, బాబురావు, డి కోటేశ్వరరావు, ఖాసీం వలి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం
సత్తెనపల్లి:బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చిలుకా జయపాల్ ఆదివారం ఖండించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులతో దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ చేశారని, అది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్త తప్పుడు ఫిర్యాదుతో మరోసారి అరెస్ట్ చేశారని తెలిపారు. సురేష్ ఇంటి వద్ద రాజు అనే టీడీపీ కార్యకర్త హల్చల్ చేసి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించాడని, కార్లను ధ్వంసం చేసి వీరంగం సృష్టించినా కనీసం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హల్చల్ చేసిన టీడీపీ కార్యకర్త రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీకో న్యాయం.. వైఎస్సార్ సీపీకో న్యాయమా? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రహించాలని జయపాల్ పేర్కొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు దళితుల పైన చూపిస్తున్న ప్రేమ ? అంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా అక్రమ అరెస్ట్‌లు మానుకోకపోతే ప్రజలే భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. విద్యుత్ పోల్ పైనుంచి పడి షిఫ్ట్ ఆపరేటర్ మృతినరసరావుపేట రూరల్: మండలంలోని ఉప్పలపాడు కరెంట్ ఆఫీస్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పనిచేస్తున్న రఫీ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. విద్యుత్ పోల్ మీద పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పోల్‌పై నుంచి కింద రాయిమీద పడటంతో తీవ్రగాయాలకు లోనై మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి అదృశ్యం మూడు రోజులుగా లభించని ఆచూకీ కారంచేడు: కారంచేడు పాలేటివారి బజారుకు చెందిన ఒక విద్యార్థి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఎప్పుడూ ఇల్లు కదలని విద్యార్థి అదృశ్యం కావడంపై పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మీనిగ జయప్రకాష్‌కు ఇద్దరు కుమారులు.. రెండో కుమారుడు మీనిగ సామ్యేల్ ప్రణీత్ చీరాలలోని ఒక ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో ఇంటి వద్దనే ఉంటున్న బాలుడు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి ఇంటి వద్ద నుంచి కనిపించడం లేదని బంధువులు తెలిపారు. మూడు రోజులుగా బంధువులు, స్నేహితుల వద్ద విచారించామని వారు చెబుతున్నారు. ఆదివారం తాను వాడుతున్న సైకిల్ పర్చూరు గ్రామంలోని ఉప్పుటూరు వంతెన వద్ద స్టాండ్ వేసి ఉండటం గమనించామని పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఆచూకీ తెలిసిన వారు 9515640934, 9542618260 నంబర్లకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. హెచ్ఐవీ,ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం బాపట్ల: హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టరు విజయమ్మ చెప్పారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 42వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ డే –2025 కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. మహిళలు క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులకు భరోసా కల్పించేందుకు ఈ ప్రదర్శన దోహద పడుతుందని తెలిపారు.హెచ్ఐవీ,ఎయిడ్స్ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేపడుతోందని తెలిపారు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి షేక్ మొహమ్మద్ సాదిక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ప్రారంభం
కొల్లూరు : రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు మండలంలోని క్రాపలో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జూనియర్ విభాగంలో 10 నిమిషాల వ్యవధిలో పోటీలను నిర్వహించారు. సోమవారం సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలోని ఐదు మండలాలలో ఇప్పటి వరకు బండ, బండి లాగుడు పోటీల్లో పాల్గొనని టైరు బండి ఎద్దులకు మాత్రం మంగళవారం పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ విభాగాలలో ప్రథమ బహుమతి నుంచి 8వ స్థానం వరకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయి టైరు బండి విభాగంలో ఆరు స్థానాల్లో నిలిచిన ఎడ్లకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రజల శాంతికి ఆటంకం కలిగిస్తే చర్యలు
నరసరావుపేట: జిల్లాలో ప్రజల శాంతికి ఆటంకం కలిగించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే ప్రదేశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా ఆదివారం పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లాడ్జీలు, వాహనాలు, నగర శివారు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై విస్తృత తనిఖీలు చేశారు. బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్లు కూడా పాల్గొన్నాయి. లాడ్జీల్లో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వ్యక్తులను ప్రశ్నించి, వివరాలు ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీచేసి వారి గుర్తింపు వివరాలను నమోదు చేశారు. ఖాళీ ప్రదేశాలు, శివారు నగర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై దాడులు నిర్వహించారు. అనంతరం వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు -
ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి అమానుషం
పర్చూరు(చినగంజాం): తిరుపతి జిల్లాలో అనుపల్లి జేమ్స్ అనే విద్యార్థిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జేమ్స్‌ను దళితుడని ఇబ్బందులకు గురిచేసిన యశ్వంత్ నాయుడుతోపాటు అతనిపై దాడికి పాల్పడిన రౌడీషీటర్ రూపేష్, చోటా బ్లేడ్, జగ్గా కిరణ్‌లను కఠినంగా శిక్షించాలని కోరారు. తిరుపతి విద్యానికేతన్ కాలేజీలో చివరిస సంవత్సరం చదువుతున్న జేమ్స్‌ను అతని కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన యశ్వంత్ నాయుడు హేళన చేశాడన్నారు. దళితుడని, ఒరేయ్ అంబేడ్కర్ అని రకరకాలుగా మాటలతో హింసిస్తుండగా. జేమ్స్ ఖండించాడని తెలిపారు. మరొక సారి ఇదే విధంగా మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించాడన్నారు. దీనినిపై పగ పెంచుకున్న యశ్వంత్ నాయుడు అతనిపై దాడి చేసి హింసించి నానా విధాలుగా పరుష పదజాలంతో తిట్టడంతో పాటు, కాళ్ళు చేతులు కట్టి వేసి కత్తితో హత్యాయత్నం చేశారని.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళితే కేసును తీసుకోకుండా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించారని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు వ్యవస్థలను పాడు చేస్తుంటే ప్రభుత్వం ఏమీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనార్టీల కోసం పనిచేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇటువంటి వ్యక్తుల భరతం పడతారని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు, కిడ్నాప్కేసు, పరువు నష్టం కేసు సెక్షన్లు అమలు చేస్తూ కేసు నమోదు చేసి జేమ్స్‌కు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ -
తెలుగు పలుకుబడులకు చిరునామా చేరెడ్డి
అద్దంకి: తెలుగు పలుకుబడులు, పదబంధాల విన్యాసం చేరెడ్డి మస్తాన్‌రెడ్డి కవిత్వంలో కనిపిస్తాయమని సాహిత్యవేత్త గాడేపల్లి దివాకరదత్తు అన్నారు. సాహితీ కౌముది ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డికి పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన పుట్టంరాజు కళాక్షేత్రంలో 2025 సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సభకు గాడేపల్లి దివాకరదత్తు అధ్యక్షత వహించారు. దేవపాలన మాట్లాడుతూ చేరెడ్డి రచనలు ప్రాచీన కావ్యాలను తలపిస్తుంటాయని అభినందించారు. పోలూరి వెంకట శివరామ ప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ పద్య సాహిత్యానికి చేరెడ్డి గౌరవాన్ని చేకూర్చారని చెప్పారు. పద్య కవులను ప్రోత్సహించడంలో చేరెడ్డి పాత్ర గొప్పదని వివరించారు. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి ‘మహాభారతం.. కవిత్రయ శైలి’ అనేది గొప్ప పరిశోధన అని శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అనంతరం చేరెడ్డి మస్తాన్‌రెడ్డికి సాహిత్య పురాస్కారాన్ని ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.5వేలు, పట్టుబట్టలు, సన్మాన పత్రం, జ్ఞాపకను అందజేశారు. కార్యక్రమంలో వారణాశి రఘురామశర్మ, చుండూరి మురళీ సుధాకర్‌రావు, కడియం పాపారావు, కె. సుబ్బారావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, కొండకావూరి కుమార్, ఆర్. రాజశేఖర్, కూరపాటి రామకోటేశ్వరరావు, సాహిత్యవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. పుట్టంరాజు సాహిత్య పురస్కారం అందజేత -
అబద్ధమే..
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘‘రీ సర్వేలో కూటమి ప్రభుత్వం, పరిపాలనా యంత్రాంగం ఎంతో అద్భుతమైన పనిని కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసి, ప్రోత్సాహక నిధుల్లో సింహభాగాన్ని దక్కించుకున్నారు. మొదటి దశలో 15 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రణాళికలో మూడు లక్షల భూ భాగాన్ని కవర్ చేశాం.’’ .. ఇదీ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో రెండురోజులపాటు జరిగిన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా సర్వే, రీసర్వేపై జరిగిన జాతీయ సదస్సులో చెప్పిన మాటలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీ సర్వేకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను ఎంపిక చేశారు. మూడునెలల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే జనవరి తొమ్మిదిన ఈ కార్యక్రమం చేపట్టినా ఇప్పటివరకూ ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తి కాలేదు. ఈ 14 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తికాగా రెండు గ్రామాల్లో తర్వాత దశ పనులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. 27,302.91 ఎకరాలు సర్వే చేయాలని నిర్ణయించగా తహసీల్దార్ లాగిన్‌కు వచ్చిన మ్యుటేషన్ల దశకు కేవలం మూడు గ్రామాలే వచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నాలుగైదు నెలలు పడుతుంది. రెండవ దశ కింద జిల్లాలోని కొప్పురావూరు, అంకిరెడ్డిపాలెం, బేతపూడి, హరిశ్చంద్రపురం, వంగిపురం, రావెల, గొడవర్రు, దుగ్గిరాల, కాకుమాను, సిరిపురం, దంతలూరు గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం తొమ్మిది గ్రామాల్లో సరిహద్దులు గుర్తించగా, మరో రెండు గ్రామాల్లో గుర్తించే పని నత్తనడకన కొనసాగుతోంది. ఇదే వేగంతో కనుక సర్వే పనులు జరిగితే మరో అయిదేళ్లకు కూడా రీసర్వే పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. యడ్లపాడు మండలంలో భూ రీ సర్వేకు డ్రోన్‌ను సిద్ధం చేస్తున్న సిబ్బంది (ఫైల్)న్యూస్‌రీల్ నేడు రీ సర్వేను ముందుకు తీసుకెళుతున్న కూటమి ప్రభుత్వం గుంటూరులో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహణ ఐదు నెలల క్రితం గుంటూరు జిల్లాలో 14 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు పూర్తికాని వైనం మళ్లీ 11 గ్రామాల్లో రెండో దశ సర్వే ప్రారంభం మరో ఐదేళ్లకు కూడా జిల్లా పూర్తి కాదంటున్న అధికారులు నాడు విప్లవాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా అడుగులు గత ప్రభుత్వంలో రీసర్వే చేస్తుంటే తప్పు జరిగిపోతోందంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఇదే పనిని మళ్లీ మొదలుపెట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద జిల్లాలో 62 గ్రామాలలో 1,42,450 ఎకరాల భూమిని రీసర్వే చేశారు. ఎనిమిది గ్రామాల్లో గ్రామకంఠం భూములను కూడా రీ–సర్వే పూర్తి చేశారు. ఎప్పుడో 1905లో బ్రిటీషర్లు చేపట్టిన తర్వాత 2020 వరకు మరే నాయకుడు దీని జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. అంతానాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రీసర్వేని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీని ద్వారా ప్రతి అంగుళం భూమిని మ్యాపింగ్‌లోకి తీసుకురావడంతోపాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఈ ప్రక్రియ గుంటూరు జిల్లాలో 2020 డిసెంబర్లో ప్రారంభమయ్యింది. తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద దుగ్గిరాల మండలంలోని దేవరాపల్లి అగ్రహారం, ప్రత్తిపాడు మండలంలోని కొండజాగర్లమూడి, వేమూరు మండలంలోని పులిచింతలపాలెం, యడ్లపాడు మండలంలోని మర్రిపాలెం, దాచేపల్లి మండలంలోని అలుగుమల్లిపాడులను ఎంపిక చేశారు. అక్కడ విజయవంతంగా పూర్తి చేశారు. సర్వే అనంతరం సంబంధిత భూమి, స్థలం యజమానికి ప్రింటెడ్ పాస్‌బుక్ ఉచితంగా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మొత్తం 223 గ్రామాలు ఉండగా గుంటూరు డివిజన్లో 119, తెనాలి డివిజన్లో 104 గ్రామాలు ఉన్నాయి. 47 గ్రామాల్లో సర్వే ఆఫ్ ఇండియాకు, 121 గ్రామాల్లో యుక్రా అనే సంస్థకు సర్వే బాధ్యతలు అప్పగించారు. సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించిన 47 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసింది. యుక్రా సంస్థ 46 గ్రామాల్లో డ్రోన్‌ను తిప్పింది. మొత్తం 93 గ్రామాల్లో డ్రోన్‌ను తిప్పి ఏరియల్ వ్యూ మ్యాపింగ్ పూర్తి చేశారు. 23 గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లను జారీ చేశారు. వీటిని క్షేత్రస్థాయిలో భూమితో పోల్చి నిజనిర్ధారణ(గ్రౌండ్ ట్రూతింగ్) చేసే ప్రక్రియ 22 గ్రామాల్లో పూర్తి అయ్యింది. అయితే రికార్డులలో ఉన్న భూమికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేకపోవడం వల్ల సర్వే పూర్తి చేయడంలో కొంతమేర ఇబ్బందులు వచ్చాయి. భూయజమానులు అందుబాటులో లేకపోవడం సర్వేలో ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వ వైఖరితో మరింత జాప్యం జరుగుతోంది. -
21న డీఈఓ కార్యాలయం ముట్టడి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వెల్లడి గుంటూరు ఎడ్యుకేషన్: విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 21న గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు ఐక్య వేదిక నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లా కోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు జిల్లా స్టీరింగ్ కమిటీ బాధ్యుడు కె.బసవలింగారావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. బసవలింగారావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యారంగానికి గొడ్డలి పెట్టువంటి 117 జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అంత కంటే ప్రమాదకరమైన జీవోలు 19, 21 ద్వారా తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను రూపొందించాలని పూనుకోవడం ఉపాధ్యాయ లోకాన్ని మోసం చేయడమేనని అన్నారు. తక్షణమే 19, 21 జీవోల ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు ఉండాలని ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటు నిర్ణయాన్ని అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా పునరుద్ధరించాలని, ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషలోనే బోధన ఉండాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖామంత్రి లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెడతామని, ఉన్నత పాఠశాలల నుంచి 3,4,5 తరగతులు వెనక్కి తీసుకు వచ్చి పూర్వ స్థితికి పాఠశాల వ్యవస్థ ను నెలకొల్పుతామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక నాయకుడు ఎం.కళాధర్, డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఐక్యంగా తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు బదిలీల్లో ఒక్కొక్కరికి ఒక్కో సమస్యను సృష్టించిన ప్రభుత్వం అనుసరిస్తున్న విభజించు, పాలించు కుట్రను ఉపాధ్యాయులు చైతన్యంతో ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసి ఉద్యమ శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఎస్జీటీలను ఇవ్వాలని, విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:20గా ఉండాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో 1:43 గా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఉండాలన్నారు. బేసిక్, మోడల్ ప్రాథమిక పాఠశాలలు తప్ప ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటు దిశగా ప్రభుత్వం మొండిగా ముందుకెళితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ మాన్యువల్ విధానంలోనే నిర్వహించాలని, రాష్ట్ర ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా స్పందించి పరిష్కరించకపోతే ఈనెల 21న డీఈఓ కార్యాలయం ముట్టడి తరువాత 23న విద్యాభవన్‌ను ముట్టడించి స్తంభింపచేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా నాయకులు జీవీరాజు, యు.రాజశేఖరరావు, మహమ్మద్ ఖాలీద్, కె.శ్రీనివాసరావు, కొండయ్య, రెహమాన్, పల్నాడు జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి, బాపట్ల జిల్లా ప్రతినిధులు ఎ. శ్రీనివాసరావు, జ్ఞానేశ్వరరావు, మూర్తి, లక్ష్మీనారాయణ, జి.వెంకటేశ్వరరావు, దాస్, శివన్నారాయణ, శ్రీనివాసరెడ్డి, లక్ష్మీపతి, బాలచంద్రారెడ్డి, కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగమే..!
తెనాలిటౌన్: శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహారణ, ఎదురుకోలోత్సవం వంటి కార్యక్రమాలను దేవస్థాన అర్చకులు నిర్వహించారు. అదే విధంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం వైభోవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వైకుంఠవాసుని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. కల్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలీయ బహూత్తమ సంఘం సభ్యులు స్థానిక షరాఫ్‌బజార్‌లోని శ్రీ భావాన్నాఋషి స్వామి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని వేడుకగా తరలివచ్చి వైకుంఠపురంలో స్వామివారికి సమర్పించారు. ముత్తయిదువులు, పద్మశాలీయ సంఘీయులు వేడుకలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ మంతెన అనుపమ పర్యవేక్షించారు. కల్యాణ మహోత్సవంలో డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల శ్యామ్‌ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. -
పేదల ఆస్పత్రిలో ఫీజులు!
ఉచిత సేవలు అందించలేరా..? గుంటూరు మెడికల్: క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆధునిక చికిత్సలతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్ ఏ దశలో ఉంది... శరీరంలో ఏ భాగంలో ఉంది.. ఎంతమేరకు వ్యాప్తి చెందింది.. క్యాన్సర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు పెట్ సీటీ స్కానింగ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షను ప్రైవేటు క్యాన్సర్ సెంటర్లో చేసినందుకు సుమారు రూ.25 వేల నుంచి 30 వేల వరకు తీసుకుంటున్నారు. ఎంతో ఖరీదైన పెట్‌సీటీ పరీక్షను ఉచితంగా అందించాలనే ఆశయంతో ప్రభుత్వం సుమారు రూ.18 కోట్ల ఖరీదు చేసే పెట్‌సీటీ మెషిన్‌ను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు మంజూరు చేసింది. త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చేలా వేగవంతంగా సివిల్, ఎలక్రిక్టల్, ఇతర పనులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పెట్సీటీస్కాన్ వైద్య పరికరం అందుబాటులోకి రావటంతో క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా పేద, మధ్య తరగతివారు ఎంతో సంతోషపడ్డారు. గతంలో ఈ పరీక్ష కోసం రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బందులు పడేవారు. వైద్య పరికరం రాకతో సంతోషపడుతున్న తరుణంలో పిడుగులాంటి వార్త చెవిని పడింది. శనివారం గుంటూరు జీజీహెచ్‌లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం( హెచ్‌డీఎస్) జరిగింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ, హెచ్‌డీఎస్ సభ్యుల సమక్షంలో పెట్ సీటీ పరీక్షకు సుమారు రూ.7వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై రోగులు, సహాయకులు మండిపడుతున్నారు. రోగులు, సహాయకుల ఆగ్రహం నాట్కో ట్రస్ట్ వారు ప్రతి ఏడాది సుమారు రూ.కోటి వ్యయం చేసే మందులు ఉచితంగా క్యాన్సర్ రోగులకు అందిస్తున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చొరవతో నేడు ఆస్పత్రిలో ఎందరో దాతలు ముందుకొచ్చి కోట్లాది రూపాయలు విరాళాలు అందిస్తూ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ రోగులకు వైద్య పరీక్ష పేరుతో రూ.7వేలు ఫీజు తీసుకోవటం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క ప్రాణాలు తీసే క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ చికిత్స పొందుతున్న రోగులు ఆర్థిక ఇబ్బంది పడేలా ఫీజులు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు క్యాన్సర్ రోగుల శ్రేయస్సు దృష్ట్యా వైద్య పరీక్షకు ఫీజు తీసుకోవాలనే విషయమై పునరాలోచించాలని పలువురు రోగులు కోరుతున్నారు. పెట్ సీటీ స్కానింగ్‌కు యూజర్ చార్జీలు ఒక్కో రోగి వద్ద రూ.7వేలు వసూలుకు రంగం సిద్ధం హెచ్‌డీఎస్ సమావేశంలో యూజర్ చార్జీలకు ఆమోదం క్యాన్సర్ రోగులపై తీవ్ర భారం జీజీహెచ్ వర్గాలపై విమర్శలు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాట్కో ట్రస్ట్ చైర్మన్ నన్నపనేని వీసీ సుమారు రూ.45 కోట్లతో క్యాన్సర్ రోగులకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించేందుకు నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను నిర్మించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 జూలై 1న నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. గతంలో కేవలం రేడియేషన్ ఆంకాలజీ వైద్యసేవలు మాత్రమే గుంటూరు జీజీహెచ్‌లో లభించేవి. నాట్కో క్యాన్సర్ సెంటర్ నిర్మించాక మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య విభాగాలు రావటంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బందిని సైతం ప్రభుత్వం నియమించింది. సుమారు రూ.15 కోట్లు ఖరీదు చేసే లీనియర్ యాక్సిలేటర్, రూ.2కోట్లు ఖరీదు చేసే బ్రాకీథెరపీ, రూ.5 కోట్లు ఖరీదు చేసే సీటీ స్టిమ్యూలేటర్ వంటి వైద్య పరికరాలను ప్రభుత్వం నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు ఇచ్చింది. దాంటోపాటుగా పెట్ సీటీ పరికరాన్ని సైతం మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగి ఎట్టకేలకు ఏడాదిన్నర తరువాత పెట్ సీటీ వైద్య పరికరం నేడు నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు వచ్చింది. వైద్య పరికరం వచ్చిందన్న ఆనందం కన్నా వైద్య పరీక్ష చేయించుకునేందుకు రూ.7వేలు చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయం తీసుకున్నారనే బాధే నేడు ఎక్కువ మంది రోగుల్లో నెలకొంది. -
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కొలువై ఉన్న ఆదిదంపతుల దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద జరిగిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, గణపతి హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ చేశారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. సర్వ దర్శనం, రూ.100, రూ. 300, రూ.500 టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానంతనం భక్తులకు దేవస్థానం ఉచిత ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలను అందించింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించడానికి అరగంట అన్ని దర్శనాలు నిలిపివేశారు. వీఐపీలు, సిఫార్సులపై వచ్చే భక్తులకు సైతం క్యూలైన్లోనే దర్శనానికి అనుమతించారు. సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పవర్ లిప్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
సత్తెనపల్లి: స్థానిక పవర్ హౌస్ ఫిట్‌నెస్‌లో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పల్నాడు జిల్లా నుంచి జట్టు ఎంపిక ఆదివారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఆర్పీ ఆనంద్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి 2 జూన్ వరకు రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఏక్విపైడ్ పోటీలు జరుగుతాయి.కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సెక్రటరీ పసుపులేటి సురేష్, ప్రెసిడెంట్ జిమ్ రాజు, జి.రమేష్, కత్తి పవన్‌కుమార్, ఎం.రాహుల్‌గౌతమ్, సయ్యద్ మస్తాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, శాంతయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి సురేష్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో పథకాలను సాధించి పల్నాడు జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ఎంపికై న జట్ల వివరాలు ఇలా.. సబ్ జూనియర్: 43 కేజీలు కత్తి పల్లవి (గురజాల), 53 కేజీలు కె.కార్తిక్ (గురజాల), 66 కేజీలు ఎం.వినయ్ వెంకట శివ(సత్తెనపల్లి) జూనియర్ విభాగం: 53 కేజీలు ఎం.సాయి గగన్ (సత్తెనపల్లి),74 కేజీలు ఎన్. శరత్(కంకణాలపల్లి), 74 కేజీలు పి.శ్రీహర్ష రమేష్ చౌదరి (కంకణాలపల్లి), 83 కేజీలు పసుపులేటి వంశీ కృష్ణ (సత్తెనపల్లి),120 కేజీలు ఎల్. శివనాగేశ్వరరావు(గుడిపుడి) ఎంపికయ్యారు. -
జెడ్పీలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, పరిపాలనాధికారులు, ఉద్యోగులు కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బీట్ ది హీట్ నినాదంతో పరిసరాలను పరిశుభ్రం చేసినట్లు చెప్పారు. వేసవిలో ఎండల తీవ్రత, వడగాలలు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. వివాదాస్పదంగా మారిన ఫ్లెక్సీ తెనాలి అర్బన్: స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి మున్సిపల్ మార్కెట్లో శనివారం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసి ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో జనసేన పార్టీ నాయకులు కమిషనర్ బండి శేషన్నను ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదంటూ ఆయన్ను హెచ్చరించారు. నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ● గుంటూరు, పల్నాడు జిల్లాలో ఎనిమిది పరీక్ష కేంద్రాలు ● ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఆన్లైన్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. గత జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు సెషన్లలో జరిగిన మెయిన్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం జరగనున్న అడ్వాన్స్‌డ్‌కు హాజరు కానున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్ష కేంద్రాల పరిధిలో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)లు జరగనున్నాయి. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచి విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులో పొందుపర్చిన నియమ, నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంది. జులై 5న జాతీయ లోక్ అదాలత్ నరసరావుపేట టౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జులై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 13వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.సత్యశ్రీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతోపాటు సివిల్, రెవెన్యూ, మోటర్ వాహన ప్రమాదాలు, చెల్లని చెక్కు, మనోవర్తి, కుటుంబ తగాదాలు, ముందస్తు వ్యాజ్యపు కేసులు పరిష్కరించబడతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకొని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని కోరారు. సివిల్ కేసులను లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుంటే ఫీజు వాపస్ చేస్తారని తెలిపారు. పలు రైళ్లు రద్దు లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు డివిజన్ పరిధిలో గ్రూప్–డీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేసినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ–గుంటూరు (57201), గుంటూరు–మాచర్ల(57203), మాచర్ల–నడికుడి(57206), నడికుడి–మాచర్ల(57205), మాచర్ల–గుంటూరు(57204), గుంటూరు– విజయ వాడ(57202) రైళ్లు ఈనెల 17, 18 తేదీల్లో రద్దు చేసినట్లు వెల్లడించారు. కాచిగూడా–నడికుడి(67779), నడికుడి–కాచిగూడా(67780) రైలు ఈనెల 18, 19 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. రైలు ప్రయాణికులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. -
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
తెనాలి అర్బన్: ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంటే బ్యానర్లు పెట్టుకుని రోడ్లపై తిరగడం కాదని, ఉద్యోగులంతా ప్రజలకు మెరుగైన సేవలందించడమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం ఉదయం శివాజీ చౌక్ నుంచి మార్కెట్ వరకు నిర్వహించారు. పలువురు సచివాలయ ఉద్యోగులు తమకు నూతన పింఛన్లు, రేషన్‌కార్డులపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ ఎందుకు రావడం లేదంటూ మంత్రి ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తప్పనిసరిగా వారానికి ఒకసారి ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. మురుగు కాల్వలు అధ్వానంగా ఉండటంపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పలువురు కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వారందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహా, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, ఆరోగ్యాధికారిణి డాక్టర్ కె.హెలెన్ నిర్మల, హౌసింగ్ ఈఈ భాస్కర్, పెద్దసంఖ్యలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా కార్డులు మ్యారేజ్ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డు జారీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. తెనాలిలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్తగా పెళ్లయిన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని సూచించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తాము ఇచ్చిన నూతన జీవోలో దీనిపై స్పష్టత ఇచ్చినట్లు చెప్పారు. ఒకే డోర్ నంబర్లో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తున్నాయని, వారికి రేషన్ కార్డుల జారీలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. 20న జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి పరిష్కార మార్గాన్ని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులు, 80 సంవత్సరాలు దాటిని వారు రాష్ట్రంలో 6.74 లక్షల మంది ఉన్నారని, వీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ -
పోటీల్లో షానూన్ పతకాల పంట
డెహ్రాడూన్‌లో జరిగిన ఆసియన్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో తెనాలికి చెందిన మరో యువతి మదిర షానూన్ రాణించింది. జూనియర్స్‌లో 47 కిలోల కేటగిరీలో తలపడిన తొలి అంతర్జాతీయ పోటీల్లోనే రజత పతకం, మూడు కాంస్య పతకాలను సాధించింది. స్క్వాట్‌లో 100 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 42.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 110 కిలోల బరువులనెత్తిన షానూన్ డెడ్‌లిఫ్ట్‌లో రజతం, స్క్వాట్, బెంచ్‌ప్రెస్, ఓవరాల్ ప్రదర్శనలో మూడు కాంస్య పతకాలను అందుకుంది. ఆసియన్ యూనివర్సిటీ కప్–2025లో పాల్గొన్న షానూన్ తన అద్భుత ప్రదర్శనతో నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. రెండు ఈవెంట్లలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలను గెలుచుకుంది. -
సోషల్ మీడియా, సైబర్ నేరాల పర్యవేక్షణ కేంద్రం ప్రారంభం
నగరంపాలెం: సోషల్ మీడియా, సైబర్ నేరాలను నియంత్రించేందుకు కేంద్రం నెలకొల్పినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని ఉమేష్ చంద్ర బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నిపుణులైన పోలీస్ సిబ్బంది ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలు, సామాజిక మాధ్యమాల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహ శక్తులను గుర్తిస్తారన్నారు. తద్వారా వారి చర్యలను అణచివేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. సామాజిక మాధ్యమాల వాడకం, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారని ఆయన తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు సహకరించిన జిల్లేళ్లమూడి వెంకట్, కొల్లా అశోక్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), నిస్సార్ బాషా, ఎస్పీ సీసీ ఆదిశేషు, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మంగళగిరి: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు జరిగే పవర్ లిఫ్టింగ్ నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ క్లాసిక్ మెన్, ఉమెన్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ టీమ్‌ను ఎంపిక చేసినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. పట్టణంలోని కార్యాలయంలో శనివారం వివరాలను వెల్లడించారు.ఉమెన్ సబ్ జూనియర్ టీమ్ 76 కేజీల విభాగంలో బి. లాలిత్య, 84 కేజీల విభాగంలో ఈ.ఎల్. వినయశ్రీ , జూనియర్ టీమ్ 47 కేజీల విభాగంలో ఎం. షానూన్, 76 కేజీల విభాగంలో ఎల్. చాతుర్య, 84 కేజీల విభాగంలో ఎన్. జ్ఞాన దివ్యలను ఎంపిక చేసినట్లు తెలిపారు. పురుషుల సబ్ జూనియర్ 53 కేజీల విభాగంలో టి. శివకార్తిక్, 83 కేజీల విభాగంలో ఎస్. మునీశ్వర్ రామ్, జూనియర్ 93 కేజీల విభాగంలో ఎస్. కౌశిక్, 105 కేజీల విభాగంలో డి. పృథ్వీకుమార్ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న పవర్ లిఫ్టర్లను రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు తెలిపారు. -
ఘనంగా జానపద కళాపీఠం రజతోత్సవం
అద్దంకి రూరల్: జానపద కళాపీఠం రజతోత్సవం శనివారం రాత్రి స్థానిక బంగ్లారోడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షుడు దేవపాలన మాట్లాడుతూ పల్లె ప్రజల గుండె చప్పుడు జాన పదమదన్నారు. జానపద కళలు ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలని తెలిపారు. దీనిలో భాగంగా చెన్నుపల్లి నాగేశ్వరరావు బృందం చేపట్టిన కోలాట ప్రదర్శన, జానపద రూపాలైన డప్పువాయిద్య కళాకారులు ప్రదర్శన, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జ్యోతి శ్రీరాములు స్మారక సాహిత్య పురస్కారాన్ని కొండా శ్రీనివాసులు, వీరవల్లి రంగయ్య, యశోదమ్మ స్మారక కళాపురస్కారాన్ని కారుమూరి సీతారామయ్యకు, గుర్రం జాఫువా స్మారక సాహితీ పురస్కారాన్ని పిన్నాబత్తిన వెంకట రమణయ్యకు, మారెడ్డి స్మారక కళాపురస్కారాన్ని బత్తుల ఆంజనేయులుకు, జానపద కళాపీఠం ఆత్మీయ సన్మానాన్ని ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆర్జేటి సుబ్బారావుకు అందజేశారు. కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు , జ్యోతి చంద్రమౌళి, గాడేపల్లి దివాకరదత్తు, జ్యోతి శ్రీమన్నారాయణ, మల్లాది శ్రీనివాసరావు, ధర్మవరపు శ్రావణ్‌కుమార్, తాళ్లూరి సుబ్బారావు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ ‘మెడి’కిల్
తెనాలి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైద్య సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసింది. పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. అద్దె భవనాల్లో నడుస్తున్న సెంటర్లకు శాశ్వత భవనాలు నిర్మిస్తూ వచ్చింది. పనులు చాలా వరకు పూర్తికాగా, అక్కడక్కడా తుది దశలో ఉన్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల్ని ఆపేసింది. అందుబాటులోకి తెచ్చేందుకు పూనుకోవడం లేదు. ప్రజల చెంతకు వైద్య సేవలు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజలు నివసించే ప్రాంతంలోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అప్పటికే పట్టణ ముత్యంశెట్టిపాలెంలో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్‌కు అదనంగా అయితానగర్, సుల్తానాబాద్, కొత్తపేట, మారీసుపేట, పాండురంగపేటలో ఏర్పాటుచేసింది. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంది, అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి, సత్వరమే రోగుల సేవల్ని ఆరంభించింది. ప్రత్యేకంగా లేబరేటరీని కూడా సమకూర్చింది. ప్రతి పట్టణ ఆరోగ్యకేంద్రంలో 60 రకాల వైద్య పరీక్షలకు అవకాశం కల్పించింది. వివిధ వ్యాధులకు మొత్తం 178 రకాల మందులను అందుబాటులో ఉంచింది. దీనితో తెనాలి ప్రజలకు ప్రతి చిన్న అనారోగ్యానికి చెంచుపేటలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. సమయం ఆదా కావడం, రవాణా చార్జీల భారం తగ్గడంతో ప్రజలు సంతోషించారు. శాశ్వత భవనాల నిర్మాణాలకు నాంది అర్బన్ హెల్త్ సెంటర్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుంకట్టింది. ఒక్కో సెంటర్‌కు రూ.1.10 కోట్లు చొప్పున పట్టణంలోని ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లకు రూ.5.50 కోట్లను కేటాయించింది. పట్టణంలోని పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం, అయితానగర్–నేలపాడు రోడ్డు, సుల్తానాబాద్‌లో నిర్మాణం పూర్తయింది. ప్రైవేటు భవనాల్లోంచి ఆయా కేంద్రాలను శాశ్వత భవనాల్లోకి మార్చారు. నాటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యవేక్షణలో ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా వైద్య కేంద్రాల్లో అందుతున్న వైద్యసేవలపై ప్రజల కూడా సంతృప్తిని వ్యక్తంచేశారు. పనులు పెండింగ్ పట్టణంలో ఏర్పాటైన అయిదు అర్బన్ హెల్త్ సెంటర్లలో మూడింటికి శాశ్వత భవనాలు నిర్మాణం పూర్తయింది. చంద్రబాబునాయుడు కాలనీ, ఆలపాటినగర్‌లో తుదిదశలో ఉన్నాయి. అప్పట్లో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారటంతో ఆ పనులు పెండింగులో ఉండిపోయాయి. ● చెంచుపేట పరిధిలోని ఆలపాటినగర్లోని ఆరోగ్య కేంద్రం భవనం పనులు దాదాపు 90 శాతం పూర్తయింది. ఫ్లోరింగ్, ర్యాంప్, ఇతర చిన్న, చిన్న పనులు మాత్రమే నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.10లక్షల ఉంటుందని అధికారుల అంచనా. ● చంద్రబాబునాయుడు కాలనీలో గ్రౌండ్ ఫ్లోరింగ్, రంగులు, టాయిలెట్స్ నిర్మాణం వంటి రూ.20లక్షల పనులు పెండింగులో ఉండిపోయాయి. ప్రైవేటు భవనాల్లో అవస్థలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులు ఇప్పటికీ మొదలుపెట్టలేదు. భవనాలకు తాళాలు వేసి అధికారులు అలాగే ఉంచారు. వైద్య కేంద్రాలు ఇప్పటికీ ప్రైవేటు భవనాల్లో అరకొర వసతులోనే కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే పనులను పూర్తిచేసి ప్రజలకు సెంటర్లను అందుబాటులోకి తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది. అర్బన్ హెల్త్ కేంద్రాల నిర్మాణం పూర్తికి చొరవ చూపని పాలకులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.5.50 కోట్లతో ఐదు సెంటర్ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన మూడు కేంద్రాలు మిగిలిన రెండు కేంద్రాల నిర్మాణం కూడా 90 శాతం పూర్తి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ ఆరంభించని చివరి దశ పనులు పెండింగ్ పనుల పూర్తికి సన్నాహాలు పట్టణంలో చంద్రబాబు నాయుడు కాలనీ, ఆలపాటి నగర్‌లోని ఆర్బన్ హెల్త్ సెంటర్ భవనాలు చివరి దశలో ఉన్నాయి. మిగిలిన పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీటి గురించి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ నివేదిక అడిగారు. మంత్రి ఆదేశాలతో నిర్మాణ పనులను పూర్తిచేసి, ఆయా అర్బన్ హెల్త్ సెంటర్లను వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగిస్తాం. – ఆకుల శ్రీనివాసరావు, ఇన్చార్జి మున్సిపల్ ఇంజనీర్, తెనాలి -
ఆధునిక జీవన శైలే ఐబీడీకి మూలం
● పల్నాడుకు చెందిన నాగేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఉద్యోగ రీత్యా రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మేలుకొని ఉండటం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో సమస్య తీవ్రమై గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్ష చేసి సుబ్బారావు ఇన్‌ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ●బాపట్లకు చెందిన శ్రీనివాస్ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల తీవ్రమైన కడుపు మంట సమస్య ఉత్పన్నమవడంతో తల్లిదండ్రులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. విద్యార్థి ఎక్కువగా పాస్ట్‌ఫుడ్ తీసుకోవడం, సకాలంలో ఆహారం తీసుకోకుండా చదువు ధ్యాసలో పడి ఒత్తిడికి గురవడం ద్వారా ఐబీడీ వ్యాధి బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు మెడికల్ :ఇన్‌ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్న వారి సమస్య రోజురోజుకు ఎక్కువతోందని, సకాలంలో చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలం వ్యాధి వేధిస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదివేల మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యాధి బాధితులు ఉన్నట్లు ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ క్రోన్స్ అండ్ ఆల్సరేటీవ్ కొలిటీస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టడం తప్పా పూర్తిగా నయం చేయలేరు. ఐబీడీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 2010 నుంచి మే 19న ప్రపంచ వ్యాప్తంగా ఐబీడీ డే నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలు క్రాన్స్ వ్యాధి, అల్సరేటీవ్ కొలిటీస్ వ్యాధులనే ఐబీడీ వ్యాధిగా పిలుస్తారు. వాంతులు, విరేచనాలు, కొన్నిసార్లు రక్తపు విరేచనాలు, కడుపులో నొప్పి, అకస్మాత్తుగా శరీరం బరువును కోల్పోవడం, కడుపులో మంట, కడుపులో తిమ్మిరి, అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. వ్యక్తులను బట్టి వ్యాధి లక్షణాలు మారుతూ ఉంటాయి. కారణాలు ఐబీడీ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, జన్యుపరమైన కారణాలు, జీవన విధానం, కొన్ని రకాల మందులు మింగడం ద్వారా, పాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి వ్యాధి కారకాలు. నిర్ధారణ ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎమ్మారై, రక్త పరీక్షలు, సిటీస్కాన్ ద్వారా ఐబీడీ వ్యాధిని నిర్ధారిస్తారు. బాధితుల్లో యువతే అధికం రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే కట్టడి చేయవచ్చు రేపు వరల్డ్ ఐబీడీ డే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమీకృత ఆహారాన్ని సక్రమంగా నమిలి మింగాలి. సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రించకూడదు. రాత్రివేళల్లో త్వరితగతిన ఆహారం తినాలి. పాల ఉత్పత్తులు పరిమితి మోతాదులో తీసుకోవాలి. కాఫీ, టీలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. –డాక్టర్ షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు 15 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఈవ్యాధి బారిన పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి బాధితులే. కొంత మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడు వారంలో నలుగురు లేదా, ఐదుగురు ఐబీడీ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతిరోజూ ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ వ్యాధి భారతదేశంలో కూడా నేడు పెరిగిపోతోంది. ప్రతి ఏడాది వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సూచిస్తున్నారు. -
నవతరానికి పుస్తక పఠనం అవసరం
నగరంపాలెం: నవతరానికి పుస్తక పఠనం అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ ఐదో వీధిలోని గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్ సర్వీసు ఆర్గనైజేషన్ ప్రాంగణంలో శనివారం ఏపీ అభ్యుదయ రచయితల సంఘం 90 ఏళ్ల సంబరాల్లో భాగంగా కవితా స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాలు గు పుస్తకాలను ఆవిష్కరించారు. సభకు సాహితీవేత్త భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ ఈ పుస్తకాలను నవతరం చదవడం అవసరమని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ సమితి అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఛాయారాజ్, ఎండ్లూరి సుధాకర్, నూతలపాటి గంగాధరం, పఠాభీల కవిత్వాన్ని ఈ తరం సులభంగా చదువుకునేలా అందిస్తున్న అరసం కృషి మరువలేనిదని ప్రశంసించారు. సభకు అధ్యక్షత వహించిన భూసురపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పుస్తకాలు కవి ఆత్మీయతను ప్రతిబింబించేలా ఉన్నాయని తెలిపారు. అనంతరం యుద్ధం– శాంతి అంశంపై కవితా గోష్టి నిర్వహించారు. బండికల్లు జమదగ్ని, మేడిశెట్టి సుభద్ర, హేమలత, ఎం.లలితకుమారి హజరయ్యారు. కార్యక్రమంలో దివికుమార్, రచయిత్రి మందరపు హైమావతి, అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోసూరి రవికుమార్ పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ -
పవర్ఫుల్ ఉమెన్
పవర్ లిఫ్టింగ్...బరువులెత్తే ఈ క్రీడలో ఇప్పుడు పేదింటి యువతులు రాణిస్తున్నారు. చదువుతో పాటు బరువులు ఎత్తుతూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తలపడుతున్నారు. ఆ క్రీడలో ‘స్టామినా’ను చాటుతున్నారు. అలవోకగా బంగారు పతకాలను సాధిస్తున్నారు. తెనాలికి చెందిన షేక్ షబీనా , మదిర షానూన్ ఇందుకు నిదర్శనం. షబీనా అంతర్జాతీయ పోటీల్లో పతకాల వేటలో జైత్రయాత్ర కొనసాగిస్తుంటే, మదిర షానూన్ తొలి అంతర్జాతీయ పోటీల్లోనే పతకాలను సాధించడం మరో విశేషం. తెనాలి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఈనెల 12న ముగిసిన ఆసియా సబ్ జూనియర్, జూనియర్ ఎక్విప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో జూనియర్స్ 84 కిలోల విభాగంలో తలపడిన షేక్ షబీనా నాలుగు బంగారు పతకాలను సాధించింది. స్క్వాట్‌లో 190 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 85 కిలోలు, డెడ్ లిఫ్ట్‌లో 180 కిలోలు, ఓవరాల్‌గా 455 కిలోల బరువులనెత్తి నాలుగింటిలోనూ బంగారు పతకాలను కై వసం చేసుకోవడం విశేషం. ఇదే వేదికపై ఆసియన్ యూనివర్సిటీ కప్–2025లోనూ కేఎల్ యూనివర్సిటీ తరఫున పాల్గొన్న షబీనా మరో నాలుగు బంగారు పతకాలను సాధించింది. స్ట్రాంగ్ ఉమెన్ పోటీలో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం రెండు ఈవెంట్లలో కలిపి ఎనిమిది బంగారు పతకాలను షబీనా సాధించింది. అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట షబీనాకు అంతర్జాతీయ పోటీల్లో పతకాల సాధన కొత్త కాదు. 2024 మేలో హాంకాంగ్‌లో జరిగిన ఆసియన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ కమ్ ఆసియన్ యూనివర్సిటీ కప్–2024 పోటీల్లోనూ మెరిసింది. జూనియర్ విభాగంలో పోటీ పడిన షబీనా స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో బంగారు పతకాలను సాధించింది. మూడు విభాగాల్లోనూ కలిపి టోటల్లోనూ మరో పతకంతో మొత్తం నాలుగు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. గత మూడేళ్లుగా పవర్‌లిఫ్టింగ్‌లో నిలకడగా విజయాలను సాధిస్తున్న షబీనా, 2023 మేలో కేరళలో జరిగిన ఆసియా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించింది. ఆ వెంటనే తమిళనాడులో జరిగిన జాతీయ పోటీల్లో ఏకంగా మూడు బంగారు పతకాలు సాధించిన చరిత్ర ఉంది. అంతకుముందు హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మూడు బంగారు పతకాలు, రజత పతకం సాధించింది. ఆసియా పోటీల్లో వరుసగా మూడేళ్లు నాలుగేసి బంగారు పతకాలను గెలుచుకోవడం విశేషం. కేవీఐకే అకాడమీలో సాధన 2017 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన ఘట్టమనేని సాయిరేవతి, పూసపాటి శివరామకిరణ్రాజు శిక్షణలో స్థానిక కేవీఐకే అకాడమీలో షానూన్ సాధన చేస్తోంది. పట్టణానికి చెందిన మదిర ప్రభుదాస్, మదిర నయోమి కుమార్తె షానూన్. కేఎల్ యూనివర్సిటీలో బీఐఏఎస్ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కోవిడ్ సమయంలో ఫిట్నెస్ కోసం ఆమెను కేవీఐకే అకాడెమీలో చేర్పించారు. తనలోని టాలెంట్‌ను గుర్తించిన కోచ్ ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ నుండే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ పతకాలను సాధిస్తోంది. ఇప్పటివరకు 13 జిల్లాస్థాయి, 12 రాష్ట్రస్థాయి పతకాలు, నాలుగుసార్లు రాష్ట స్ట్రాంగ్ విమెన్ టైటిల్స్‌ను సాధించింది. ‘కాలేజీకి వెళుతూ రోజుకు మూడు గంటల చొప్పున.. పోటీలకు నెల రోజుల ముందు ఉదయం సాయంత్రం మూడేసి గంటల చొప్పున సాధన చేస్తా’ అని షానూన్ వెల్లడించింది. తల్లి ప్రోత్సాహంతో సాధన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి యువతుల సత్తా ఆసియా పోటీల్లో మెరిసిన బంగారాలు షేక్ షబీనాకు ఎనిమిది స్వర్ణ పతకాలు మదిర షానూన్కు నాలుగు స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు పట్టణ ఆర్ఆర్ నగర్‌కు చెందిన ఆటో ఎలక్ట్రీషియన్ మెకానిక్ బుజ్జి, షంషద్ల ఏకై క కుమార్తె షబీనా ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ఫస్టియర్ చదువుతోంది. పదో తరగతిలో పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపిన కుమార్తెను తల్లి ప్రోత్సహించింది. కామన్వెల్త్ పోటీల్లో బంగారు పతకాలను సాధించిన తెనాలి యువతి జి.సాయిరేవతి శిష్యరికంలో కొంతకాలం సాధన చేసింది. రాష్ట్ర పోటీల్లో పాల్గొని బహుమతులను గెలవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. అక్కడ నుంచి సాధన మంగళగిరికి మారింది. కోచ్ సంధాని శిక్షణలో సాధన చేస్తోంది. అటు చదువు, ఇటు సాధన మినహా షబీనాకు మరో వ్యాపకం లేకుండాపోయింది. జాతీయస్థాయి పోటీల్లో అప్రతిహతంగా రాణిస్తూ ఇప్పుడు ఆంతర్జాతీయస్థాయిలో పతకాలను కొల్లగొడుతోంది. కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పతకాలు నెగ్గి, రైల్వేలో ఉద్యోగం సాధించాలనేది షబీనా లక్ష్యం. -
మేరా భారత్ మహాన్
గుంటూరు మెడికల్: ఉగ్ర దాడులతో భారత్‌ను భయపెట్టాలని పాకిస్థాన్ చూసింది కానీ చివరకు తోక ముడిచిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టడంతో పాటు కాల్పులను దీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించిన దేశ సైనికులకు సంఘీభావంగా శనివారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. తొలుత మార్కెట్ సెంటర్ హిందూ కాలేజీ నుంచి బయలుదేరి ఏసీ కాలేజీ, శంకర విలాస్ బ్రిడ్జి మీదుగా లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదంపై తిరుగులేని విజయం సాధించామని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ పెహల్గామ్ ఉగ్ర దాడిలో బలైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయం భారత సైన్యం, ఎన్డీఏ విజయంగా పేర్కొన్నారు. ర్యాలీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డెప్యూటీ మేయర్ షేక్ షజీల పాల్గొన్నారు. తెనాలిలో భారీ జాతీయ పతాకంతో ర్యాలీ ఆంధ్రా ప్యారిస్‌లో తిరంగా ర్యాలీ తెనాలి: పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా ర్యాలీని శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చినరావూరులోని సత్యనారాయణ పార్కు నుంచి బోసు రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన జరిగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయా పార్టీల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 300 మీటర్ల భారత జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అమర వీరులకు సంఘీభావంగా తిరంగా యాత్ర -
గుంటూరు
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025రేపటి నుంచిఆక్రమణల తొలగింపు వినుకొండ: స్థానిక శివయ్య స్తూపం సెంటరులో ఆక్రమణలను ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు పొన్నూరు: స్థానిక గాంధీ బొమ్మ సెంటర్, గుంటూరు బస్టాప్‌ల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలను శనివారం జిల్లా ప్రత్యేక అధికారి కె.కన్నబాబు ప్రారంభించారు. శంకరమ్మ తల్లి తిరునాళ్ల చెరుకుపల్లి: మండల పరిధిలోని బలుసులపాలెం గ్రామంలో వేంచేసియున్న శంకరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2025ను నిర్వహిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు 41,319 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షలకు 34,148, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 7,106, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 65 మంది ఉన్నారు. వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలను కలుపుకుని మొత్తం 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షల జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 41,319 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 41,319 మంది హాజరు కానున్నారు. ● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 25,692 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 21,551, అగ్రి కల్చర్, ఫార్మసీ 4,100, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 41 మంది ఉన్నారు. ● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 11,126 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 9,198, అగ్రికల్చర్, ఫార్మసీ 1,912, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 16 మంది ఉన్నారు. ●బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల పరిధిలో మొత్తం 4,501 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 3,399, అగ్రికల్చర్, ఫార్మసీ 1,094, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు ఎనిమిది మంది ఉన్నారు. విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్‌లో విద్యార్థి కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు. గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర వస్తువులను అనుమతించరు. ● విద్యార్థి ఫొటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీపై పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి, ఎడమచేతి బొటనవేలి ముద్ర వేయాలి. 7న్యూస్రీల్మ్యారేజ్ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా కార్డులు మ్యారేజ్ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డు జారీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. తెనాలిలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్తగా పెళ్లయిన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని సూచించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తాము ఇచ్చిన నూతన జీవోలో దీనిపై స్పష్టత ఇచ్చినట్లు చెప్పారు. ఒకే డోర్ నంబర్లో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తున్నాయని, వారికి రేషన్ కార్డుల జారీలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. 20న జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి పరిష్కార మార్గాన్ని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులు, 80 సంవత్సరాలు దాటిని వారు రాష్ట్రంలో 6.74 లక్షల మంది ఉన్నారని, వీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు. కేంద్రాల వద్ద విస్తృత తనిఖీలు ఏపీ ఈఏపీ సెట్‌కు హాజరు కానున్న విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు అనుమతిస్తారు. ఉదయం 9.00 గంటలు, మధ్యాహ్నం 2.00 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్ష జరిగే రోజున కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిమిషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి. 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 41,319 మంది విద్యార్థులు మూడు జిల్లాల్లో 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ -
క్యాన్సర్ రోగులకు శుభవార్త
● జీజీహెచ్‌లో రూ. 18 కోట్లతో పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం ● తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు ప్రభుత్వ హాస్పిటల్లో అందించేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్సలను ఉచితంగా అందించేందుకు నాట్కో ట్రస్టు చైర్మన్ సుమారు రూ. 50 కోట్లతో గుంటూరు జీజీహెచ్‌లో వంద పడకలతో ఐదంతస్తుల క్యాన్సర్ వార్డు నిర్మించారు. తాజాగా రూ. 20 కోట్లతో మరో క్యాన్సర్ భవన నిర్మాణం చేస్తున్నారు. ప్రతి ఏడాది రూ.కోట్లాది విలువైన క్యాన్సర్ మందులను సైతం ఉచితంగా అందజేస్తున్నారు. నాట్కో ట్రస్టు క్యాన్సర్ రోగులకు చేస్తున్న సేవలకు మరింత మెరుగైన వైద్యం అందించేలా సుమారు రూ. 18 కోట్లతో ప్రభుత్వం వైద్య పరికరాన్ని జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు అందజేసింది. క్యాన్సర్ శరీరంలో ఏ భాగంలో ఉంది, ఇతర భాగాలకు క్యాన్సర్ సోకుతుందా, లేక అక్కడే ఉందా, అనే పూర్తి విషయాలు తెలుసుకునేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ పరీక్ష చేయించేందుకు సుమారు రూ. 25 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్‌లో వైద్య పరికరం అందుబాటులోకి రావడం వల్ల పేద రోగులకు మేలు చేకూరనుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నాట్కో ట్రస్టు వైస్ చైర్మన్ నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్టు కో ఆర్డినేటర్ యడ్లపాటి అశోక్‌కుమార్‌లు తెలిపారు. -
ప్రభుత్వానికి నివేదించాం
ఇంటి ప్లాన్ల దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవటంపై ప్రభుత్వానికి నివేదించాం. నూతన జీవోలో రెండు సవరణలు చేశారు. ప్రస్తుతమున్న ప్లానర్లు కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించారు. భవన నిర్మాణం చేయదలచినవారు పట్టణ ప్లానింగ్ అధికారులు లేదా హెల్ప్ డెస్క్‌ను సంప్రదిస్తే ప్లాను ఇస్తారు. కొత్తగా అర్హత కలిగిన ప్లానర్లు ఎవరైనా ముందుకొస్తే లైసెన్సులు ఇస్తాం. వారి చేత ప్లాన్లు తీసుకోవచ్చు. – మధుకుమార్, రీజినల్ డెప్యూటీ డైరెక్టర్, టౌన్‌ప్లానింగ్ విభాగం -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం
తెనాలి: స్థానిక శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ఉదయం 11 గంటలకు స్వామి వారిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు అంకురారోపణ, ధ్వజారోహణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవాన్ని జరిపారు. ఆలయ సహాయ కమిషనర్/కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తిరుమలగిరి హుండీ ఆదాయం రూ. 26.41 లక్షలు తిరుమలగిరి(జగ్గయ్యపేట): గ్రామంలో వేంచేసియున్న వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.26,41,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. ప్రాంగణంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత నెలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్‌కల్యా, పరిటాల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. లెక్కింపు సమాచారాన్ని ఆలయ పాలకవర్గానికి ఇవ్వలేదని లెక్కింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన కల్యాణ మహోత్సవాల్లో ఈవో ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి గ్రామస్తులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో ఆలయ ఈవో కార్యాలయంలో లేరు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వెంకటపాలెం యూపీ పాఠశాలలో చోరీ తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం యూపీ స్కూల్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్ఎం జానకీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఇటీవల ప్రధానమంత్రి రాక నేపధ్యంలో వసతి కోసం పోలీసులకు పాఠశాలను ఇచ్చామని, కార్యక్రమం అనంతరం ఆఫీసు గదిలో ఉన్న రూ.20 వేల విలువైన పెద్ద సౌండ్ బార్, రూ.3 వేల విలువైన చిన్న సౌండ్ బాక్స్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
కేంద్ర మంత్రి కాన్వాయ్ అడ్డగింత
ప్రత్తిపాడు: కేంద్ర మంత్రి పెమ్మసానికి నీటి ఎద్దడి సెగ తగిలింది. తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు ఇప్పించండంటూ గ్రామస్తులు, మహిళలు రోడ్డెక్కి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటన ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం తిమ్మాపురంలో గిడ్డంగి ప్రారంభోత్సవానికి గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. మార్గ మధ్యలో కోయవారిపాలెంలో గుంటూరు–పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై కాన్వాయ్‌ను స్థానిక మహిళలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, చెరువు కూడా అడుగంటిందని, కొద్ది రోజులుగా సురక్షిత మంచి నీటికి దిక్కులేకుండా పోయిందంటూ గ్రామస్తులు సమస్యను ఏకరువు పెట్టారు. అడుగంటిన రక్షిత మంచినీటి చెరువు నీటిని తీసుకువచ్చి మంత్రికి చూపించారు. అంతేకాకుండా చెరువులు నింపుకొనేందుకు కాలువల్లో నీళ్లు రావడం లేదని తెలిపారు. ఒక వేళ నీళ్లు వదిలినా కాలువలు పూడిపోయి ఉన్నాయని చెప్పారు. నీళ్లు చెరువు వరకు వచ్చే పరిస్థితి కూడా లేదని తెలిపారు. ఇలా అయితే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోనికి ఒక్కసారి వచ్చి అడుగంటిన మా చెరువు దుస్థితిని చూడాలని మహిళలు, స్థానికులు పట్టుబట్టారు. కేంద్ర మంత్రి పెమ్మసాని వెంటనే గ్రామంలోనికి ఐదు పెద్ద వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయిస్తానని హామీ ఇచ్చారు. కాలువ మరమ్మతులకు తన నిధుల నుండి రూ.రెండు లక్షలు కేటాయిస్తానని చెప్పారు. రేపటి నుంచే పనులు ప్రారంభించుకోవాలని, కాలువల ద్వారా నీళ్లు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారని స్థానికులు వివరించారు. ఇంతలో స్థానిక పెద్దలు, పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలకు నచ్చజెప్పడంతో కాన్వాయ్ ముందుకు సాగింది. కొద్దిరోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన గ్రామంలోనికి వచ్చి చెరువు చూస్తే సమస్య అర్థమవుతుందని మహిళల వినతి వెంటనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగిన మంత్రి -
గుంటూరు
శుక్రవారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2025అడ్డదిడ్డంగాసాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.300 టీఎంసీలకు సమానం. దుర్గమ్మకు వెండి పంచపాత్ర ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు గురువారం వెండి పంచపాత్ర సమర్పించారు.సదరం క్యాంప్ తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారం కొనసాగింది. 50 మంది దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. తెనాలి: భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి కొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో జీవో జారీ చేసింది. సాంకేతిక కారణాలతో మార్చి నెల నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ విధానంలో భవన నిర్మాణాలకు అనుమతుల కోసం కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ యజమానులు తిరగాల్సిన పనిలేదని పేర్కొన్నారు. అధికారులు కొర్రీలు పెట్టి వేధిస్తారన్న ఆందోళన అవసరం లేదన్నారు. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్టీపీ), లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా భవన నిర్మాణానికి దరఖాస్తును పోర్టల్‌లో అప్లోడ్ చేసి, గంటల వ్యవధిలోనే అనుమతులు పొందవచ్చని చెప్పారు. నిబంధనలకు లోబడి భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా పొందవచ్చని తెలిపారు. ఈ విధానంలో 18 మీటర్ల ఎత్తులోపు అయిదు అంతస్తుల్లో నిర్మాణాలకు సులభతరం చేస్తూ ప్రభుత్వం ‘స్వీయ ధ్రువీకరణ పథకం’ తీసుకొచ్చింది. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచింది. బాధ్యతంతా వారిదే.. దరఖాస్తులు, వాటికి అనుబంధ పత్రాలు అప్లోడ్ చేసిన నాటి నుంచి నిర్మాణ పనులు పూర్తి చేసే వరకు అన్ని దశల్లోనూ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇంటి యజమానులు, నిర్మించిన కట్టడాల్లో ఏవైనా సాంకేతికపరంగా తప్పులు చేసినట్టు నిర్ధారణ అయితే సంబంధిత లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ లైసెన్సును అయిదేళ్లపాటు రద్దు చేస్తామని పేర్కొంది. తప్పు తీవ్రత ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని తెలిపింది. ఆమోదిత లే అవుట్లలోని ప్లాట్లలోనే నిర్మాణాలు చేయాలని షరతు విధించింది. యాజమాన్య హక్కులు కలిగి ఉండాలని తెలిపింది. సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ వంటివి తప్పనిసరి చేశారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యహరించినట్టు ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూస్తే అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్లాను ఇచ్చిన తర్వాత యజమాని ఎక్కడైనా ఉల్లంఘిస్తే తమదెలా బాధ్యత అవుతుందని ఎల్టీపీలు, లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ నిర్మాణం చేసినపుడు మేమే సమాచారం ఇవ్వాలట! అధికారులు వచ్చి కూలగొడతారట... ఇదేం న్యాయం...’ అంటూ ప్లానర్లు ఆందోళన చెందుతున్నారు. ఇంటి ప్లాను కోసం వచ్చిన వారికి ఇదే చెప్పడంతో తిరిగి వెళ్లిపోతున్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంతూళ్లలో ఇళ్ల నిర్మాణాన్ని మానుకొని, ఉంటున్న నగరంలోనే అద్దె ఇళ్లలో కొనసాగటమో.. అక్కడే ఏదైనా ప్లాటు కొనుక్కోవటమో చేస్తున్నారు. మరోవైపు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్, వారి దగ్గర పనిచేసేవారు ఉపాధి కోల్పోతున్నారు. 7న్యూస్రీల్అధికారులందరూ ఏం చేస్తారో?తెనాలి మున్సిపాలిటీ వరకు చూసుకుంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు 22 మంది ఉంటారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్లాన్లు గీసి ఉపాధిని పొందుతుంటారు. పట్టణంలో నెలకు 40–45 వరకు ప్లాన్లు ఇస్తుంటారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పథకంలో ప్లాను గీసే బాధ్యతతోపాటు కచ్చితంగా ఆ ప్రకారం ఇల్లు/ భవనాన్ని నిర్మించేలా చూడాల్సిన బాధ్యతనూ వీరిపై ఉంచింది. పట్టణ మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ఉంటారు. అనధికార నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ విభాగంపైనే ఉంది. అయినా కేవలం లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లపైనే భారం మోపటం విమర్శలకు దారితీస్తోంది. నూతన విధానం కింద 60, 100, 150 గజాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు వసూలు చేస్తున్న ఫీజులు అధికం. దీనికితోడు కఠిన నిబంధనలతో చిన్న స్థలాల్లో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే గ్రామాల్లో ప్లాన్లు లేకుండానే ఇళ్ల నిర్మాణం చాలాకాలంగా జరుగుతోంది. సగటున పది ఇళ్లు నిర్మిస్తుంటే, ఒక ఇంటికి మాత్రమే ప్లాను గీయిస్తున్నారని, ఇప్పటివరకు జరిగిన ఇంటి నిర్మాణాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని చెబుతున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భవనం నిర్మించాలనుకునే వారితోపాటు ప్లాను తయారు చేసే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు, సర్వేయర్లు... ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వీయ ధ్రువీకరణతో నిర్మాణ దరఖాస్తుకు గంటల వ్యవధిలోనే అనుమతిస్తున్నామనే పేరుతో ప్రభుత్వం తమ మెడపై కత్తి పెట్టిందని వాపోతున్నారు. అపోహలు వద్దంటూ అధికారులు సర్దిచెప్పేందుకు ఆపసోపాలు పడుతున్నారు. భవన నిర్మాణ అనుమతుల నూతన జీవోపై తీవ్ర వ్యతిరేకత ఎల్టీపీలు, సర్వేయర్లను బాధ్యులను చేసేలా నిబంధనలు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా నిలిచిన ఇంటి ప్లాన్ల తయారీ అడ్డగోలు నిబంధనలతో ఆమోదం కోసం రాని దరఖాస్తులు అవగాహన ప్రచారం పేరిట ఆపసోపాలు పడుతున్న అధికారులు -
డొంకరోడ్లో అస్తిపంజరం కలకలం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా పోలీసులు గుట్టుచప్పుడు వ్యవహరిస్తున్నారు. అసలు ఆ ఘటనలను బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతూ కేసులను నీరు గారుస్తున్నారనే విమర్శలు తరచు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా ఇలాంటి ఘటనే గురువారం వెలుగులోకి వచ్చింది. వడ్డేశ్వరం – ఇప్పటం బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున ముళ్లపొదల్లో గుర్తుతెలియని అస్తిపంజరం ఉన్నట్లు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. గత ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా ఎముకల గూడును అక్కడి నుంచి తరలించారు. జనసంచారం లేని ఆ ప్రాంతంలో ముళ్లపొదల్లో మూడు నాలుగు నెలల క్రితం మృతదేహాన్ని పడవేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం పోలీసులు బయటకు తీసిన అస్తిపంజరం పురుషునిదా? లేదా మహిళదా? అనేది నిర్ధారించడానికి కూడా వీలులేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలు సేకరించడంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మృతదేహంపై దుస్తులు ఉంటే వాటికి సంబంధించి మగవారు అయితే షర్ట్ బటన్లు, ప్యాంట్ బకిల్స్, జిప్ లాంటివి లభించేవి. ఆడవారు అయితే హెయిర్ పిన్స్ కానీ, జాకెట్ హుక్స్ కానీ ఉండేవి. ఎవరైనా చంపి ఆధారాలు లభించకుండా దుస్తులను తీసివేసి ఆ మృతదేహాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సబ్ డివిజన్లో పెరిగిన హత్యలు మహిళదా, పురుషుడిదా అని నిర్ధారించలేని పరిస్థితి గుట్టుచప్పుడు కాకుండా ఎముకలను తొలగించిన పోలీసులు హత్య కేసులు పెరుగుతున్నా ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం ఈ మధ్యకాలంలో మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో వేశ్యలు, ట్రాన్స్‌జెండర్స్ ఎటువంటి జన సంచారం లేని ప్రాంతాల్లో తిరుగుతూ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గొడవలు ఏర్పడినపుడు, ఆధిపత్య పోరు వచ్చినప్పుడు హత్యలు కూడా జరుగుతున్నాయి. తాడేపల్లి రూరల్‌లోని కొలనుకొండలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో గుంటూరు చానల్ ఒడ్డున ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పెదవడ్లపూడి – కాజ మధ్య పొలాల్లోని బీటీ రోడ్లో ఓ ట్రాన్స్‌జెండర్ తన ప్రియుడి కోసం మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇన్ని సంఘటనలు జరిగినా తాడేపల్లి పోలీసులు మాత్రం అస్తిపంజరం ఉందన్న సమాచారం అందిన వెంటనే ఎటువంటి విచారణ చేయకుండా ఆ అస్తిపంజరాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్చురీకి తరలించారు. మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలలో ఎముకల గూడుకు పోస్ట్‌మార్టం చేయలేమని చెప్పడంతో పోలీసులు గుంటూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. -
కార్మికులకు మెరుగైన వసతులు కల్పించండి
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి ఆయా గుత్తేదారు సంస్థలను ఆదేశించారు. రాజధాని నిర్మాణాలలో పనిచేసేంందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు గుత్తేదారు సంస్థలు కల్పిస్తున్న సదుపాయాలను ఆమె గురువారం క్యాంపులకు వెళ్లి తనిఖీ చేశారు. మొదట తుళ్ళూరులోని ఆర్వీఆర్ సంస్థ క్యాంపును పరిశీలించారు. ఎండ అధికంంగా ఉండటంతో అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. కార్మికులకు భోజన వసతి తదితరాలపై ఆరా తీశారు. కార్మికుల కుటుంబ సభ్యులు వచ్చినపుడు నివసించేందుకు కూడా ప్రత్యేక వసతి కల్పించాలని, వారి పిల్లలు చదువుకునేందుకు సమీప విద్యా సంస్థలకు వెళ్లేదుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరంం ఐనవోలు, శాఖమూరులోని ఎన్సీసీ, ఆర్వీఆర్ సంస్థల క్యాంపులు పరిశీలించారు. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆమె వెంట ఏడీసీ అధికారులు టి.మోజేస్ కుమార్, డాక్టర్ కె.వి. గణేష్ బాబు, ఎస్ఈలు శ్రీనివాసరావు, నరసింహారావు, బి.శ్రీధర్, ఎస్.శ్రీధర్, టి.పద్మాకర్, రమేష్ తదితరులు ఉన్నారు. -
హెచ్ఐవీపై విస్తృత అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై కళాజాత బృందాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించి హెచ్ఐవీ బారిన పడకుండా కాపాడాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. పది రోజులపాటు జిల్లా వ్యాప్తంగా హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై జరుగనున్న కళాజాత బృందాల కార్యక్రమాలను గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యులకు సైతం హెచ్ఐవీ గురించి అర్థమయ్యేలా వివరించి చెప్పడంలో కళాజాత బృందాల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ డి.శ్యామ్సన్, జిల్లా సూపర్వైజర్ జ్యోతుల వీరాస్వామి, కొత్తపేట మహిళ మండలి, సిరి మహిళ సాధికారిత మండలి, మాధురి మహిళ సొసైటీ, లింక్ వర్కర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లబర్లీ రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం
నరసరావుపేట: పొగాకు కొనుగోలు కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి నల్లబర్లీ పొగాకు సాగుచేసిన రైతులు నిలువునా మునిగిపోతున్నారని, ప్రభుత్వం సైతం వారి గోడు పట్టించుకోవడం లేదని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద పొగాకు రైతులతో ధర్నా నిర్వహించారు. హరిబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో నల్లబర్లీ పొగాకును కనీస మద్దతు ధర రూ.15వేల నుంచి రూ.18వేల వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ధర కాస్త ఆశాజనకంగా ఉండడం, కంపెనీ ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి రైతులను సంప్రదించి ఇతర పంటలు సాగు చేయొద్దని, నల్లబర్లీ సాగుచేస్తే మంచి ధర చెల్లిస్తామని నమ్మించారన్నారు. తీరా పంటచేతికి వచ్చాక కంపెనీలు మొత్తం సిండికేట్‌గా ఏర్పడి రైతులను లూటీ చేసేందుకు సిద్ధమయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మోసాన్ని ప్రభుత్వం చోద్యంగా చూస్తుందని ఎద్దేవా చేశారు. పర్చూరు, ఇంకొల్లు తదితర ప్రాంతాలలో పొగాకు సాగుచేపట్టిన రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం స్పందిస్తుందని ప్రశ్నించారు. ఇటీవల ఉద్యాన పంటలపై సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకు రూ. లక్ష ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెబుతున్న వ్యాఖ్యలు గారడీ మాటలను తలపిస్తున్నాయన్నారు. స్పందించకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో వందేళ్ల చరిత్రలో పండించిన పొగాకులో 30శాతం మాత్రమే భారతదేశంలో వినియోగిస్తున్నారని 70 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఎగుమతి చేసే పొగాకును కంపెనీలు ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. పొగాకు కొనుగోలుకు ఇప్పటికై నా ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈనెల చివరిలో రైతులను ఏకంచేసి ఛలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, ఉపాధ్యక్షుడు గుంటూరు విజయకుమార్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి కలెక్టరేట్ వద్ద ధర్నాలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు -
విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం
పర్చూరు(చినగంజాం): విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటన గురువారం పర్చూరు నెహ్రూనగర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. నెహ్రూనగర్ కాలనీకి చెందిన నల్లబోతుల రాజాకు చెందిన పూరింటిలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పంటుకుంది. దాంతో పూరిల్లు పూర్తిగా తగులబడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఇంటిలోని నగదు, వెండి ఆభరణాలు, విలువైన కాగితాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి, సకాలంలో అగ్నిమాపక యంత్రం రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి అదుపులోనికి తీసుకొని వచ్చారు. సుమారు రూ.లక్షపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. రూ.లక్షకుపైగా ఆస్తి నష్టం -
చేయి తిరిగేలా క్రీడా శిక్షణ
తెనాలి: పట్టణ పరిధి చెంచుపేటలోని అమరావతి కాలనీలో డీఎస్ఏ స్టేడియానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో సకల వసతులు సమకూరిన విషయం తెలిసిందే. చేపట్టిన నిర్మాణాలు, దాతల సహకారంతో అందిన సౌకర్యాలతో పూర్తిస్థాయిలో క్రీడలకు సంసిద్ధం చేశారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘శాప్’ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్ అకాడమీ నడిచింది. తెనాలి డబుల్‌హార్స్ మినపగుళ్లు సంస్థ యాజమాన్యం ఇందుకు సహకరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అకాడమీని పక్కన పెట్టారు. ఉదయం, సాయంత్ర వేళల్లో... ప్రస్తుతం వేసవిలో శాప్ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్‌లో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలో తెనాలికి గల ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకొని శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి శిబిరం నడుస్తోంది. 23 మంది ఉచితంగా శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు అండర్–14, అండర్–17, సబ్‌జూనియర్ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో ఆడినవారూ ఉన్నారు. కొత్తగా నేర్చుకునే ఆసక్తి కలిగినవారూ వస్తున్నారు. రోజూ ఉదయం 6–8 గంటలు, సాయంత్రం 4–7 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. స్టేడియం హ్యాండ్‌బాల్ కోచ్ నాగరాజు సెలవులో ఉండటంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్), పాటియాలలో శిక్షణ పొందుతున్న హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు పి.కాలేబును కోచ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఫిట్నెస్, క్రీడలో టెక్నిక్స్, స్కిల్స్ నేర్పుతున్నారు. ఈ నెలాఖరు వరకు జరిగే శిబిరాన్ని అవసరమైతే మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ) ఆధ్వర్యంలోని తెనాలి స్టేడియంలో హ్యాండ్‌బాల్ కోచ్‌గా నన్ను నియమించారు. నా పర్యవేక్షణలో వేసవి క్రీడాశిబిరం నడుస్తోంది. గతంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాను. ఎన్ఐఎస్లో శిక్షణ తీసుకుంటూ నాకున్న అనుభవంతో వేసవి శిబిరంలో శిక్షణ ఇస్తున్నా. క్రీడాకారులకు ఇదో మంచి అవకాశం. వారిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. – పి.కాలేబు, కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో తెనాలిలో గల క్రీడాస్టేడియం ఇప్పుడు శిక్షణకు వేదికగా నిలిచింది. వేసవి సెలవుల్లో ఇండోర్, ఔట్‌డోర్ ఆటల్లో చిన్నారులు సాధన చేస్తున్నారు. హ్యాండ్‌బాల్ అకాడమీ నడిచిన ఈ స్టేడియంలో ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఎన్ఐఎస్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. హ్యాండ్‌బాల్ క్రీడలో ఉచితంగా తర్ఫీదు ‘శాప్’, డీఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ -
సర్కారు తీరుతో ‘పాఠశాల విద్య’లో గందరగోళం
లక్ష్మీపురం: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను జీవో నెం. 19, 20, 21ల ద్వారా 9 రకాలుగా విభజించి వేల సంఖ్యలో ఉపాధ్యాయులను మిగులుగా చూపించి పాఠశాల విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.రఘునాథ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేట జిల్లా సీపీఐ కార్యాలయంలో మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఉన్న జీవో నెం.117 అనేది ఉన్నత పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. దాన్ని రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు జివోలు దాంతోపాటు ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీల ప్రమోషన్లకు గండి కొట్టేలా నిర్ణయాలు ఉన్నాయన్నారు .ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులను మూడు రకాలుగా విభజించడం విడ్డూరమన్నారు. ఎస్టీయూ ప్రధాని కార్యదర్శి కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ బదిలీల విషయంలో ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తెచ్చి ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వర రావు, రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్ ప్రకాష్ రావు ఆయా సభ్యులు అడిగిన విషయాలను వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను గురువారం రాత్రి పశుప్రదర్శన కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిది జతలు పోటీలో పాల్గొన్నాయన్నారు. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఆరుపళ్ల విభాగం పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన శ్రీకావ్య నంది బ్రీడింగ్ బుల్స్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 15 నిమిషాల వ్యవధిలో 3911.08 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని కావ్యమధు ఎడ్ల జత 3583.2 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం పంగులూరు గ్రామానికి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన గాదే అశేర్ సుమన్వీరెడ్డి ఎడ్ల జత 3,481.8 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 3412.3 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 3,313.3 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
కమ్మ జన సేవా సమితిలో విద్యార్థినులకు ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ఆశ్రయం పొందడానికి కమ్మ జన సేవా సమితిలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. కుందుల రోడ్డులోని కమ్మ జన సేవా సమితిలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రగతి పత్రాల్ని ఆవిష్కరించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ వసతి గృహంలో ప్రవేశాలకు ఇంటర్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీతో పాటు బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఈనెల 15 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిభ, పేదరికం ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నామమాత్రంగా వసూలు చేస్తున్న ఫీజు నుంచి ప్రతి విద్యార్థినికి రూ.వెయ్యి మినహాయింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిభ, పేదరికం, తల్లిదండ్రులు లేని విద్యార్థినుల నడవడిక, వసతిగృహంలో క్రమశిక్షణతో మెలిగే విధానాన్ని గమనించి, పాలకవర్గం కమిటీ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు వార్షికోత్సవం రోజున ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున రూ.40 లక్షల ఉపకార వేతనాలు అందజేస్తామని వివరించారు. సంస్థ కార్యదర్శి చుక్కపల్లి రమేష్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దాదాపు 300 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికీ రూ.ఏడువేలు చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తున్నామని తెలిపారు. జేకేసీ కళాశాల రోడ్డులో రూ.50 కోట్ల వ్యయంతో రెండు వేల మంది విద్యార్థినులకు వసతి కల్పించే సామర్ధ్యంతో నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. సంస్థ కార్యాలయంతో పాటు కమ్మ జన సేవాసమితి.కామ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులను ఈనెల 29లోపు సమితి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 0863–2355471, 2260 666 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు వడ్లమూడి నాగేంద్రం, కోశాధికారి గోరంట్ల పున్నయ్య చౌదరి, సంయుక్త కార్యదర్శి గుంటుపల్లి కోటేశ్వరరావు, సభ్యులు ఘంటా పున్నారావు, వడ్లమూడి శివరామకృష్ణయ్య, పెద్ది సాంబశివరావు పాల్గొన్నారు. -
ఫ్లోరోసిస్‌తో అనర్థాలు
ఎముకల ఫ్లోరోసిస్‌తో కాళ్లు, చేతులు వంకరపోవడం, వెన్నుముక కట్టెల్లా బిగుసుపోవడం, కండరాలు, లిగమెంట్స్, కణజాలాలు, ఎర్ర రక్తకణాలు, వీర్య కణాలు, ఉదర భాగంలోని జీర్ణవ్యవస్థపై దీని ప్రభావం కనిపిస్తుంది. ఎముకలు పెలుసుబారిపోతాయి. దంత ఫ్లోరోసిస్ వల్ల పళ్లు పసుపు లేదా గోధుమ రంగు నుంచి నలుపుగా మారతాయి. ఫ్లోరోసిస్ నీటిని తాగడం వల్ల వెన్నముకలో ఉండే లిగమెంట్స్ ఉబ్బిపోతాయి. వెన్నుముకపై నరాలు ఒత్తుకుని కాళ్ళు, చేతులు తిమ్మిర్లు వస్తాయి. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. గర్భవతులకు పరీక్షలు చేయడం వల్ల పుట్టబోయే పిల్లలు ఫ్లోరోసిస్ బారిన పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. – డాక్టర్ జె. నరేష్‌బాబు, సీనియర్ స్పైన్ సర్జన్, గుంటూరు -
తెనాలిలో సదరం క్యాంప్ పునః ప్రారంభం
తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్‌ను నిర్వహించారు. ఆర్థో–100, ఈఎన్టీ–50, సెక్రాటిక్ విభాగాలకు చెందిన 50 మంది వికలాంగులు పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాలలో కూడా క్యాంప్ నిర్వహించనున్నట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు.పాలిసెట్‌లో 97.07 శాతం ఉత్తీర్ణతగుంటూరు ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 30న జరిగిన పాలిసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 97.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో బాలురను అధిగమించిన బాలికలు 97.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పాలిసెట్‌కు హాజరైన 4,129 మంది విద్యార్థుల్లో 4,008 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 2,587 మంది పరీక్ష రాయగా, 2,497 మంది ఉత్తీర్ణులయ్యారు. 96.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది.బాలికలు 1,542 మంది హాజరు కాగా, 1,511 మంది ఉత్తీర్ణులయ్యారు. 97.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అక్కల బిమల్ రాజేంద్ర 191వ ర్యాంకు, వేమా ప్రేమ్‌కుమార్ 285వ ర్యాంకు, కాకుమాను అన్యూన్య 326వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్లుగా నిలిచారు.హోమ్స్‌ను సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగుంటూరు లీగల్: క్యాలెండర్ యాక్టివిటీస్‌లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు బుధవారం గుంటూరులోని హోమ్స్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, శిశు గృహం, స్వధార్ హోమ్, లీమా డెఫ్ అండ్ డమ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడున్న అధికారులతో మాట్లాడారు. పిల్లలకు అందుతున్న విద్య, వైద్య సదుపాయాలు, రూంలను పరిశీలించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, స్వధార్ హోమ్‌లో మహిళలకు అందుతున్న సదుపాయాల గురించి వాకబు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి రిజిస్టర్స్‌ను పరిశీలించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఫ్రీ లీగల్ ఎయిడ్, బాధిత మహిళలకు అందే పరిహారం గురించి వివరించారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు.విపత్తుల నిర్వహణపై అవగాహన అవసరంగుంటూరు వెస్ట్: ప్రకృతి వైపరీత్యాలు, భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కనీస అవగాహన ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) షేక్ ఖాజావలి అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళనకు గురికాకూడదని తెలిపారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీలైనంత వరకు నష్టం తగ్గించడం మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఫైర్ వస్తోందని తెలుసుకోవడానికి ముందుగా పొగను గుర్తించాలని, ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారంతా బయటకు వచ్చేయాలని తెలిపారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ అవతారమెత్తిన దళారి
తెనాలి అర్బన్: గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి హయాంలో పేదలకు గృహ యోగం కల్పించారు. జగనన్న కాలనీల పేరుతో ఊళ్లకు ఊళ్లు వెలిశాయి. పేదల సొంతింటి కల నెరవేరింది. తలదాచుకోవడానికి నిలువనీడ దొరుకుతుందని ఆశ పడ్డారు. వారి ఆశను ఓ దళారి సొమ్ము చేసుకున్నాడు. ఇళ్లు కట్టించి పెడతానని ఆశ చూపాడు. సగం సగం కట్టి మొహం చాటేశాడు. తెనాలి పట్టణం, మండల పరిధిలోని 23,718 మందికి పెదరావూరు, జగ్గడిగుంటపాలెం, నేలపాడు, గోలిడొంక, బుర్రిపాలెం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. వీటిలో తెనాలి పట్టణానికి చెందిన 9907 మంది, మండల పరిధిలో 1680 మంది ఉన్నారు. పేదలు ఇబ్బంది పడకూడదని ఆనాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నివాస స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భావించింది. దీనిలో భాగంగా తెనాలి పరిధిలో మొదటి విడత కింద 11,587 మందిని ఎంపిక చేసింది.వారికి గత రూ.1.80 లక్షల నగదుతో పాటు 340 కేజీల ఇనుము, 90బస్తాల సిమెంట్, ఇసుకను సరఫరా చేసింది.పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని తెనాలి పట్టణం 24వ వార్డుకు చెందిన ఎస్జీ బిల్డింగ్ వర్కు అధినేత ఎం. పున్నారావు కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. ప్రభుత్వం ఇచ్చే నగదులో ఇళ్లు నిర్మిస్తానని చెప్పి బుర్రిపాలెం లేవుట్‌లో 180 మంది నుంచి రూ.50వేలను అడ్వాన్స్‌గా వసూలు చేశాడు. వాయిదాల రూపంలో ప్రభుత్వం ఇచ్చే నగదును ఇవ్వడంతో పాటు అదనంగా రూ.50వేలు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నాడు. 100 మంది లబ్ధిదారుల నుంచి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రూ.1.97కోట్ల నిధులతో పాటు రూ.50లక్షల వరకు సొంత నగదు వసూలు చేశాడు. వీటిలో రూ.80లక్షల విలువ చేసే పనులు మాత్రమే చేసినట్లు ఆ శాఖ అధికారులు నిర్ధారించారు. ఇది కాకుండా మరో కాంట్రాక్టర్ వద్ద ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి రూ.లక్షలలో అడ్వాన్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అజ్ఞాతంలో ఉన్న అతడిని పట్టుకోవడంతో తమకు న్యాయం చేయాలని బాధితులు తెలిపారు.రూ.2.50 లక్షలకు అగ్రిమెంట్బుర్రిపాలెంలోని జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించి ఇస్తానని రూ.2.50 లక్షలకు పున్నారావు అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీనిలో భాగంగా రూ.1.50లక్షలు తీసుకున్నాడు. ఇవి కాకుండా ప్రభుత్వం పంపిణీ చేసిన మెటీరియల్ కూడా తీసుకున్నాడు. మూడు సంవత్సరాలు దాటినా నిర్మాణం పూర్తి చేయలేదు.– రామిశెట్టి దుర్గాంబ, నందులపేట, తెనాలిఅధికారులు చర్యలు తీసుకోవాలి బుర్రిపాలెం లే అవుట్లో ఇల్లు నిర్మించి ఇస్తానని పున్నారావు నా దగ్గర రూ.1.30 లక్షలు తీసు కున్నాడు. పునాదులు వరకు వేశాడు. మిగిలిన పని చేయడం లేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. అధికారులు స్పందించి ఇల్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలి.– రామిశెట్టి బాలకృష్ణ, తెనాలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదుపున్నారావు నగదు వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. లబ్ధిదారుల ఫిర్యాదును పోలీసు అధికారులకు పంపి కేసు నమోదు చేయాలని కోరాం. అతడ్ని పిలిపించి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.– భాస్కర్, ఈఈ, గృహనిర్మాణశాఖ, తెనాలి -
దౌత్య సంబంధాలు మరింత బలోపేతం
● కెన్యాలోని విహిగ కౌంటీ గవర్నర్ హెచ్ఈ డాక్టర్ విల్బర్ కే. ఓచ్చిలో ● విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన ఎనిమిది మంది కెన్యా దేశ ప్రతినిధులు చేబ్రోలు: భారత్–కెన్యా దేశాల మధ్య అకడమిక్, పరిశోధనలు, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ, బయో మెడికల్, స్కిల్ డెవలప్మెంట్, డ్రోన్ టెక్నాలజీతో పాటు పరస్పర అవగాహన, దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని కెన్యాలోని విహిగ కౌంటీ గవర్నర్ హెచ్ఈ డాక్టర్ విల్బర్ కే. ఓచ్చిలో అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కెన్యా దేశానికి చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ విల్బర్ కే. ఓచ్చిలో మాట్లాడుతూ తమ దేశంలో విద్యా అవకాశాలను మెరుగుపరచడం, సాంస్కృతిక మార్పిడిని సులభం చేయడం, కెన్యా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కెన్యాలో వ్యవసాయం, ఆహార సాంకేతికత, స్మార్ట్ అగ్రికల్చర్, బయో మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డ్రోన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో పురోగతికి విజ్ఞాన్ యూనివర్సిటీ సహకారం కావాలని కోరారు. విజ్ఞాన్ అందించే అత్యాధునిక సాంకేతిక వనరులు, పరిశోధన ప్రమాణాలు, విద్యారంగ నైపుణ్యాలు కెన్యా యువతకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా డ్రోన్ సాంకేతికత, స్మార్ట్ వ్యవసాయ పద్ధతులపై తమ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ కెన్యా ప్రభుత్వ అభ్యర్థనను యూనివర్సిటీ అధిక ప్రాధాన్యతగా పరిగణిస్తోందని చెప్పారు.త్వరలోనే విద్య, పరిశోధన, శిక్షణల పరంగా ద్వైపాక్షిక ఒప్పందాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, సీఈవో మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పి.ఎం.వి రావు, డీన్లు పాల్గొన్నారు. -
కెపా‘సిటీ’కి మించి ఇసుక రవాణా
తెనాలి: ఇసుక తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఇసుక రవాణాలోనూ ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. భారీ వాహనాల్లో కెపాసిటీకి మించి రవాణా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. భారత్ బెంజ్, టాటా బెంజ్ వంటి భారీ వాహనాల్లో ఇప్పుడు ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతోందని తెలిసిందే. వీటి కెపాసిటీ 17–18 టన్నులు మాత్రమే. ఇందుకు భిన్నంగా ఒక్కో వాహనంలో రూ.40 టన్నులు, అంతకుమించిన పరిమాణంలోనూ రవాణా చేస్తున్నారు. వాహనం బాడీకీ పైన దాదాపు మీటరు ఎత్తులో లోడింగ్ చేస్తున్నారు. పైన పట్టా కప్పి మరీ గమ్యస్థానానికి రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణాతో అవస్థలు ప్రతిరోజూ పరిమితికి మించిన లోడింగ్‌తో ఇసుక రవాణా వాహనాలు తెనాలి మీదుగా వెళుతున్నాయి. ఇసుక జారిపోతున్నా, వెనుక వచ్చే ద్విచక్రవాహన దారులకు ఇబ్బందిగా ఉంటున్నా ఎవరికీ పట్టటం లేదు. కొద్దిరోజుల కిందట వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని రైల్వే లోబ్రిడ్జి వద్ద వాహనాల నుంచి ఇసుక జారిపోయి ప్రజలు ఇబ్బది పడ్డారు. కెపాసిటీ మించిన పరిమాణంతో ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాలతో రోడ్లు, కల్వర్టులు దెబ్బతింటున్నాయి. తెనాలి పట్టణంలోంచి వాహనాలు ప్రతిరోజూ పట్టపగలే వెళుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. భారీ వాహనాల్లో తరలింపు పట్టించుకోని అధికారులు -
ఫ్లోరోసిస్ భూతంపై యుద్ధం
గుంటూరు మెడికల్: వయస్సుతో సంబంధం లేకుండా నేడు పలువురు ఫ్లోరోసిస్‌తో అనారోగ్యానికి గురవుతున్నారు. సమస్యను నియంత్రణలో పెట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా జిల్లావ్యాప్తంగా వైద్య పరీక్షలు చేయిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సిబ్బందితో వైద్య పరీక్షలు చేయిస్తోంది. మందులు కూడా ఉచితంగా అందజేస్తోంది. ఫ్లోరోసిస్ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను పూర్తిగా కట్టడి చేయవచ్చు. ఫ్లోరోసిస్ మహమ్మారిని కట్టడి చేయడమే ధ్యేయంగా జరుగుతున్న స్క్రీనింగ్ పరీక్షలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని, వ్యాధి బారిన పడకుండా మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచి స్తున్నారు. 2013లో నివారణ కార్యక్రమం ప్రారంభం ఫ్లోరోసిస్ బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ, నివారణ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం 2014 జూన్ నుండి అమల్లోకి వచ్చింది. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో 2014 నుంచి నేటి వరకు వైద్య సిబ్బంది పరీక్షలు చేసి బాధితులను గుర్తిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్ధులకు వైద్య పరీక్షలు చేసి దంత ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేశారు. ● ఫ్లోరైడ్‌తో కలుషితమైన నీటిని తీసుకోకూడదు. ● అధికంగా ఉన్న ప్రదేశాల్లో పండిన కూరగాయలు, పాలు, టీ, మాంస ఉత్పత్తులు తీసుకోకూడదు. ● బ్లాక్ టీ, సుపారి, రాక్ సాల్ట్, పాన్‌పరాగ్, పొగాకు వాడకూడదు. ● ఫ్లోరైడ్ కల్గిన టూత్ పేస్టులు, మౌత్‌వాష్ వాడరాదు. ● అల్యూమినియం పాత్రలను వంట చేసేందుకు వాడకూడదు. ● రక్షిత మంచినీటిని తాగాలి. ● పాలు, పెరుగు, జున్ను, బెల్లం, పచ్చటి ఆకుకూరలు,జీలకర్ర, మునగకాడలు, ఉసిరి, జామ, నిమ్మ, నారింజ, టమాటా, పప్పు ధాన్యాలు, చిరుదాన్యాలు, ఆకుకూరలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లి తీసుకోవాలి. ● క్యారెట్, బొప్పాయి, చిలకడ దుంపలు ఫ్లోరోసిస్ నివారణ, నియంత్రణకు దోహదపడతాయి జిల్లావ్యాప్తంగా ఉచితంగా వైద్య పరీక్షలు ఏడాదిలో 490 గ్రామాల్లో సర్వేతో బాధితుల గుర్తింపు 825 పాఠశాలల్లో స్క్రీనింగ్ పరీక్షలు ఫ్లోరోసిస్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యుల సూచన 490 గ్రామాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 490 గ్రామాల ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడి, అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని నూజెండ్ల, వినుకొండ, ఏనుగుపాలెం, కొచ్చర్ల, రెడ్డిపాలెం, రొంపిచర్ల, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు, కోటప్పకొండ, అత్తలూరు, 75 త్యాళ్లూరు, క్రోసూరు, అచ్చంపేట, రాజుపాలెం, చండ్రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అత్యధిక సంఖ్యలో బాధితులు ఉన్నారు. జిల్లాలో ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు 81 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 409 గ్రామాలు కలిపి మొత్తం 490 గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించారు. 19,682 ఇళ్లను సర్వే చేశారు. 47,854 మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 2,370 మంది అనుమానిత డెంటల్ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడినట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్య పరీక్షలు చేసి 509 మంది ఫ్లోరోసిస్ బారిన పడినట్లు తేల్చారు. ఉమ్మడి గుంటూరుజిల్లా వ్యాప్తంగా 825 పాఠశాలల్లో 24,612 మంది విద్యార్థులను పరీక్షించారు. ఇందులో 1,783 మంది అనుమానిత దంత ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్య పరీక్షలు చేసి 974 మంది విద్యార్థులు ఫ్లోరిసిస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ఫ్లోరోసిస్ రాకుండా జాగ్రత్తలు ఇవి -
చిగురించిన ఆకుపచ్చ ఆశ
ఇదో అద్భుతమైన ప్రకృతి దృశ్యం...పట్టణ బోసు రోడ్డులో టౌన్ చర్చికి ఎదురుగా గల రావిచెట్టు ఇది. మూడు దశాబ్దాలుగా నిలబడే ఉంది. దాని కింద నడిచిన కాలాలెన్నో! అక్కడి నీడలో విశ్రమించిన వారెందరో! అయితే, ఈ చెట్టుకు మాత్రం తన జీవన గమనం ఎప్పుడూ ఒకేలా ఉంటోంది. ఏటా వర్షం, ఎండ, గాలి, చలిలో ఒకే విధంగా ఉండే చక్రం. గత సంవత్సరం ఏప్రిల్ 14కు అకస్మాత్తుగా చెట్టు కొద్దికొద్దిగా ఆకులన్నీ కోల్పోయింది. అది చెట్టుకి సహజమైన విశ్రాంతి. ప్రకృతితో గల అవినాభావ సంబంధంలో అదో చిన్న విరామం మాత్రమే. నెల రోజుల్లో, ఎవ్వరూ ఊహించనంత త్వరగా పచ్చని కోటు వేసుకుంది. కొత్త ఆకులు, కొత్త ఆశలు, కొత్త జీవం. ఇప్పుడు మళ్లీ 2025లో అదే సన్నివేశం. గత ఏప్రిల్ 14వ తేదీకి ఆకులన్నీ రాలాయి. మే నెల 14వ తేదీ వచ్చేసరికి, అదే చెట్టు మళ్లీ తన సహజ రూపాన్ని చూపింది. ప్రతి కొమ్మలోనూ ఆకులోనూ పచ్చదనం పునరుజ్జీవించింది. అలా చెట్టు ఏటా తన జీవన శైలిని కళ్లకు కడుతోంది. అది ఒక్క చెట్టుకే కాదు...మనిషికీ ఇదే వర్తిస్తుంది. కోల్పోయిన దశ తర్వాత జీవితం తిరిగి వెలుగు చూస్తుంది. గతి తప్పని చీకటి ఉన్నా.. ప్రకృతి తన క్రమశిక్షణతో తిరిగి వెలుగు తెస్తుంది. మన జీవితం కూడా అలా సాగాలి...నమ్మకంతో, సహనంతో, మళ్లీ ముందుకు సాగాలనేది చెట్టు చెప్పే పాఠం. జీవితంలో ఎదురయ్యే కష్ట కాలాలకూ, నిరాశలకూ ఒక బలమైన ప్రతీక. తాత్కాలికంగా కోల్పోయిన వెలుగు, నిశ్చితంగా మళ్లీ వస్తుందన్న ఆశను అది సూచిస్తోంది. ఆకుపచ్చని ఆశ అది. –తెనాలి -
చిన్నారి మేధావి ప్రదీప్ నారాయణకు అరుదైన గుర్తింపు
తెనాలి: రూరల్ మండలం గుడివాడకు చెందిన చిన్నారి మేధావి బండికళ్ల ప్రదీప్నారాయణకు మరో గౌరవం దక్కింది. ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ వరల్డ్‌వైడ్ ఫౌండేషన్ ‘ఇంటర్నేషనల్ బెస్ట్ అచీవర్ అవార్డు’ లభించింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ, నీతి అయోగ్ల సహకారంతో ఫౌండేషన్ ఇటీవల విశాఖపట్నంలోని ప్రెస్‌క్లబ్‌లో ఇంటర్నేషనల్ సోషల్ అవార్డ్స్ ప్రదానోత్సవం నిర్వహించింది. ఇందులో ప్రదీప్నారాయణకు ఈ గౌరవాన్ని అందజేశారు. ప్రస్తుతం నాలుగేళ్ల వయసున్న చిన్నానరి 23 నెలల వయసు నుంచే అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్నాడు. తొలుత 150 పైగా వస్తువులు, కూరగాయలు, పక్షుల పేర్లను చెప్పాడు. ప్రస్తుతం 500 పైగా జంతువులు, వాహనాలు, జెండాలు, ఆకారాలు, రంగులు, ఫలాలు, కూరగాయలు, శరీర భాగాలు, ఆటబొమ్మలు, వస్త్రధారణ వంటి విభిన్న అంశాలను గుర్తించి చెప్పగలిగిన ప్రతిభను సొంతం చేసుకున్నాడు. భారత జాతీయ గీతాన్ని కేవలం 52 సెకన్లలోనే శ్రద్ధగా పాడుతున్నాడు. ఇంతటి ప్రతిభకుగాను 10 జాతీయ, 11 అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లయిన తల్లిదండ్రులు ఆ చిన్నారిలోని జ్ఞాపకశక్తిని గుర్తించి, తగిన శిక్షణనిస్తూ సంబంధిత వీడియోలను ప్రతిష్టాత్మక సంస్థలకు పంపుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రదీప్నారాయణకు అవార్డులు లభిస్తున్నాయి. -
పూలంగి సేవతో.. పవళింపుము స్వామీ!
● రంగనాఽథుడికి అంగరంగ వైభవంగా పుష్పయాగం ● సొలస ఆలయంలో ద్వాదశ ప్రక్షిణలు, పవళింపు సేవయడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో శ్రీభూ సమేత రంగనాయక స్వామి ఆలయం బుధవారం భక్తజనంతో కళకళలాడింది. ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు కై ంకర్యాల నిర్వహణ అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం వేకువజామునే రంగనాథస్వామికి పలు రకాల పుష్పాలను భక్తులు మేళతాళాలతో భజాభజంత్రీలతో గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పర్చూరి రామకృష్ణమచార్యులు ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి, పూలంగి సేవలు అందించారు. హోమపూజల్ని ముగించారు. సాయంత్రం అత్యధిక మంది భక్తులు పాల్గొని ద్వాదశ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవ చేశారు. భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఆయా కార్యక్రమాలను ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామపెద్దలు పర్యవేక్షించారు. -
పవర్ లిఫ్టర్ షానూన్కు సత్కారం
తెనాలి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగిన ఆసియన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సహా నాలుగు పతకాలు సాధించిన మదిర షానూన్‌ను బుధవారం స్థానిక కేవీఐకే జిమ్‌లో సత్కరించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్‌శ్యాంప్రసాద్ హాజరయ్యారు. షానూన్‌ను సత్కరించారు. ఆమె విజయాలు క్రీడాలోకానికి స్ఫూర్తినిచ్చేవని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. జిమ్ శిక్షకురాలు, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి మాట్లాడుతూ తెనాలికి చెందిన షానూన్ కేఎల్ యూనివర్సిటీలో బీఐఏఎస్ డిగ్రీ చదువుతూ, తెనాలి కేవీఐకే జిమ్‌లో సాధన చేస్తోందని చెప్పారు. రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలను సాధించిన తర్వాత తొలిసారిగా ఆసియా స్థాయి పోటీల్లో జూనియర్స్ విభాగంలో 47 కిలోల కేటగిరీలో పోటీ పడిందని తెలిపారు. రజత, మూడు కాంస్య పతకాలను సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. కేవీఐకే స్పోర్ట్స్ అకాడెమీకి తొలి అంతర్జాతీయ పతకాన్ని అందించినట్టు తెలిపారు. అకాడమీ తరఫున కొమ్మినేని భార్గవ్‌కుమార్, కోచ్ పూసపాటి శివరామకిరణ్రాజు, ఇతర లిఫ్టర్లు షానూన్‌ను సత్కరించారు. -
ఉచితంగా వైద్య పరీక్షలు
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు వివరించి, బాధితులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాం. పాఠశాలల విద్యార్థులకు మందులు, విటమిన్ సీ బిళ్లలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 3,504 మంది ఫ్లోరైడ్ బాధితులకు నెక్ బెల్ట్, నడుం బెల్ట్, వాకింగ్ స్టిక్, ఫ్లోల్డింగ్ టాయిలెట్ చైర్ కిట్‌ను ఉచితంగా అందించాం. వ్యాధిపై అవగాహన కలిగేలా 1,315 ప్రాంతాల్లో పోస్టర్లు అంటించాం. మెడికల్ ఆఫీసర్లు 42 మందికి, పారా మెడికల్ సిబ్బంది 84 మందికి, హెల్త్ వర్కర్లు 335 మందికి, ఆశా వర్కర్లకు 980 మందికి ఫ్లోరోసిస్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించేలా నైపుణ్యం పెంపొందించాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు -
హెచ్ఐవీ మహిళలకు క్యాన్సర్ పరీక్షలు
నరసరావుపేట: స్థానిక ఏరియా వైద్యశాలలో హెచ్ఐవీతో జీవిస్తున్న మహిళలకు త్వరలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) విభాగంతో కలిసి ఎయిడ్స్ కంట్రోల్ అధికారులు దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ శాక్స్ జాయింట్ డైరక్టర్ డాక్టర్ పి.అంకినీడుప్రసాదు, డీడీ సీఎస్టీ డాక్టర్ చక్రవర్తి, పెప్ఫార్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాదు షేర్ ఇండియా అధికారులు డాక్టర్ జయకృష్ణ బుధవారం ఏరియా వైద్యశాలను సందర్శించి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్‌కుమార్, గైనకాలజీ విభాగ అధిపతులతో ఈ అంశంపై చర్చించారు. క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ చేయటం వలన హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి త్వరగా షుగర్, బీపీ, క్యాన్సర్ గుర్తించి ముందుగానే చికిత్స ప్రారంభించటం తద్వారా వారి జీవితకాలం పొడిగించే అవకాశం ఉన్నందున దీనికి కావాల్సిన సహాయసహకారాలు అందజేసేందుకు తాము సిద్ధమని హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ కె.ఏడుకొండలు, డాక్టర్ దయానిధి, గైనకాలజీ డాక్టర్ మంత్రూనాయక్, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద పాల్గొన్నారు. ఏర్పాట్లపై నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో ఏపీ శాక్స్ అధికారుల పర్యటన -
బులియన్ అమ్మకాల్లో నిబంధనలు తప్పనిసరి
నెహ్రూనగర్: బంగారు వస్తువుల అమ్మకాల్లో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆ శాఖ జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి తెలియజేశారు. పట్నంబజార్‌లోని గుంటూరు బులియన్ జ్యుయలరీ అండ్ పాన్ బ్రోకర్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో బుధవారం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి బులియన్ లావాదేవీల్లో మిల్లీగ్రామ్కు కూడా కచ్చితమైన వేయింగ్ మెషిన్ వాడాలని సూచించారు. బిల్లు క్యారటేజ్ అనుగుణంగా ఉండాలని తెలిపారు. బంగారానికి గ్రాము ధర ఉండాలన్నారు. రాళ్లు పొదిగిన ఆభరణాల బిల్లులో బంగారానికి, రాళ్లకు వేరుగా, పరిమాణం, చెల్లించాల్సిన పైకం కూడా వేర్వేరుగా ఉండాలని సూచించారు. బంగారం వెయిట్ చూసే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్‌ను ప్రతి సంవత్సరం విధిగా లీగల్ మెట్రాలజీ వారితో ధ్రువీకరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ డెప్యూటీ కంట్రోలర్ షాలేంరాజు, అసిస్టెంట్ కంట్రోలర్ కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ సునీల్రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
భవన నిర్మాణ అనుమతులపై అపోహలు వీడండి
టౌన్ ప్లానింగ్ గుంటూరు రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ తెనాలి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన భవన నిర్మాణాల అనుమతులపై అనేక అపోహలున్నాయని, వాటిని వీడాలని టౌన్ ప్లానింగ్ విభాగ గుంటూరు రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ముందుకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం పట్టణ పరిధిలోని పలు సచివాలయాలను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన నూతన నిబంధనల వల్ల ఎటువంటి నష్టం లేదన్నారు. లైసెన్స్ సర్వేయర్లు కొందరు దీనిపై అపోహలు సృష్టించారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో అన్ని చోట్లా ప్లాన్ల దరఖాస్తు ప్రక్రియ నిలచిపోయిందని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని పట్టణాల్లో ఫ్లెక్సీలు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనధికార కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తెనాలి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ జేపీ రెడ్డి, తెనాలి అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శివన్నారాయణ, వాణి, టీపీవో సాంబశివరావు పాల్గొన్నారు. -
గుంటూరులో కార్డన్ సెర్చ్
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న రామిరెడ్డితోటలో మంగళవారం ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. రామిరెడ్డితోట ప్రాంతాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది 80 మంది కలసి జల్లెడపట్టారు. నేరస్తుల కదలిక, అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక పనులను నిరోధించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్‌లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని, స్టేషన్‌కు తరలించారు. మొబైల్ సెక్యూటీ చెక్ డివైజెస్ ద్వారా పలువురు అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. అందులో విజయనగరానికి చెందిన ఒక సెల్‌ఫోన్ దొంగ పట్టుపడ్డాడు. అతనిని స్టేషన్‌కు తరలించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక రౌడీషీటర్ జైలులో ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిరోధించేందుకు లాడ్జిలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామన్నారు. పోలీసు గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గుంటూరు నగరంలోని అరండల్‌పేట, లాలాపేట, నగరంపాలెం, కొత్తపేట పోలీసుస్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించగా, తెనాలి, తుళ్లూరు, నార్త్, సౌత్ పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వాహనాలకు సంబంధించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకొచ్చిన వారికి వాహనాలు తిరిగి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తపేట, లాలాపేట, పాతగుంటూరు సీఐలు వీరయ్య చౌదరి, శివప్రసాద్, వై.వీరసోమయ్య, ఎస్ఐలు రెహమాన్, ప్రసాద్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డితోట ప్రాంతంలో జల్లెడ పట్టిన పోలీసులు స్వయంగా హాజరైన ఎస్పీ సతీష్‌కుమార్ 80 మంది సిబ్బంది, అధికారులు హాజరు 64 వాహనాలు స్వాధీనం అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
రేపల్లె: బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని సీడీపీఓ సుచిత్ర చెప్పారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఉప్పుడి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిశోరి వికాసం సమ్మర్ ప్రత్యేక క్యాంపులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను గ్రామీణులకు తెలియపరచాలన్నారు.. యువతికి 18 ,యువకునికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని చెప్పారు. బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమన్నారు. అలా చేస్తే రూ. లక్ష జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. 2 సంవత్సరాలు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడంతోపాటు ఐదు సంవత్సరాలు దాటిన వారిని పాఠశాలలకు పంపేలా బాధ్యత వహించాలన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం, విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. కిశోరి బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ పి. నాంచారమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు. -
ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ...
తాడేపల్లి రూరల్: పరలోకంలో ఉన్న పెద్దల అనుగ్రహం కోసం పిండ ప్రదానం చేస్తుంటాం..ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బ్రాహ్మణుల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించే కృష్ణానది చెంత ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నారు. పొట్ట నింపుకోవడం కోసం చేసేది లేక బాధలను దిగమింగుతున్నారు. అధికారులు కూడా వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీతానగరం వద్ద కృష్ణానది చెంతన నిత్యం పిండ ప్రదానాలు, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సుమారు 50 మందికి పైగా పండితులు నిత్యం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరంతా రెక్కాడితేకాని డొక్కాడని పేద బ్రాహ్మణులు. పిండ ప్రదానం చేసేందుకు వచ్చే వారు, బ్రాహ్మణులు విశ్రాంతి తీసుకునేందుకుగాను గతంలో ఓ భవనం ఉండేది. ఆ భవనాన్ని ‘సీత భవన్’గా మార్పు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. దీంతో విశ్రాంతి తీసుకునేందుకు నీడ లేకుండా పోయింది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారులు సమీపంలోనే ఉన్నా స్పందించకపోవడంపై పండితులు పెదవి విరుస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తలదాచుకునేందుకు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. కృష్ణానది చెంత పిండప్రదానాలు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్న బ్రాహ్మణులు పట్టించుకోని అధికారులు -
పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు
పరీక్షలపై డీఆర్ఓ షేక్ ఖాజావలి సమీక్ష గుంటూరు వెస్ట్: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఇంటర్మీడియట్ (ఓపెన్ స్కూల్) పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ షేక్ ఖాజావలి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఈపరీక్షలకు జిల్లా మొత్తం 27 పరీక్షా కేంద్రాలు, 4,224 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో 971 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. వేసవి కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటితోపాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులక సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూము నుంచి పరీక్ష పేపర్లు, ఇతర మెటీరియల్స్ తరలించే వాహనాలకు పోలీసులు ఎస్కార్ట్ ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మరుగుదొడ్లు, శానిటేషన్ సక్రమంగా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ రేణుక, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినర్ కె.వెంకటరెడ్డి, జీఎంసీ డెప్యూటీ కమిషనర్ సి.హెచ్.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన అవసరం గుంటూరు వెస్ట్: ప్రకృతి వైపరీత్యాలు, పెను ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు భయపడకుండా కొద్దిపాటి అవగాహనతో ప్రవర్తిస్తే నష్టాలను అరికట్టవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి తెలిపారు. వరదలు, తుపానులు, అగ్నిప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు తక్కువ నష్టంతోనూ, ముఖ్యంగా ప్రాణహాని కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో డీఆర్ఓ విపత్తు నిర్వహణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎ.లక్ష్మీకుమారి, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అగ్నిమాపక, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖలు ఎనలేని సేవలందిస్తాయన్నారు. ముఖ్యంగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం నివారించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. బుధవారం జరగనున్న మాక్ డ్రిల్‌లో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఒ.శ్రావణ్ బాబు, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు, డీసీహెచ్ఎస్ మయానా మజీదాబి పాల్గొన్నారు. -
20న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు
కారంచేడు: ఈ నెల 20వ తేదీన గ్రామ దేవత స్వర్ణమ్మ తల్లి తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థారడ్లెడ్ల పరుగు పందెం పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి రూ. 20 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాలుగో బహుమతి రూ. 5 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు దుర్గారావు (77308 30949), సాయికిరణ్ (63001 50488), నంగనం తేజ (80742 60245) ఫోను నంబర్లలో సంప్రదించాలని కోరారు. పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి రేపల్లె: రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ ఏడీ నాంచారయ్య అన్నారు. పట్టణంలోని పశు వైద్యశాలలో పశు యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన దాణాను మంగళవారం ఆయన పంపిణీ చేసి, మాట్లాడారు. పశువులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. యజమానులు తమ పశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్, పశు వైద్యాధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణతో పాటు భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పరిపాలన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెనీ క్రిస్టినా మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు, జెడ్పీకి రావాల్సిన ఆదాయం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, రేవుల వేలం, షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి రావాల్సిన బకాయిలపై మండలాల వారీగా వివరాలు సేకరించారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న కల్యాణ మండపాలు, దుకాణాల నుంచి అద్దెలు, లీజు బకాయిలను వసూలు చేయాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు జెడ్పీకి రావాల్సిన ఆదాయ వనరులు, బకాయిలకు సంబంధించి మండలాల వారీగా సమీక్షించారు. డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ ప్రతినెలా ఇవ్వాల్సిన నివేదిక వివరాలను క్రమం తప్పకుండా పంపాలని సూచించారు. వార్షిక అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్, పెండింగ్‌లో ఉన్న బకాయిలు, న్యాయస్థానాల్లో ఉన్న కేసుల వివరాలను సేకరించారు. వివిధ అంశాలపై పరిపాలనాధికారులు పూర్ణచంద్రారెడ్డి, శోభారాణి, తోట ఉషాదేవి నివేదిక సమర్పించారు. సమావేశంలో అకౌంట్స్ అధికారి శామ్యూల్‌పాల్, ఎంపీడీఓలు, ఏఓలు పాల్గొన్నారు. -
రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి
గుంటూరు రూరల్/తాడికొండ: రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని బండారుపల్లి, నల్లపాడు రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో రేపల్లే నుంచి చర్లపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి వృద్ధుడు మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారుగా 65 నుంచి 70 సంవత్సరముల మధ్య ఉంటుందని, తెల్లజుట్టు, తెలుపు రంగు ఆఫ్ చేతుల చొక్కా, తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడని, ఎరుపు రంగు మొలతాడు కట్టుకుని ఉన్నాడన్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు, నడికుడి గవర్నమెంట్ రైల్వే పోలీసువారిని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు నడికుడి రైల్వే పోలీసు స్టేషన్ ఎస్ఐ రోశయ్య 8309369916, 9949063960 సెల్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
కార్డులు జారీ చేయకుండా ‘సుఖీభవ’ ఎలా?
లక్ష్మీపురం: గుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏలా అమలు చేస్తారని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌలురైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చెప్పటం నమ్మదగ్గ విషయం కాదన్నారు. గత సంవత్సరం జారీ చేసిన గుర్తింపు కార్డులకు కాల పరిమితి ముగిసిందనీ, ఈ ఏడాది కొత్తగా కౌలుగుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంజుల రెడ్డి, పీవీ జగన్నాథం మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ మాట్లాడుతూ అప్పుల బాధతో చనిపోయిన కౌలురైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్‌తేజకు వినతిపత్రం అందజేశారు. కౌలు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారిని ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపడతామని జిల్లా జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు కంచుమాటి అజయ్, కౌలురైతుల సంఘం నాయకులు బి.రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా.. జేసీకి వినతిపత్రం -
చట్ట వ్యతిరేకంగా పోలీసుల ప్రవర్తన
తాడికొండ: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తాడికొండ మండలం కంతేరు ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన, ఇతరులను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసిన నేపథ్యంలో బాధితులను నియోజకవర్గ ఇన్చార్జి డైమండ్ బాబు, పలువురు ఇన్చార్జిలతో కలిసి రాంబాబు మంగళవారం కంతేరు గ్రామంలో పర్యటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన కాకుండా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు. భారతీయ మహిళ, ప్రజాప్రతినిధిగా ఉన్న కంతేరు వలపర్ల కల్పన, మహాలక్ష్మీ, కర్రి విజయభాస్కర్, నితిన్‌లను అక్రమంగా అర్ధరాత్రి 3.30 గంటలకు అరెస్టు చేయడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకమన్నారు. కోర్టులో మాత్రం ఉదయం అరెస్టు చేశామని చెప్పడం న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించడమే కాకుండా న్యాయస్థానానికి అసత్యాలు చెప్పే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని అన్నారు. చిన్న పిల్లల తగాదాకు రాజకీయ రంగు పులిమి ఎంపీటీసీని జైల్లో పెట్టడం దుర్మార్గం అన్నారు. బాధితులు దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిపై మాత్రం చర్యలు తీసుకోపోవడం పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. ఈ విషయం కోర్టు వారికి తెలియజేయగా కోర్టు వారు మెమో జారీ చేశారని, జిల్లా ఎస్పీకి బాధితులను తీసుకెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. చిలకలూరిపేట మాజీ మంత్రి రజినిని నెట్టివేసి ఆమె కారులో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని చొక్కా పట్టుకొని తీసుకురావడం ఏంటి అని ప్రశ్నించారు. చివరకు ఆ కేసులో చిన్న నోటీసు ఇచ్చి పంపించారని అన్నారు. డీజీపీకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, హోంమంత్రికి చెప్పినా ఉపయోగం లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధితులను కలసి భరోసా ఇచ్చేందుకు వచ్చామని ధైర్యంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీలో కొనసాగుతుండటమే పాపమా! కూటమి నాయకులు భయపెట్టి బెదిరింపులకు గురిచేసినా వైఎస్సార్సీపీలో కొనసాగుతుండడమే పాపమా అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఇక్కడ కొట్టింది ఓసీలు అరెస్టు చేసింది ఎస్సీలను అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్ధమవుతుందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో దీనిపై పార్టీ పోరాడి వారిని దోషులుగా నిలబెడతామన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్) మాట్లాడుతూ తాము గ్రామీణ వాతావరణం గొడవలు లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో తాపత్రయపడుతుంటే కులాల మధ్య చిచ్చుపెట్టే తీరును వైఎస్సార్పీపీ ఖండిస్తుందని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎంపీటీసీ బోడపాటి సుశీల, మాజీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి, బొమ్మిరెడ్డి అశోక్‌రెడ్డి, ఫిరంగిపురం మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, బద్దూరి శ్రీనివాసరెడ్డి, చుండు వెంకటరెడ్డి, బాకి వెంకటస్వామి, బోడపాటి ధర్మరాజు, గుంటి రఘువరన్, కొప్పుల శేషగిరిరావు, అరేపల్లి జోజి, బెజ్జం రాంబాబు, పుట్టి సుబ్బారావు, నేలపాటి నాగేంద్ర, కొయ్యగూర వినోద్ తదితరులు పాల్గొన్నారు. మహిళను అర్ధరాత్రి అరెస్టు చేయడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
నులకపేటలో కారు బీభత్సం
పలు వాహనాలను ఢీకొట్టిన వైనం.. ఇద్దరికి గాయాలు తాడేపల్లి రూరల్: మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై నులకపేట వద్ద ఓ కారు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం నులకపేట వినాయకుడి గుడి వద్ద మంగళగిరి నుంచి వస్తున్న కారు ఎదురుగా వెళుతున్న ఆటోను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని, సోడా బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిని ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న సోడా బండి, ద్విచక్రవాహనం దెబ్బతిన్నాయి. ఢీకొట్టిన కారు యజమాని పరారవుతుండగా స్థానిక యువకులు వెంబడించి నులకపేట సెంటర్లో అడ్డుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళతాను, దెబ్బతిన్న వాహనాలను బాగు చేయిస్తానని మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. జరిగిన ఈ సంఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేసి బాధితుల దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్
నెహ్రూనగర్: ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి అడ్మినిస్ట్రేటర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేరళ రాష్ట్రానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్ పీఎస్ నియమితులయ్యారు. ఏఈఎల్సీ రాజ్యాంగం ప్రకారం ఆమోదించబడిన అన్ని పాలక మండలలు, కమిటీలు ఏర్పడే వరకు అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్‌గా జోసఫ్ వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత జూనియర్ జడ్జి నేలటూరి జేసు రత్నకుమార్ కంట్రోలర్ కార్యదర్శిగా నియమితులయ్యారు.శ్రీ భక్తాంజనేయస్వామి గ్రామోత్సవంయర్రబాలెం(మంగళగిరి): మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యర్రబాలెంలో వేంచేసి ఉన్న భక్తాంజనేయస్వామి వారి విగ్రహ, జీవ, ధ్వజ, విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మంగళవారం స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు పలు రకాల పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ భక్తాంజనేయస్వామి వారిని ట్రాక్టర్‌పై అధిష్టంపచేసి పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.‘ఎయిర్ కూలర్లు’ ఏర్పాటు చేయిస్తాం..గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్లో పక్షవాత బాధితులు ఇబ్బంది పడకుండా వేసవి ఎండ నుంచి ఉపశమనం కోసం ఎయిర్ కూలర్లు తక్షణమే ఏర్పాటు చేయిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పక్షవాత రోగులకు చికిత్స అందించే స్ట్రోక్ యూనిట్లో ఏసీలు పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ జిల్లా ఎడిషనల్లో రోగులకు సన్ ‘స్ట్రోక్’ శీర్షిక పేరుతో కథనం ప్రచురితమైంది. కేవలం స్ట్రోక్ బాధితులే కాకుండా చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఏసీలు మరమ్మతులు చేసినప్పటికీ మరలా పనిచేయడం మానేశాయి. ఈవిషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రోగులు ఫ్యాన్లు సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమతులు ఇస్తామని వెల్లడించారు.ఉండవల్లి కొండపై మంటలుతాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లి కొండపై మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉండవచ్చని, లేదా ఈ వేసవి ఎండల కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతుండడంతో దిగువ భాగాన నివాసముంటున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. సుమారు 2 గంటలపాటు వ్యాపిస్తూనే ఉన్నాయి. స్థానికులు ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందజేశారు. గతంలో ఇలాగే కొండలపై మంటలు చెలరేగాయని ఈ మంటల వల్ల కొండప్రాంతం తగలబడుతుందని స్థానికులు అంటున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్19న ఉదయం 11 గంటలకు ఎన్నికదుగ్గిరాల: దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మండల పరిషత్ అధికారులు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ఎన్నిక జరుగుతుందని తెలిపారు. 15వ తేదీ లోపల ఫారం–5 ద్వారా ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు ద్వారా తెలియజేసి తరువాత ప్రకటించిన విధంగా ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. -
కూలీల వలసలు నివారించాలి
యర్రగొండపాలెం: తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజలు కూలీ పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఈ ప్రయాణంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని గడ్డమీదిపల్లె గ్రామానికి చెందిన కూలీలు బొప్పాయి కోతల కోసం వెళ్తూ పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామానికి సమీపంలోని హైవే రోడ్డుపై జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే మంగళవారం ఆయన గడ్డమీదిపల్లెకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతులకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. దీంతో రైతులు అప్పుల పాలయ్యారని, ఈ కారణాలతో ఎకరాలకొద్దీ ఉన్న రైతులు సైతం కూలీ పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులు కూడా సక్రమంగా జరగడం లేదని, ఆ నిధులను కూడా కూటమి నాయకులు మెక్కేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పనులు కల్పించకపోవడంతోనే గడ్డమీదిపల్లెకు చెందిన 300 కుటుంబాలు వలసలు వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థవుతోందన్నారు. మృతుల కుటుంబాలను పరిశీలిస్తే కూలీ పనుల కోసం దూర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారనే విషయం అర్థం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం యర్రగొండపాలెం మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే వలస వెళ్లక తప్పడం లేదన్నారు. వలసలు నివారించాలంటే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుకు వెంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి, ప్రాజెక్ట్‌కు నీళ్లు వదలడమే సరైన మార్గమన్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వినుకొండ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
నరసరావుపేటటౌన్: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి అల్లూరయ్య మాట్లాడుతూ వినియోగదారుల దిన వారోత్సవాల్లో భాగంగా కల్తీలు, తూకాల్లో వ్యత్యాసాలపై వివిధ రూపాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా చట్టప్రకారం నడుచుకోవాలన్నారు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చట్టపరమైన అంశాలను వివరించారు. నరసరావుపేట, సత్తెనపల్లి ఇన్స్పెక్టర్లు సాయి శ్రీకర్, జాన్‌సైదా తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా ?
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ధ్వజమెత్తారు. ఇప్పటికీ ఎంతో మంది రైతులు, మహిళలు జైళ్లలో మగ్గుతున్నారని, నియంతృత్వ ప్రభుత్వాలు ఎంతోకాలం నిలబడవని తెలిపారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో అంబేడ్కర్ విగ్రహానికి మెమోరాండం అందజేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించి, పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో దళిత ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పనతో పాటు మరి కొంతమంది మహిళలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అర్ధరాత్రి మహిళా కానిస్టేబుళ్లను పక్కన పట్టి, సీఐ వాసు కల్పనను కనీసం దుస్తులు కూడా మార్చుకోనీయకుండా, అసభ్యంగా మాట్లాడుతూ ఇంట్లోంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం మహిళలను ఉదయం 6 గంటల తరువాత అదుపులోకి తీసుకోవాలని, అది కూడా మహిళా ఇన్స్పెక్టర్ ఉండాలన్నారు. ఎవరూ లేకుండా కూటమి నాయకుల మెప్పు కోసం సీఐ వాసు ఇలా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి విడతల రజనీని కూడా ఎటువంటి నిర్ధారణ లేని కేసులు పెట్టి, ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పర్చాలని ప్రశ్నించిన రైతులు, మహిళలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా పంపించుకుంటూ పోతే జైళ్లన్నీ నిండిపోతాయని చెప్పారు. త్వరలోనే అఖిల పక్షం ఆధ్వర్యంలో ‘జైల్ భరావో’ కార్యక్రమం నిర్వహిస్తామని, తామంతా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నియోజకవర్గంలో దళితులను అగ్రవర్ణాలు బహిష్కరణకు గురిచేసినా కనీసం ఉప ముఖ్యమంత్రి నోరు మెదపలేదని విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై అనేకచోట్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదు వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్సీ సెల్ నాయకులు ఈదులమూడి డేవిడ్‌రాజు మాట్లాడుతూ ఒకవైపు పోరాటం నిర్వహిస్తూ మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సలహా మేరకు లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షులు ఈపూరి ఆదాం, తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలుకోటి శ్రీనివాస మధు, గుంటూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు మేడ వెంకటేశ్వరరావు (పండు), బాలసాని అనిల్, బత్తుల దాసు, పెరికే బాబు, అమృతరావు, కాండ్రు నాగరాజు, ఇసుకపల్లి అనిల్, బేతం భాస్కర్, చిన్నం అనిల్, బుర్ర శ్రావణ్, గంజి షణ్ముఖ, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు రైతులు, మహిళలు అనే తేడా లేకుండాకేసులు నమోదు తప్పుడు కేసులు పెట్టినప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి -
రోగుల సేవలో నర్సులది కీలకపాత్ర
మంగళగిరి: రోగులకు వైద్య సేవలందించడంలో నర్సుల పాత్ర కీలకమని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా సోమవారం ఎయిమ్స్ ఆధ్వర్యంలో నర్సులు వాక్‌థాన్ నిర్వహించారు. ఎయిమ్స్ వెస్ట్ గేటు వద్ద డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత దాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిమ్స్ నుంచి వాక్‌థాన్‌గా మంగళగిరి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ చేరుకుని, అంబేడ్కర్ విగ్రహ సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సులు ప్రజలకు అత్యవసర పరిస్థితిలో అందించాల్సిన వైద్య సేవలు, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ డెమో చేసే విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ రోగులకు వైద్యం అందించే సమయంలో డాక్టర్లతో పాటు నర్సుల పాత్ర ఎంతో విలువైనదని కొనియాడారు. రోగికి సపర్యలు చేస్తూ వ్యాధి నయమయ్యేందుకు నర్సులు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం వాక్‌థాన్‌లో భారీగా పాల్గొన్ననర్సింగ్ విద్యార్థినులు -
త్రయాహ్నిక మహోత్సవాలు ప్రారంభం
నగరంపాలెం: అరండల్‌పేటలోని శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠపాలిత శ్రీ గంగా మీనాక్షి సోమసుందరేశ్వరస్వామి దేవాలయం (శివాలయం)లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యప్పస్వామి వార్లకు గోపుర నిర్మాణం, శిఖర ప్రతిష్ట త్రయాహ్నిక మహోత్సవాన్ని సోమవారం ప్రారంభించారు. యాగ బ్రహ్మ గుంటూరు కాశీ విశ్వనాథశర్మ మాట్లాడుతూ గోవు, గణపతి పూజలు, దీక్ష ధారణ, వాస్తు హోమం చేశామని తెలిపారు. ఈనెల 13న మూలమంత్ర జపాలు, హోమం, ఆదివాసాలు, బలిహరణ, ఊరేగింపు, 14న మూలమంత్ర హోమాలు, శ్రీ విద్యారణ్య భారతి స్వామి స్వహస్తాలతో యంత్ర, శిఖర ప్రతిష్ట, కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్ట, పూర్ణాహుతి, శాంతి కల్యాణం, ప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. ఈ మూడు రోజులు కార్యక్రమాలను అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ధర్మకర్త ఏకా ప్రసాద్, ఆలయ అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్యశర్మ, కుందుర్తి భాస్కర్‌శర్మ, ఆలయ గోపుర నిర్మాణ, శిఖరాల దాత సిరిపురపు శ్రీధర్‌శర్మ, దారపనేని శివప్రసాద్, మర్రిపాటి ప్రసాద్ పాల్గొన్నారు. -
రోగికి కేసు షీట్ ఇవ్వాల్సిందే..!
గుంటూరు మెడికల్: రోగికి కేసు షీటు ఇవ్వాల్సిందేనని జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు అన్నారు. గుంటూరులోని గర్తపురి కన్జూమర్స్ కౌన్సిల్ ఆఫీసులో సోమవారం వైద్య వివరాలు, హాస్పిటల్స్ విధులపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి చేకూరి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ప్రకారం రోగ నిర్ధారణ, పరిశోధన వివరాలు రోగికి తప్పనిసరిగా వైద్యాధికారులు తెలియజేయాలని తెలిపారు. రోగి మరణిస్తే అన్ని కారణాలు ఆ కేసులో తెలపాలని చెప్పారు. వైద్యులు ఏ మందులు ఎప్పుడు వాడారు..నర్సింగ్ సిబ్బందికి చెప్పిన సూచనలు కేసులో తేదీల వారీగా ఉండాలని, చికిత్స వివరాలు సమగ్రంగా ఉండాలని తెలిపారు. రోగి గానీ, అతని బంధువులు గానీ మెడికల్ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో అందించాలని సూచించారు. రాజశేఖర్ మాట్లాడుతూ రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్ ప్రాక్టీషనర్కు ఏ మినహాయింపు, ఏ చట్టం ఇవ్వలేదని తెలిపారు. మొత్తం చికిత్స వివరాల ఫొటో కాపీలు హాస్పిటల్ వారు ఇవ్వాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ సభ్యుడు బీరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ హాస్పిటల్ వారు రోగికి వైద్య వివరాలను నిరాకరించడమంటే తన బాధ్యత నిర్వహణలో నిర్లక్ష్యమవుతుందని తెలిపారు. న్యాయస్థానాలు కోరినప్పుడు తప్పనిసరిగా సంబంధిత రోగి రికార్డులు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. బేబీ సరోజిని మాట్లాడుతూ వైద్యులు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు, కేసు షీటును సాక్ష్యాధారంగా కోర్టులో ఉపయోగించవచ్చని తెలిపారు. మునిపల్లె కవిత మాట్లాడుతూ రోగులకు చికిత్స చేసిన వివరాలను అందించడంలో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు. కేసు సీట్ బాధ్యత వైద్యులు, హాస్పిటల్ పైన ఉందని చాలా కేసుల్లో కోర్టులు తీర్పులు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు -
రాష్ట్రస్థాయి ధర్నాను విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యారంగంతో పాటు ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు మూడవ దశ పోరాటంలో భాగంగా ఈనెల 14న విజయవాడలో తలపెట్టిన ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కన్నావారితోటలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడారు. 117 జీవో రద్దుతో పాటు, పాఠశాల విద్యారంగంలో పూర్వ విధానాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయకుండా, తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడం సరైనది కాదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. బదిలీల్లో అన్ని కేడర్ల వారీగా ఖాళీలు చూపుతామని చెప్పి, ప్రస్తుతం ప్రతి మండలంలో కొన్ని ఖాళీల చొప్పున బ్లాక్ చేసేందుకు నిర్ణయించడం తగదని పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు సయ్యద్ చాంద్ బాషా, మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:20, ఉన్నత పాఠశాలలో 45 మందికి రెండవ సెక్షన్, ప్రాథమికోన్నత పాఠశాలకు కనీసం ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలల్లో సైతం గందరగోళ పరిస్థితులను తెచ్చారని విమర్శించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఉదాసీనత విడనాడనాడకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ మూడు జిల్ల్లా శాఖల ప్రధాన బాధ్యులు మహమ్మద్ ఖాలీద్, ఉస్మాన్, విజయబాబు, సీనియర్ నాయకులు జి.దాస్, ఎస్ఎస్ఎన్ మూర్తి, చక్కా వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ చెట్టిపోగు లక్ష్మణ్ కుమార్, మాలకొండయ్య, పి.శివరామకృష్ణ పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవ లింగారావు -
భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
గుంటూరు రూరల్: భర్త వేధింపులు భరించలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న ఆమె మృతదేహాన్ని పలు నాటకీయ పరిణామాల మధ్య అంబులెన్స్‌లో గుంటూరు శివారు ఓబులనాయుడుపాలేనికి తరలించడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు, నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం... ప్రత్తిపాడు మండల యనమదల గ్రామానికి చెందిన హేమలతకు 2020లో ఓబులనాయుడుపాలెం గ్రామానికి చెందిన మురళీతో కులాంతర వివాహం జరిగింది. హేమలత హైదరాబాదులోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. పెళ్లి అనంతరం కాపురాన్ని హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతానికి మార్చారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త మురళి జులాయిగా తిరుగుతూ, బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. డబ్బులు కోసం నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ ఉండేవాడు. చేసేదిలేక హేమలత తన శక్తికి మించి రుణాలు చేసి అడిగిన మొత్తం సర్దుబాటు చేసేది. ఇటీవల భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఆదివారం భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు. హేమలత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పకుండా భర్త ఆమె మృతదేహాన్ని నేరుగా అంబులెన్స్‌లో ఓబులనాయుడుపాలేనికి తీసుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న హేమలత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వంశీధర్ ఆదేశాల మేరకు ఎస్.ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీరో ఎఫ్ఐర్ చేసి కేసును హైదరాబాద్ చందానగర్ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రజల ఫిర్యాదులకు తక్షణం స్పందించాలి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) నిర్వహించారు. బాధితుల నుంచి అర్జీలను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ స్వీకరించారు. ఫిర్యాదిదారుల మొరను అలకించారు. జిల్లాలోని ఆయా సబ్ డివిజన్లలోని పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. డీపీఓలో ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించాలని సూచించారు. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే సంబంధిత బాధితులకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు జి.వి. రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), శివాజీరాజు (సీసీఎస్) కూడా ఫిర్యాదులు స్వీకరించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ బెదిరింపులు ఈ ఏడాది మార్చిలో ఆక్షన్ ద్వారా ఆర్.అగ్రహారంలోని 150 చదరపు గజాల స్థలాన్ని రూ.32.52 లక్షలకు కొనుగోలు చేశా. గత నెలలో గుంటూరు కార్యాలయంలో రిజిస్టర్ చేశారు. అయితే, గతంలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైనాన్స్ సంస్థ వద్ద అప్పు తీసుకుని డీఫాల్టర్ అయ్యారు. వారిద్దరి మధ్య లావాదేవీలు ముగిశాకనే ఆస్తిని కొనుగోలు చేశాం. ఇంటిని పునః నిర్మించాలనే ఉద్దేశంతో వెళితే కానిస్టేబుల్, అతని భార్య ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లో ఉండేందుకు వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరిస్తున్నారు. కానిస్టేబుల్‌తోపాటు ఇంటికి ఎదురుగా ఉంటున్న ఓ ఇద్దరు కూడా వారికి మద్దతుగా ఉంటున్నారు. కానిస్టేబుల్‌ను పిలిచి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకుంటున్నా. – ఓ మహిళ, చర్లగుడిపాడు గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా భార్య దౌర్జన్యం చిన్నతనంలోనే పోలియో సోకింది. నడిచేందుకు కష్టపడాలి. ఓ ప్రైవేటు ఆయిల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నా. 2018లో ఓ మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నా. ఐదేళ్లు బాబు ఉన్నాడు. కొన్నాళ్లు కాపురం సజావుగా జరిగింది. 2023 నవంబర్‌లో కుమారుడ్ని తీసుకుని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసిన ఆచూకీ తెలియలేదు. ఇటీవల ఆమె గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో ఉంటోందని తెలిసింది. దీంతో అక్కడికెళ్తే నాపై భార్యతోపాటు పలువురు దాడికి పాల్పడ్డారు. బంధువులతో చంపేందుకు కుట్ర ప్రయత్నాలు చేసింది. అయితే, వారి నుంచి తప్పించుకుని బయటపడ్డాను. భార్య, దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. న్యాయం జరగలేదు. ఐదేళ్ల కుమారుడు జీవించి ఉన్నాడా.. లేదా తెలియడం లేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు రూ.16 లక్షలు, లక్షలు ఖరీదు చేసే బంగారం, వెండి వస్తువులు, ఇంటి పత్రాలతో ఉడాయించింది. ప్రస్తుతం దివ్యాంగ ఫించన్ సైతం నిలిపివేశారు. బతికేందుకు కష్టంగా ఉంది. న్యాయం చేయగలరు. – సీహెచ్.మహేంద్ర, రామకృష్ణనగర్, వైఎస్ఆర్ కడప జిల్లా. పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆదేశం పీజీఆర్ఎస్లో బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ -
వైభవంగా లక్ష్మీ నృసింహస్వామి జయంత్యుత్సవం
మంగళగిరి: శ్రీ నారసింహ చతుర్దశిని పురస్కరించుకుని సోమవారం శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి జయంత్యుత్సవం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. -
అర్జీల పరిష్కారం వేగవంతం
పీజీఆర్ఎస్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు గుంటూరు వెస్ట్: వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీల పరిష్కారం మరింత వేగవంతం చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గంగరాజు మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో వివిధ శాఖల సమన్వయం బాగుండాలని తెలిపారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. 199 అర్జీలను గంగరాజు, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, జడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పరిశీలించారు. దర్గాను స్వాధీనం చేసుకోవాలి స్థానిక హజరత్ కాలే మస్తాన్ వలి దర్గాను డైరెక్ట్ మేనేజ్‌మెంట్‌లోకి తీసుకోవాల్సిందిగా వక్ఫ్‌బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో దర్గాను స్వాధీనం చేసుకుని పవిత్రను కాపాడాలి. దర్గా ముతవల్లి కుమారుడు డ్రగ్స్ కేసులో చిక్కుకుని దర్గా పరువును, ప్రతిష్టను మంటగలిపారు. భక్తుల మనోభావాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని మనవి. – షేక్ సుభాని, నాగూల్ మీరా, గుంటూరు బతుకు భారంగా మారింది ఆదుకోండి నేను నా భార్య కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాం. మా అబ్బాయి రాజేష్‌కు చిన్నప్పటి నుంచి నూరు శాతం అవిటితనం ఉంది. మా బాబుకు రూ.15 వేలు పెన్షన్ వచ్చేట్లు చూడండి. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరు బాబుతో 24 గంటలు ఉండాల్సిందే. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. మమ్మల్ని ఆదుకోండి. – కుమారునితో కె.రాము, సుజాత దంపతులు -
పన్నెండు గంటల నిర్విరామ నృత్య ప్రదర్శన
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక మార్కెట్ కూడలిలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విజయమాధవి సేవ సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయమాధవికిశోర్ ఆధ్వర్యంలో జరగ్గా, 12 గంటలపాటు రత్నాచార్యులు, నృత్య కళాకారులు చేపట్టిన నృత్యాలు అలరించాయి. అనేక మంది కళాకారులు, వారి శిష్యుల అద్భుత నృత్య ప్రదర్శనలు చక్కటి హావ భావాలతో ప్రదర్శించారు. అనంతరం నాట్యాచార్యులను, కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో సినీ నటులు రాగిణి, నాగమణి, టి.రజినీరెడ్డి, సీనియర్ గుండె వైద్యులు రామారావు, హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసమూర్తి ప్రసంగించారు. -
నేత్రపర్వం.. రథోత్సవం
అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం పొన్నూరు: గోవిందా.. గోవిందా నామస్మరణతో సోమవారం పొన్నూరు పట్టణం మార్మోగింది. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావన్నారాయణ స్వామివారి దివ్య రథోత్సవం స్వర్ణపురి వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనంతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం మహోత్సవం కనుల పండువగా జరిగింది. నిడుబ్రోలు వాస్తవ్యులు, పద్మశాలీ బహూత్తములు చింతక్రింది కిషోర్ కుమార్, వారి సోదరులు స్వామివారికి తలంబ్రాలు సమర్పించగా, అనువంశీక ధర్మకర్తలు శ్రీమంత్ రాజా వాసిరెడ్డి సుధా స్వరూప్ బహుద్దూర్ మన్నే సుల్తాన్ దొర ఆధ్వర్యంలో స్వామికి తలంబ్రాలు పోశారు. పొన్నూరు భక్తజన సంద్రం సోమవారం ఉదయం గరుడోత్సవం, మధ్యాహ్నం దేవస్థానంలో బ్రాహ్మణ సమారాధన అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో పూలతో విశేషంగా అలంకరించిన రథంపై స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, స్వామి నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి. ఆలయ ప్రాంగణం నుంచి కసుకర్రు రోడ్డు వరకు రథోత్సవం సాగింది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పాందారు. స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి భక్తులు ముగ్దులయ్యారు. సుమారు మూడు గంటల పాటు రథోత్సవం సాగింది. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మజ్జిగ, తాగునీరు అందించారు. చీమకుర్తి నాగభూషణరావు, పాములపాటి కృష్ణయ్య, పీ.టీ చౌదరి, కమలేంద్రనాథ్, కొండముది రామకృష్ణారావు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్పీ జనార్ధనరావు ఆధ్వర్యంలో పట్టణ సీఐ వీరానాయక్, ఎస్ఐ శ్రీహరితో పాటు పలువురు ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈఓ, సిబ్బంది పర్యవేక్షించారు. వైభవంగా సాక్షి భావన్నారాయణ స్వామి రథోత్సవం గోవింద నామస్మరణతో మార్మోగిన పొన్నూరు వీధులు -
రోగులకు సన్ ‘స్ట్రోక్’
జీజీహెచ్‌లో పనిచేయని ఏసీలు ● పక్షవాతంతో ప్రాణాపాయ స్థితిలో రోగులు ● మొరాయిస్తున్న చికిత్సా పరికరాలు ● వైద్యులు, వైద్య సిబ్బందికి చెమటలు ● అధికారుల్లో కనిపించని స్పందన ● ‘సాక్షి’ చొరవతో సోమవారం రాత్రి ఏసీలు ఏర్పాటు ● కార్డియాలజీ విభాగంలో పనిచేయని ఏసీలపై స్పందించని అధికారులు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఓ గుర్తింపు ఉంది. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని విధంగా గుంటూరు జీజీహెచ్‌లో (బ్రెయిన్ స్ట్రోక్) పక్షవాతం వచ్చిన వారికి తక్షణమే చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ దాతల సహాయంతో స్ట్రోక్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రతినెలా వందల కొద్ది బాధితుల ప్రాణాలు కాపాడుతున్న స్ట్రోక్ యూనిట్లో నాలుగు రోజులుగా ఏసీలు పనిచేయడం లేదు. దీంతో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది చమటోడుస్తున్నారు. కోమాలో ఉండి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రోగులకు కొద్దిపాటి సాయం అందించేందుకు పక్కన ఉండే రోగుల సహాయకులు సైతం ఏసీలు పనిచేయక సొంతంగా ఇళ్ల వద్ద నుంచి ఫ్యాన్లు తెచ్చి పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు ఉండటం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా .... స్ట్రోక్ యూనిట్లో ఏసీలు పనిచేయడం లేదని, తద్వారా చికిత్స పొందుతున్న స్ట్రోక్ బాధితులకు చికిత్స అందించేందుకు సైతం చాలా అవస్థలు పడాల్సి వస్తుందని వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చికిత్స కోసం రోగికి అమర్చే వైర్లు సైతం ఏసీలు పనిచేయక చమటలు కారిపోయి ఊడి పోతున్నాయి. దీంతో ఏ క్షణంలో రోగికి ఏమవుతుందోనన్న భయాందోళన వైద్యుల్లోనూ, వైద్య సిబ్బందిలోనూ, రోగి బంధువుల్లోనూ నెలకొని ఉంది. రాత్రి సమయాల్లో స్ట్రోక్ యూనిట్లో ఏసీలు పనిచేయక ఉక్కపోతకు ఊపిరాడక లోపల ఉండలేక, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బంధువులను వదిలి బయటకు రాలేక నరకయాతన పడుతున్నారు. కాగా ఏసీలు పనిచేయక స్ట్రోక్ యూనిట్లో రోగులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని వివరణ కోరగా వారు కాంట్రాక్టర్‌ను మూడు రోజుల క్రితం మార్చామని తెలిపారు. సోమవారం నూతన కాంట్రాక్టర్ ఏసీలు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం రాత్రికి ఏసీలు పనిచేయడంతో స్ట్రోక్ యూనిట్లో రోగులు, వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కార్డియాలజీలో పనిచేయకపోయినా స్పందించడం లేదు రెండు నెలలుగా కార్డియాలజీ సీసీయూ విభాగంలో ఏసీలు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని పలు మార్లు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో చికిత్స పొందుతున్న విభాగంలో ఏసీలు పనిచేయక గుండెజబ్బు రోగులు, స్ట్రోక్ రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర వైద్య సేవల విభాగంలో కూడా (క్యాజువాల్టి) ఏసీలు పనిచేయక అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రి అధికారులు ఇప్పటికై నా స్పందించి ఆసుపత్రుల్లో ప్రతి వార్డులో ఏసీలకు తక్షణమే మరమ్మతులు చేయించి రోగుల ప్రాణాలు పోకుండా కాపాడాలని పలువురు బాధితులు కోరుతున్నారు. -
తెలుగు సాహితీ సంబరాల్లో తెనాలి కవులు
రంగిశెట్టి రమేష్‌కు కవిరత్న సాహితీ పురస్కారం తెనాలి: ఏలూరులో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీల్లో 48 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి జాతీయ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. తెనాలికి చెందిన కవి, రచయిత డాక్టర్ రంగిశెట్టి రమేష్‌కు కవిరత్న సాహితీ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ప్రముఖ సాహితీవేత్తలు, కళాకారుల సమక్షంలో సంస్థ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కార్యదర్శి ఈశ్వరి భూషణం, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఈ అవార్డును అందజేశారు. గత నాలుగు దశాబ్దాలుగా సాహితీ సేద్యం చేస్తూ, వచన కవితా ప్రక్రియలో ఇప్పటికీ రోజుకో సామాజిక అంశంతో కవితను రాస్తూ, సామాజిక చైతన్యంతో పాటు తెలుగుభాషా వికాసానికి రమేష్ కృషి చేస్తున్నారు. ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు భాషా సేవా సాహితీ పురస్కారం... ఇదే వేదికపై తెనాలికి చెందిన కవి, రచయిత, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగుభాషా సేవా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వృత్తిపరంగా గుంటూరు–2 ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆళ్ల నాగేశ్వరరావు, ప్రవృత్తిగా సాహితీ సేద్యం చేస్తున్నారు. వచన కవితా ప్రక్రియలో ఇప్పటికీ రోజుకో సామాజిక అంశంతో కవితను రాస్తున్నారు. సామాజిక చైతన్యం, తెలుగుభాషా వికాసానికి కృషి చేస్తున్నందున పురస్కారం అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. -
సమస్యలను వారంలో పరిష్కరిస్తాం
కొల్లిపర(తెనాలి): తమకు అందిన ప్రతి సమస్యను వారంలో పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో మంత్రి సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహతో కలిసి 200 వినతులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా బియ్యం కార్డుల దరఖాస్తులే ఉన్నాయి. అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా కోటి 46 లక్షల మందికి రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. నేడు ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో), మండల పరిపాలనాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల ప్రజా పరిషత్ పరిధిలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షిస్తామని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, మండల పరిపాలనాధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో హాజరు కావాలని సూచించారు. ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు అమరావతి: బుద్ధ జయంతి వేడుకలను ధాన్యకటక బుద్ధవిహార ట్రస్టు చైర్మన్ డాక్టర్ వావిలాల సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక పాత మ్యూజియంలోని మహా చైత్యం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ వావిలాల మాట్లాడుతూ 2569 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు నడయాడిన అమరావతి నగరం దక్షిణ భారతదేశంలో బౌద్ధ ధర్మానికి కేంద్ర బిందువుగా కొనసాగిందన్నారు. సాక్షాత్తు గౌతమ బుద్ధుడు తన మొదటి కాలచక్ర క్రతువులు అమరావతి నుంచే ప్రారంభించారని బౌద్ధ సాహిత్యకారుల నమ్మకమన్నారు. అందుకే ఇక్కడ బుద్ధుని అస్థికలతో కూడిన మహా చైత్యం అనే గొప్ప కట్టడాన్ని నిర్మించారన్నారు. తొలుత మహాస్థూపం వద్ద ప్రత్యేక పూజాకార్యక్రమాలు, బౌద్ధమత ప్రార్థనలు నిర్వహించారు. నిమ్మా విజయసాగర్ బాబు, కోలా వెంకటేశ్వర రావు, యోగాశ్రమ నిర్వాహకులు కోనూరు అప్పారావు ప్రపుల్ల రాణి, గిరి స్వామి, పలువురు బౌద్ధమతస్తులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా పరిధిలో 30 పరీక్ష కేంద్రాలలో మొదటి సంవత్సరం పరీక్షకు 93.34 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 87.99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్–3 ప్రశ్నపత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జూనియర్ ఇంటర్‌కు 3,132 మంది జనరల్ విద్యార్థులకుగాను 2,945మంది హాజరయ్యారు. 154 మంది ఒకేషనల్ విద్యార్థులకుగాను 122మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విద్యార్థులు 413 మంది నమోదు కాగా 364 మంది, ఒకేషనల్ విద్యార్థులు 70మందికి గాను 61 మంది హాజరయ్యారు. జిల్లా పరిధిలో ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి కె.సుచరిత తెలిపారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా టీవీఎస్‌జీ కుమార్ నరసరావుపేట: పల్నాడు జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(కేఆర్ఆర్సీ–కోనేరు రంగారావు కమిటీ)గా టీవీఎస్‌జీ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పోస్టులో ఆర్.కుముదినిసింగ్ పనిచేశారు. -
మహంకాళీ అమ్మ వారికి రూ.లక్ష విరాళం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసిఉన్న మహంకాళీ అమ్మ వారి దేవస్థానం అభివృద్ధికి పెదకాకానికి చెందిన కె.శ్రీహరిబాబు, నాగేశ్వరి దంపతులు లక్ష రూపాయలను విరాళంగా ఆదివారం అందజేశారు. దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు అమ్మవారి చిత్రపటం బహూకరించారు. కోడి పందేలు వేస్తున్న ఆరుగురి అరెస్టు పర్చూరు(చినగంజాం): మండలంలోని నూతలపాడులో కోడి పందేలు వేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ మాల్యాద్రి అందించిన సమాచారం మేరకు.. నూతలపాడులోని వడ్డెర కాలనీలో చెరువు కట్ట మీద కోడి పందేలు వేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ. 5,100ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు నరసరావుపేట ఈస్ట్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. అరండల్‌పేటలోని అవ్వారి భావన్నారాయణ భవన్ సీపీఐ కార్యాలయంలో ఆదివారం పీడబ్ల్యూడీ వర్క్‌షాప్స్ అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు టి.శేషయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెకు కార్మికులను సమాయత్తం చేయాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య, చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ కార్మికుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేజర్, మైనర్ బ్రాంచ్ కాల్వలకు పూడికలు తీయించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కోరారు. అనంతరం యుద్ధంలో వీర మరణం పొందిన మురళీనాయక్, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు నివాళులర్పించారు. సమావేశంలో యూనియన్ నాయకులు వీసం వెంకటేశ్వర్లు , సుబ్బారావు , సుబ్బయ్య, రసూల్‌ఖాన్, కె.నిరీక్షణరావు, టి.కృష్ణసూరి, పి.శాంతయ్య పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
సత్తెనపల్లి: దేశంలో యుద్ధం జరుగుతుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన అమలు చేస్తోందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలంతా ఉగ్రవాదులను మట్టుపెట్టాలన్న సంకల్పంతో రక్షణ బలగాలకు సంఘీభావం తెలిపితే.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి.. ఎలా కక్షలు తీర్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూసి ఉండమని తెలిపారు. లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి అబద్ధాలను ఆరోపణలుగా మార్చి, దాని చుట్టూ కక్ష తీర్చుకునే క్రమంలో ఓ వైపు జగన్మోహన్రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కనుక కొన్నాళ్లపాటు ఆటలు చెల్లుతాయని, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఇవాళ కాకపోయినా రేపైనా నిజాలేంటో బయటపడతాయని, చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ప్రజలు మాత్రం క్షమించరన్నారు. మాజీ మంత్రి రజినీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, శ్రీకాంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసేందుకు చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు దౌర్జన్యంగా వ్యవహరించాడని ధ్వజమెత్తారు. చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న పద్ధతిని కూడా పోలీసులు పాటించలేదని, ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో తప్పకుండా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చట్టం చెబుతోందని వెల్లడించారు. కంతేరులోనూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కల్పన అనే దళిత మహిళను వేకువజామున మూడు గంటల సమయంలో 20 మంది పోలీసులు దౌర్జన్యంగా వెళ్లి అరెస్టు చేశారన్నారు.దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భార్గవ్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కర్రి భాస్కర్, వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్త మహాలక్ష్మి, ఆమె కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తు న్నారని, తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు షేక్ నాగూర్ మీరాన్, రమావత్ కోటేశ్వరరావు నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, నాయకులు రాజవరపు శివ నాగేశ్వరరావు, కళ్లం విజయభాస్కర్ రెడ్డి, చిలుకా జైపాల్, అచ్యుత శివప్రసాద్, లోకా మాధవ, బండి మల్లికార్జునరెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సుభాని, షేక్ నాగూర్ బాషా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి మాజీ మంత్రి రజినీని తోసివేయడం, శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమం కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక -
ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లొస్తుండగా ప్రమాదం
పిడుగురాళ్ల: పట్టణ శివారు అయ్యప్పస్వామి దేవస్థానం దగ్గర హైవే పక్కనున్న సేఫ్టీ రైలింగ్‌ను కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌కు చెందిన బాణావత్ అరవింద్, సోనియాల వివాహం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు కోసం చీరాల సముద్ర తీరానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పక్కనున్న రైలింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జయంత్యుత్సవాలు
వైభవంగా నృసింహస్వామిమంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామి నామకరణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. – మంగళగిరి● తలవంచని అమ్మతనంఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సుందరి. భార్యాభర్తలు ఇద్దరూ ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఓ ఆటో ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టడంతో నడుం విరిగింది. నిలబడి పనులు చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో ఇద్దరు పిల్లల పోషణ కష్టమైంది. వారి కడుపు నింపేందుకు మనసు చంపుకొని యాచన వృత్తి చేపట్టింది. చక్రాల కుర్చీలో తిరుగుతూ యాచన చేస్తోంది. తాడేపల్లికి చెందిన ఆమె హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతోంది. గతంలో ఇళ్లలో పనిచేసే సమయంలో యజవానులతో మాట్లాడే క్రమంలో భాషలు వచ్చాయని చెప్పింది. ప్రభుత్వం స్పందించి సొంత ఇల్లు, చిరు వ్యాపారానికి సాయం చేయడంతోపాటు, ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇప్పిస్తే తనకు ఆసరాగా ఉంటుందని ఆమె ప్రాథేయ పడుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
‘ప్రోటోకాల్’కు టికెట్లు తప్పనిసరి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ‘ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలకు టికెట్లు తప్పని సరి చేయండి.. సిఫార్సులపై వచ్చే వారి ఆధార్ నంబర్లతో పాటు వారిని ఎవరు పంపారనే వివరాలు పుస్తకంలో నమోదు చేయండి.. గతంలో ఏం జరిగిందో నేను అడగను.. ఇకపై తప్పనిసరిగా ఇవి చేయండి’ అని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం దుర్గగుడిపై భక్తుల రద్దీ అధికంగా ఉండటంలో కీలక ప్రదేశాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు గుంపులు గుంపులుగా ఉండటాన్ని గమనించి పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, అధికారుల పేరిట వచ్చిన వారిగా గుర్తించి టికెట్లపై ఆరా తీశారు. ప్రోటోకాల్ ఉన్న వారికి ప్రస్తుతం జరుగుతున్న విధానాన్ని స్వస్తి పలికి, ఇకపై ప్రతి ఒక్కరికీ ఒక టికెటు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవసరమయితేనే దేవస్థాన సిబ్బంది ప్రోటోకాల్ దర్శనాలకు రావాలని సూచించారు. అనంతరం టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో వస్తున్న భక్తులతో మాట్లాడారు. సమాచార కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన ఈవో సిఫార్సులపై దర్శనానికి విచ్చేసే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో పాటు సిఫార్సు చేసిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించారు. మహా మండపంలో తనిఖీలు.. మహా మండపం 7వ అంతస్తులోని దేవస్థాన మైక్ ప్రచార కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎస్పీఎఫ్ సిబ్బంది ఛాంబర్లో తనిఖీలు నిర్వహించిన ఆయన డ్యూటీ చార్ట్‌ను .. ఉచిత మజ్జిగ పంపిణీని ఈవో పరిశీలించారు. -
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ?
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాంధీ గురజాల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సిద్ధాడపు గాంధీ ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట సీఐ మాట్లాడిన మాటలు సరైనవి కావని ఖండించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కృష్ణవేణిని కూడా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఇబ్బందులు గురి చేస్తోందని ఆరోపించారు. సీఐ మాజీ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజనీని కారులోంచి అక్రమంగా బలవంతంగా బయటకు నెట్టారని, ఆయనపై సీఎం, డెప్యూటీ సీఎంలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం కూటమి నాయకులు మానుకోవాలని, ప్రజలకు అభివృద్ధి పనులు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే తరహాలో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే రానున్న ఎన్నికల్లో వారే బుద్ధి చెబుతారని కూటమి నాయకులను హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, వేముల చలమయ్య, జె. రమణ, నారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను ఎస్జీటీలకే ఇవ్వాలి
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుభాని సత్తెనపల్లి: ఎస్జీటీలుగా పని చేస్తూ ఒక్క పదోన్నతి కూడా పొందని వారు 30 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రాథమిక పాఠశాలలకు వారిని ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ఎం సుభాని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్లను పీఎస్‌హెచ్‌ఎంగా నియమించడం వల్ల వారికి సబ్జెక్ట్ మీదే పట్టు ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల్లో అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాలంటే ఎస్జీటీలకే అనుభవం ఉందన్నారు. మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హతను బట్టి +2, హైస్కూల్, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తిని బట్టి అందరిని భర్తీ చేయాలని కోరారు. వీటిల్లో ఎస్జీటీలను నియమించకూడదని తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్జీటీలు వేల సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. బదిలీల్లో ఖాళీలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయని, ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో ఒక ఎస్జీటీ బదిలీ కోసం జిల్లాలో ఖాళీగా ఉన్న అన్నీ స్థానాలను ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది సమయంతో కూడుకున్న అంశమని, ఎస్జీటీలకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్జీటీలకు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. -
పవర్ లిఫ్టింగ్‌లో షబీనాకు 4 స్వర్ణాలు
మంగళగిరి: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో దేశం తరఫున పాల్గొన్న షేక్ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధానిలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 180 కేజీలు, ఓవరాల్ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్ లిఫ్టింగ్ కోచ్ షేక్ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన షబీనాను రాష్ట్ర, జిల్లా అసోషియేషన్ ప్రతినిధులు అభినందించారు.వైభవంగా బ్రహ్మోత్సవాలుపొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం పంచామృత స్నపన, తిరుమంజనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భావనారాయణ స్వామి అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. గజ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఘనంగా తిరునక్షత్ర మహోత్సవంతాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనంలో ఉదయం 9 గంటలకు సర్వగ్రహ దోష నివారణ, దృష్టి దోష నివారణ కోసం లక్ష్మీ నారసింహస్వామి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించామని, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్వామి వారి కల్యాణం, మల్లె పుష్పార్చన ఉత్సవాలు నిర్వహించామని అనంతరం తీర్ధ ప్రసాద గోష్టి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.ద్వారకాతిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో వీకే శీనానాయక్ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల వెళ్లిన దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులను ఆ దేవస్థాన ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులు, దుర్గగుడి ప్రధానఅర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు. -
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు
నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ అధికార, సిబ్బంది ఏకమై, ప్రధానమైన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జిలు, దుకాణ సముదాయాలు, జనసంచారం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఆదివారం విసృత తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరించారు. బ్యాగ్‌లను పరిశీలించి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు, ఏం పనులకు వెళ్తారనే విషయాలను ఆరాతీశారు. గుర్తింపు కార్డులను సైతం కూలంకుషంగా పరిశీలించారు. ప్రధాన మార్గాల మీదగా వచ్చే, పోయే వాహనాలను తనిఖీ చేశారు. వాహన పత్రాలను పరిశీలించారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే స్థానిక పోలీసుల దృష్టికి తేవాలని సూచించారు. -
‘సమాజానికో బహిరంగ లేఖ’ ఆవిష్కరణ
బాపట్ల: భావితరాలకు బంగరు భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి.సి.సాయిబాబు పేర్కొన్నారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్య బోధించడం ముఖ్య అంశం అంటూ సమాజానికో బహిరంగ లేఖ పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించాలని, వారిని సరైన మార్గంలో నడిపించడం అందరి బాధ్యతని సూచించారు. పిల్లల సెల్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలని తెలిపారు. పుస్తక పఠనం వైపు వారిని మళ్లించడం నేటి మన కర్తవ్యంగా భావించాలని ఆయన కోరారు. ‘మరో గ్రంథాలయ ఉద్యమ’ కార్యాచరణలో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో ’సమాజానికో బహిరంగ లేఖ’ కరదీపికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకులు, చిత్రకారుడు గుడంశెట్టి వెంకటేశ్వర్లు, శాఖా గ్రంథాలయాధికారి ఏ. శివాజీగణేషన్, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్కేటీ కాలనీలో కార్డన్ సెర్చ్
నరసరావుపేట రూరల్: బయట వ్యక్తుల్ని కాలనీలోకి అనుమతించవద్దని డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్కేటీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 14మంది ఎస్ఐలు, 100మంది సిబ్బంది పాల్గొన్నారు. మూడు గంటల పాటు కాలనీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారు, ఆటోతో పాటు 41 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. రాడ్లు, కత్తులు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాలనీలో అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు కాలనీలో వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురిచేసే వారిని గుర్తించి మేమున్నాం అనే భరోసా ఇచ్చేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీఐలు ఎం.వి. చరన్, హైమారావు, పి.రామకృష్ణ, లోకనాథం పాల్గొన్నారు. -
ఇవిగో ఇటీవల దుర్ఘటనలు...
పట్నంబజారు : మద్యం విక్రయాలతో ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో గుంటూరు జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 2024 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జరిగిన విక్రయాలే దీనికి సాక్ష్యం. కేవలం ఏడు నెలల కాలంలో జిల్లాలో 9.75 లక్షల లీటర్ల మద్యం విక్రయించారు. 8.87 లీటర్ల బీర్ కూడా అమ్మారు. ఈ ఎండాకాలం ప్రారంభం నుంచి అధికంగా బీర్ల విక్రయాలు జరిగినట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తమ్మీద రూ.9.10 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కేసులు పెడుతున్నా.... పండుగలు, ఉత్సవాలు, శుభకార్యాల పేరుతో మందుబాబులు తెగ తాగేస్తున్నారు. పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులే అత్యధికంగా పట్టుబడుతుండటం గమనార్హం. 40 – 55 ఏళ్ల వారు తర్వాత స్థానంలో ఉన్నారు. మైనర్లు కూడా మద్యం మత్తులో పట్టుబడటం మరింత ఆందోళన కలిగించే అంశం. చిక్కుతూనే ఉన్నారు.. గుంటూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ల్లో గత మూడేళ్లలో 2,137 కేసులు నమోదు అయ్యాయి. 2023లో 1,004, తర్వాతి ఏడాదిలో 813, ఈ సంవత్సరం ఇప్పటివరకు 318 కేసులు నమోదు అయ్యాయి. బ్రీత్ ఎన్లైజర్లతో దొరుకుతున్న యువత సైతం వంద శాతానికిపైగా మద్యం తాగి పట్టుబడుతున్నట్లు తేలడం గమనార్హం. ఇలా ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. శిక్ష తప్పదు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. మొదటి సారి చిక్కితే రూ.10 వేల వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష పడొచ్చు. రెండో సారి అదే తప్పు చేస్తే రూ.15 వేల వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. మద్యం తాగి ప్రమాదానికి కారకులై ఎవరికై నా ఐదేళ్ల వరకు తప్పనిసరి జైలు శిక్ష పడొచ్చు. ● మద్యం మత్తులో కొత్తపేట భగత్‌సింగ్ బొమ్మ సెంటర్ వద్ద యువకుడు కారు నడుపుతూ అనేక మందిని ఢీకొట్టాడు. పలువురిని తీవ్ర గాయాలపాలు చేశాడు. ● గుంటూరు నగరంలోని కోబాల్డుపేటలో ముగ్గురు మద్యం మత్తులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు. వారు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ● ఏటూకూరు రోడ్డులో సైతం మద్యం మత్తులో యువకులు బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో వారిద్దరితోపాటు మరో వాహనదారుడు కూడా మృతి చెందాడు. ● గుంటూరు ఈస్ట్ పరిధిలో ఒక మైనర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడ్డాడు. కనీసం అతనికి ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా తాగేశాడు. 183 శాతం.. అంటే భారీగా తాగినట్లు బ్రీత్ ఎన్లైజర్ మిషన్ ద్వారా తేలింది. నిబంధనలు మీరితే కఠిన చర్యలు జిల్లాలో పెరిగిపోతున్నడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మద్యం మత్తులో ప్రమాదాల్లో పలువురు మృత్యువాత ఇతరుల ప్రాణాలనూ బలిగొంటున్న మందుబాబులు ఆదాయంపైనే దృష్టి పెట్టడంతో ఏరులై పారుతున్న మద్యం ఇటీవల జరిగిన ఈ ఘటనలన్నీ ఉదాహరణలు మాత్రమే. నిత్యం జిల్లాలో రోజూ మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే ప్రమాదాలకు గురికావటంతోపాటు, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉంది. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి మరణానికై నా ప్రమాదం రూపంలో కారణమైన వ్యక్తికి జైలు శిక్ష కూడా పడుతుంది. అదనపు కఠిన శిక్షలు కూడా విధించేలా చట్టాన్ని మార్చారు. – ఎం. రమేష్, ట్రాఫిక్ డీఎస్పీ, గుంటూరు -
ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి
చిలకలూరిపేట: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు ఉండే విధంగా, 120 రోల్ దాటిన ప్రతి పాఠశాలకు ఒక పీఎస్ హెచ్ఎం, ఐదుగురు టీచర్లు ఉండే విధంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. పట్టణ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ స్కూల్స్ పర్యవేక్షణకు అర్బన్ ఎంఈవోను నియమించాలని విజ్ఞపి చేశారు. సమావేశంలో సంఘ నాయకులు వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, వి. జయప్రకాశ్, మగ్బుల్ బాషా, దుర్గాప్రసాద్, షేక్ మస్తాన్‌వలి, ఎం. శారద, తదితరులు పాల్గొన్నారు. -
17న స్టాండప్ కామెడీ షో పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈనెల 17న కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో ‘స్టాండ్ అప్ కామెడీ షో ‘ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి పి.రామచంద్రరాజు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలతోపాటు మనదేశంలోని మెట్రో నగరాలకు పరిమితమైన ‘స్టాండ్ అప్ కామెడీ షో‘ను మొదటిసారిగా గుంటూరు నగరానికి పరిచయం చేస్తున్నట్లు వివరించారు. వేదికపై ప్రదర్శకుడు నిలబడి సమాజంలో ఉన్న వివిధ అంశాలను ఎత్తి చూపిస్తూ వ్యంగ్య, హాస్య భరితమైన తన హావభావాల ద్వారా ఆహుతులను నవ్విస్తూ ఆకట్టుకోవడమే స్టాండప్ కామెడీ షో అని తెలిపారు. నవరసాల్లో ఒకటైన హాస్యరస కళను ప్రదర్శించేందుకు యువతీ, యువకులకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుందని తెలిపారు. ఆసక్తితో కళాకారులుగా ఎదగాలనుకునే వారు భారతీయ విద్యాభవన్ కార్యాలయంతో పాటు 98854 21496, 83176 13187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ప్రదర్శన తిలకించేందుకు ప్రవేశం ఉచితమని తెలిపారు. కృష్ణా నదిలో మునిగి ఆటో డ్రైవర్ మృతి కొల్లిపర: కృష్ణా నదిలో మునిగి ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొల్లిపర పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెనాలి చెంచుపేటకు చెందిన షేక్ బాజి(25)కి రెండేళ్ల కిందట వివాహమైంది. ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కొల్లిపర కృష్ణానది తీరానికి వెళ్లాడు. ఇసుక క్వారీ సమీపంలో తన అన్నతో కలసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో చుట్టపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ పి.కోటేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రికి మృతహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.30 అడుగుల వద్ద ఉంది. ఇది 137.3416 టీఎంసీలకు సమానం. -
సాయం చేయబోయి మృత్యు ఒడికి రైతు
కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు పెదకూరపాడు: తోటి రైతుకు సాయంగా వెళ్లి ప్రమాదానికి గురైన రైతు కథ విషాదంగా ముగిసింది. చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని అచ్చంపేట నుంచి పెదకూరపాడు తీసుకొచ్చే క్రమంలో లగడపాడు వద్ద ప్రమాదం జరిగింది. ఇందులో తీవ్ర గాయాలైన పెదకూరపాడు వాసి గోరంట్ల బ్రహ్మయ్య (33)గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ‘‘మాతృ దినోత్సవం రోజే నా మాంగల్యం తీసుకెళ్లావా... దేవుడూ.. నీకు కనికరం లేదా ! మంచానికే పరిమితమైన అత్తామామలు, బిడ్డలను ఎలా సాకాలయ్యా !’’ అంటూ భార్య మల్లిక విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ‘‘సాయానికి వెళ్లి సామి దగ్గరకు వెళ్లావా నాన్నా !’’అంటూ కుమారుడు మణికంఠ, కుమారై సుక్షలు గుండెలు అవిసేలా విలపించారు. అందరితో కలవిడిగా తిరిగే బ్రహ్మయ్య మృతితో పెదకూరపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
బాపట్ల: శ్రీ భావన్నారాయణస్వామి రథోత్సవానికి తనను ఆహ్వానించక పోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామని, ప్రతి విషయంలో శాస్త్రోక్తంగా ముందుకు పోయామని కోన వివరించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేవాలయం అభివృద్ధికి వేసిన కమిటీ లెక్కలు అప్పగించలేదంటూ కొంతమంది మాట్లాడుకోవడంలో అర్థం లేదని ఖండించారు. బాపట్లకే తలమానికై న శ్రీభావన్నారాయణస్వామి దేవాలయంలో స్వామి సహా దేవాలయం శిథిలావస్థకు చేరుకుంటే ఎవరకు పట్టించుకోలేదన్నారు. దేవాలయం అభివృద్ధికి ఎంతో కష్టించి పని చేశామని కోన చెప్పారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రముఖ న్యాయవాది కొల్లిమర్ల సత్యనారాయణను చైర్మన్‌గా, కొంతమందిని సభ్యులుగా ఉంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రతి ఒక్క రూపాయికీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాతోనే నిర్వహణ చేశామని చెప్పారు. పాత రథంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనే ఉద్దేశంతో కొత్త దానికి తానే స్వయంగా దేవాదాయశాఖ నుంచి కోటి రూపాయలు మంజూరు చేశాయించామని చెప్పారు.రథం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోపాటు దాతల సహకారం కూడా తీసుకున్నామని తెలిపారు. దాతలుగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రూ.22లక్షలు కూడా ఇచ్చారని వెల్లడించారు. స్తసపతితో పాటు దేవదాయశాఖ నుంచి ఇంజనీర్లు కూడా వచ్చి రథం నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. ప్రతి రూపాయికీ లెక్క కమిటీ నిర్వహణలోనే దేవాలయం, రథం నిర్మాణం జరిగిందని కోన చెప్పారు. ప్రతి రూపాయికీ లెక్కలు ఉన్నాయని, కమిటీ చైర్మన్ సత్యనారాయణ చనిపోవడంతో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. మరో పక్షం రోజుల్లో లెక్కలు చూపుతామని చెప్పారు.అక్కడేదో తప్పు జరిగిందంటూ సత్యప్రసాద్ అనే న్యాయవాది ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. లెక్కల్లో వివరాలు కావాలంటే తనను నేరుగా కలిసి అడిగేందుకు అవకాశం ఉందన్నారు. ఆయన ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసమే లెక్కలు బయటకు చెప్పాలని పట్టుబడుతున్నారని రఘుపతి దుయ్యబట్టారు. ఆహ్వానం లేకపోయినా టెంకాయ కొడతా.. బాపట్లకు పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేయడంతో శ్రీ భావన్నారాయణస్వామి దేవాలయం ఉన్నత ప్రతిష్టకు కృషి చేశామని కోన పేర్కొన్నారు. స్వామిని దర్శించుకోవడానికి తనకు ఏ ఆహ్వానం లేకపోయినా ఫర్వాలేదని తెలిపారు. అందరు టెంకాయలు కొట్టిన తరువాత చివరిగా వెళ్లి కొట్టి, మొక్కులు తీర్చుకుంటానని కోన చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, జోగి రాజా, చింతల రాజశేఖర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి దేవాలయం అభివృద్ధి కోసం వేసిన కమిటీ కోరిన వివరాలు వెల్లడిస్తాం కమిటీ చైర్మన్ కొల్లిమర్ల మృతితో జాప్యం రథోత్సవానికి ఆహ్వానం లేకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్య -
కృష్ణమ్మకు గర్భశోకం
ఇసుక మేట.. కాసుల వేట సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇసుక మేట...రూ.కోట్ల దోపిడీకి అందమైన పేరు. ఏనాడో కృష్ణా నదీ గర్భంలో కలిసిపోయిన భూములవి. అక్కడ పంటలు పండించేది లేదు. రూపాయి ఆదాయం వచ్చే అవకాశం అసలుండదు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీ నేతల కళ్లు ఆ భూములపై పడ్డాయి. ఎందుకూ పనికి రాని వాటిల్లో ఇసుక మేట పేరుతో కాసుల వేట సాగించవచ్చని యోచన చేశారు. పక్కా ప్రణాళికతో పావులు కదిపారు. రైతుల పేరుతో అనుమతులు చకచకా వచ్చాయి. నిబంధనలను తీసి గట్టునపెట్టారు. రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇందులో అసలు రైతులకు దక్కింది నామమాత్రమే. మళ్లీ ఇప్పుడు అదే ఇసుకమేట పేరుతో దోపిడీకి తెరతీశారు. ఇసుకాసురులకు వరప్రసాదం తెనాలి నియోజకవర్గంలోని కృష్ణాతీరం లోని కొల్లిపర మండలం ఇసుకాసురులకు వరప్రసాదం. అధికారిక ఇసుక రీచ్‌లు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రణాళికలు రచిస్తారు. పేరు మాత్రమే ఉచితం. అన్నీ పక్కాగా, పకడ్బందీగా జరిగిపోతాయి. అధికార గణం ప్రేక్షకపాత్ర వహిస్తుంది. పత్రికల్లో వచ్చినపుడు హడావుడిగా అక్కడకు తనిఖీలకు వెళతారు. అప్పటికే గప్‌చుప్ మన్నట్టుగా అక్కడ అన్నీ సర్దేసుకుంటారు. మళ్లీ రెండురోజుల తర్వాత షరా మామూలే! సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేస్తారు. యంత్రాలతో ఇసుక తవ్వటం, బారీ డంపర్లలో 45 టన్నుల వరకు అధిక లోడింగ్‌తో రవాణా చేస్తుండటం కొల్లూరు మండలంలోని రీచ్‌లో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. రేపో మాపో అనుమతులు ఇక రేపో మాపో ఇసుక మేట తొలగింపునకు అనుమతులు వచ్చేస్తాయి. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అనుమతులు పట్టా రైతు పేరిటే ఉంటాయి. అక్కడ ఇసుక తవ్వకాల నుంచి, అమ్మకాల వరకు అన్నీ అధికార పార్టీల నేతల దళారులే పర్యవేక్షిస్తారు. అనుమతి తీసుకున్న భూమిలోనే కాకుండా నదిలో సమీప ప్రాంతంలోనూ తవ్వుతారు. నిబంధనల ప్రకారం ఎకరాకు ఇన్ని క్యూబిక్ మీటర్ల చొప్పున మాత్రమే తవ్వాలని, అది కూడా ఇన్ని అడుగులకు లోతుకు మించి తవ్వరాదని స్పష్టంగా ఉంది. వాటిని ఏమాత్రం ఖాతరు చేయరు. నిలువెత్తు లోతులో యంత్రాలతో నదీ గర్భాన్ని కుళ్లబొడిచిన దాఖలాలు ఎన్నో! తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు అక్రమ తవ్వకాలపై పత్రికల్లో వచ్చినా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేయడం మినహా చర్యలు లేవు. మళ్లీ ఇప్పుడు ఇసుకమేట పేరుతో రైతులు అనుమతులకు దరఖాస్తు చేయటంతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. ఇక అనుమతులు లాంఛనమే ! ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతాయో చూడాల్సి ఉంది. ఈసారైనా అధికారులు నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు జరిగేలా చూస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. 2014 నుంచి 2019 వరకూ ఎంతమందికి పట్టా భూముల్లో తవ్వారన్న విషయం మైనింగ్ అధికారుల వద్ద సమాచారం లేదని చెబుతున్నారు. ఫైల్ కనపడటం లేదని, వెతుకుతున్నామని చెప్పడం గమనార్హం. ప్రభుత్వానికి దరఖాస్తులు మేట తొలగింపు పేరుతో పక్కా స్కెచ్ గతంలోనూ ఇదే రీతిలో కోట్లు కొల్లగొట్టిన పచ్చ నేతలు మళ్లీ అధికారంలోకి వచ్చాక అదే తంతు కృష్ణమ్మ గర్భాన్ని కుళ్లబొడిచి ఇసుక తవ్వకాలు ఇప్పటికే అధికార రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వకాలు, అధిక లోడింగ్ నిలువరించలేక చేతులెత్తేసిన అధికార యంత్రాంగం ఇసుక మేట తొలగింపులోనైనా కనీసం నిబంధనలను పాటిస్తారా ! కొల్లిపర మండలంలో ఇటీవల వరకు మూడు రీచ్‌లు నడిచాయి. ప్రస్తుతం అధికారిక రీచ్‌లు లేవు. అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరు తగ్గింది. దీంతో గతంలో అమలుచేసిన ఇసుకమేట ప్రణాళిక గుర్తుకొచ్చింది. వెంటనే అమల్లోకి తెచ్చేశారు. కొల్లిపర మండలంలోని బొమ్మువానిపాలెం గ్రామ పరిధిలో కృష్ణానదిలో కలిసిపోయిన భూముల్లో ఇసుక మేట తొలగింపునకు అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు వెళ్లాయి. ఆ ప్రకారం 6,932 హెక్టార్లలో అంటే 17.33 ఎకరాల్లో 72,790 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ఈనెల 6న బొమ్మువానిపాలెం వచ్చారు. అక్కడి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. రైతుల భూముల్లో ఇసుకమేట తొలగించుకుంటామంటే ఇతరులు ఎలా అభ్యంతర పెడతారు? సమావేశం సజావుగా జరిగింది. ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉందనుకుంటూ అధికారులు వెళ్లిపోయారు. -
‘ఓడు’పోయిన మట్టి బతుకులు
తెనాలి: గుంటూరు జిల్లాలో పది గ్రామాల్లో 350 పైగా కుటుంబాలు వంశపారంపర్యంగా వస్తున్న మట్టి పాత్రల తయారీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. శలపాడు, గరువుపాలెం, కొలకలూరు, కావూరు, చింతాయపాలెం, మంగళగిరి, శృంగారపురం, తుమ్మలపాలెం, కొండవీడు, కోటప్పకొండ పరిసరాల్లో ఈ కుటుంబాలున్నాయి. పెళ్లిరోజున గరిక పాత్ర నుంచి పేదవాడి ఫ్రిజ్‌లుగా పిలుచుకునే కుండలు, కూజాలు, వంటపాత్రలు, పూలుకుండీలు, ప్రమిదెల సహా రకరకాల అవసరాల కోసం వాడే పాత్రల తయారీలో సిద్ధహస్తులు. ఏడాదిలో వేసవి కాలం మాత్రమే మట్టి పాత్రలకు గిరాకీ ఉంటుందని తెలిసిందే. మనిషి జీవితంలో ప్రవేశించిన ఆధునికత వీరి వృత్తికి కష్టకాలం తీసుకొచ్చి ంది. వేసవిలో అకాల వర్షాలు సంభవిస్తే వారి కష్టమంతా నీటిపాలవుతుంది. అన్నింటినీ భరిస్తూ కొనసాగిస్తున్న వారసత్వ చేతివృత్తిలో కళాత్మకత అబ్బురపరుస్తుంది. దొరకని మట్టి వృత్తికి ప్రధానమైన మట్టి లభ్యత సమస్యగా మారింది. ట్రక్కు రూ.5 వేలు పెట్టినా అనువైనది దొరకడం కష్టంగా ఉంది. వడ్లమూడి క్వారీ ఆపడంతో వీరికి నాణ్యమైన మట్టి కోసం పలుచోట్ల వెతుకులాట తప్పనిసరైంది. టన్ను పుల్లలు రూ.5 వేలు, పొలం పొట్టు రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.20 వేల వ్యయంతో ఏటా సంక్రాంతి తర్వాత జనవరి నెలాఖరులోపు అవసరమైనవి సమకూర్చుకుంటారు. ముందుగా మట్టిని ఎండబెట్టి, నలగ్గొట్టి, గాబులో పోసి వడపోసిన మట్టిని పాత్రల తయారీకి వినియోగిస్తారు. ఈ పనిలో ఇంటావిడ శ్రమిస్తే, మట్టిని అందమైన పాత్రలుగా మలచే పనిని ఇంటాయన చేస్తుంటారు. ఇరుగుపొరుగు సాయంతో ఆము ఏర్పాటు పదిహను, ఇరవై రోజులు మట్టి పాత్రలు చేశాక వాటిని ఎండలో ఆరబెడతారు. తర్వాత ఒకరోజు ఇరుగుపొరుగు సాయంతో ఆము పెట్టుకుంటారు. సాయంత్రం పూట ఏడెనిమిది మంది కలిసి రెండు గంటలసేపు శ్రమిస్తే గాని ఆము తయారుకాదు. పగిలిన కుండలను చుట్టూ పేర్చుకుని, వాటిపైన ఆరబెట్టిన కుండలను భద్రంగా అమర్చుకుంటూ, అయిదారు వరుసలతో అన్నింటినీ సర్దుతారు. పగిలిన కుండపెంకులతో పైన కప్పును రూపుదిద్దుతారు. దిగువన కట్టెపుల్లలు, పొలం పొట్టు, ఊక ఏర్పాటు చేస్తారు. కాల్చిన పిడకలను చుట్టూ ఖాళీల్లో సర్దుతారు. ఆ పిడకలు రగులుకొని, ఊక, పొలం పొట్టుతో సహా కట్టెపుల్లలను మండించి, లోపలున్న మట్టిపాత్రలను ఎర్రగా కాలుస్తాయి. ఉదయాని కల్లా ‘రెడీ టు సేల్’ మట్టి పాత్రల తయారీలో సంప్రదాయ విధానాలకు మృణ్మయ కళాకారులు కూడా ఆధునిక సాంకేతికతను అందుకున్నారు. పాత్రల తయారీ కోసం ముందుగా మట్టిని కలిపి పాకంగా చేయాలి. గతంలో ఇందుకోసం గంటన్నరపాటు కాళ్లతో తొక్కేవారు. ఇప్పుడు పది నిముషాల్లోనే విద్యుత్ మిషను మట్టి పాకాన్ని సిద్ధం చేస్తోంది. మరోవైపు చక్రంలాంటి సారైపె మట్టి ముద్ద తిరుగుతుంటే చేతితో అందమైన రూపంలో కుండను చేస్తారు. మధ్యమధ్యలో కర్రతో సారెను తిప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సారెను కర్రతో తిప్పే విధానానికి స్వస్తి పలికారు. విద్యుత్ మోటారుతో అవసరమైనంతసేపు తిరుగుతూనే వుంటోంది. దీనితో పాత్రల తయారీకి సమయం తగ్గింది. ప్రమిదెల తయారీకి సెరామిక్ బ్లాంకెట్ వాడుతున్నారు. కుండలకు తగ్గిన గిరాకీ ఎంత కళాత్మకంగా మట్టి పాత్రలు చేసినా మార్కెటింగ్‌లో నష్టపోతున్నామనే భావన వీరిలో ఉంది. అదేమంటే వినియోగదారులు ‘మట్టి కుండేగా’ అనేస్తున్నారని వృత్తిదారులు వాపోతున్నారు. మట్టి కుండ తయారీకి సగటున రూ.70–80 ఖర్చయితే, వీరి నుంచి రూ.120 కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో అదే కుండను రూ.250లకు అమ్ముతున్నారు. తయారీదారుకు రూ.50 లోపు మిగిలితే మధ్య వ్యాపారికి రూ.100 పైగా లభిస్తోంది. ఫ్రిజ్‌ల కారణంగా కుండలకు గిరాకీ తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూలింగ్ క్యాన్లు వీరి వృత్తికి చేటు తెస్తున్నాయి. వేసవిలో విస్తృతంగా నడిచే చలివేంద్రాల్లో గతంలో కుండల స్థానంలో ఇప్పుడు కూలింగ్ వాటర్ క్యాన్లు వెలుస్తున్నాయి. ఈ క్యాన్ల నీటికన్నా కుండల నీరే శ్రేష్టమని తెలిసినా, అవే వాడుతున్నారు. కడుపు నింపని చేతివృత్తి మృణ్మయ కళాకారుల జీవితం.. శ్రమకు దక్కని ఫలం మట్టికుండల చల్లదనం వెనుక శ్రామికుల స్వేదం కష్టాలను భరిస్తూ సంప్రదాయ చేతివృత్తిని కొనసాగిస్తున్న శాలివాహనులు మట్టి పరిమళం వారికి జీవనశ్వాస...మట్టితో ముడిపడిన జీవితాలవి...తోటి మనుషులను నమ్మినా లేకున్నా మట్టిని ప్రేమిస్తారు. చేతివృత్తుల్లో ఒకటైన మట్టి పాత్రల తయారీలో ‘కులవృత్తికి సాటిరాదు గువ్వలచెన్నా’ అనుకుంటూ మమేకమైన దృశ్యం అక్కడ గోచరిస్తుంది. ఇంటిల్లిపాదికీ అది నిత్యం శ్రమైక జీవన సమరమే. వారు చిందించే స్వేదం నుంచే మట్టి కుండ రూపుదిద్దుకుని, అందులోని నీటి చల్లదనం దాహార్తులను సేదదీరుస్తుంది. మట్టికి అందమైన ఆకృతినివ్వగల ఆ మృణ్మయ కళాకారులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. -
కులరహిత సమాజమే సర్వ శ్రేయోదాయకం
గుంటూరు ఎడ్యుకేషన్: కులరహిత సమాజమే సర్వ శ్రేయోదాయకమని ప్రజాకవి జయరాజ్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ కుల రహిత సమాజం (ఏసీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం బ్రాడీపేటలోని లూథరన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూలు ఆవరణలో ‘భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి.. అమలు తీరు’, ‘బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు‘, ‘భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు‘ (17 సంపుటాలు) అంశాలపై ఓఎంఆర్ షీట్స్ ద్వారా వెయ్యి మంది పైగా విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తొలుత గౌతమ బుద్ధుడు, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసిన అనంతరం ఏఎన్‌యూలో విద్యనభ్యసిస్తున్న మయన్మార్ బౌద్ధ భిక్షువులు ప్రార్థన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కవి జయరాజ్ మాట్లాడుతూ 500 ఏళ్ల కిందట దేశంలో నెలకొన్న సామాజిక అసమానతలు, కుల వివక్షతపై గౌతమ బుద్ధుడు తన బోధనలతో తిరుగుబాటు చేశారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనల ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు, యువతరం నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బుద్ధిస్ట్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ ముందస్తు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆయన జీవితం, నైతికత, ఆలోచన, బోధనలు తూచా తప్పక ఆచరించిన జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యువతరానికి ఆదర్శమన్నారు. బౌద్ధ విజ్ఞానం విశ్వజననీయమైనదని, అష్టాంగ మార్గం ద్వారా మానవుడు ఎలా జీవించాలో బోధించారని తెలిపారు. డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ బౌద్ధం నిజమైన తార్కిక ధోరణి అయితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం భారత జాతి ఆత్మ, గుండె చప్పుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీపీ మండల్ మహాసేన ప్రతినిధి డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఏ.గవర్రాజు, కేకే బోధి, డి.రత్న ప్రదీప్, దేవరకొండ వెంకటేశ్వర్లు, అబ్రహం లింకన్, విశ్రాంత డీఎస్పీ పి.రవికుమార్, ఏసీఎఫ్ రాష్ట్ర మహిళా కన్వీనర్ రజిని, అల్లాడి దేవకుమార్, జి.ఆర్. భగత్ సింగ్, హేబేలు, నీలాంబరం, పి.వెంకటేశ్వర్లు, పలువురు బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, బహుజన మేధావులు పాల్గొన్నారు. ప్రజాకవి జయరాజ్ -
నృసింహునికి లక్ష పుష్పార్చన
మంగళగిరి టౌన్ : స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆలయ ముఖ మండపంపై నరసింహస్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన భక్తుల సమక్షంలో కనులవిందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గులాబి, చేమంతి, బంతి, మల్లెలు, తులసీ దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణ నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. -
రేపు పల్నాడు జిల్లా రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపికలు
అచ్చంపేట(క్రోసూరు): పల్నాడు జిల్లాస్థాయి రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపికలు సోమవారం అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరుగుతాయని జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుడిపూడి భూషణం శనివారం తెలిపారు. ఎంపికల గురించి వివరిస్తూ .. అండన్–17 విభాగంలో బాలుర, బాలికల ఎంపికలు జరుగుతాయని వారు 2008, 2009, 2010 సంవత్సరాలలో పుట్టిన వారై ఉండాలన్నారు. 2010లో పుట్టినవారు మెడికల్ సర్టిఫికెట్, పేరంటల్ సర్టిఫికెట్ సమర్పించాలన్నారు. అండర్–23 విభాగంలో పురుషులు, సీ్త్రల ఎంపిక జరుగుతుందన్నారు. వీరు 2002 నుంచి 2006 సంవత్సరాలలో పుట్టి ఉండాలన్నారు. 2006లో పుట్టినవారు మెడికల్ సర్టిఫికెట్, పేరంటల్స్ సర్టిఫికెట్ అందజేయాలని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనదలచినవారు ఈనెల 12 ఉదయం 10 గంటలకు గురుకుల కళాశాలలో ఆధార్ జిరాక్స్ కాపీ, ఒరిజనల్ కార్డు, మెడికల్, పేరంటల్ సర్టిఫికెట్లు తీసుకొని రావాలన్నారు. ఎంపికైన వారు ఈనెల 16,17,18 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాలని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణకే పల్లెనిద్రరేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావురేపల్లె: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలతో మమేకమై పనిచేసేందుకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు చెప్పారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి పట్టణంలోని 18వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వార్డులో ఎటువంటి సమస్యలు తలెత్తినా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. వివాదాస్పద సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వార్డులో అనుమానాస్పద స్థితిలో ఎవరైనా కొత్త వ్యక్తుల సంచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకుంటే తప్పనిసరిగా పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పోక్సో కేసుల వివరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.పిడుగుపాటుకు 11 జీవాలు మృతిబొల్లాపల్లి: పిడుగుపాటుకు గురై గొర్రెలు, మేకలు మృతిచెందిన సంఘటన మండలంలోని గుమ్మనంపాడు గ్రామ పొలాల్లో శనివారం జరిగింది. గ్రామానికి ఆళ్లగండి చెరువు వీరనాయకులు గుడి వద్ద ఈదురుగాలులతో కూడిన వర్షంలో పిడుగు పడటంతో గొర్రెలు, మేకలు 11 మృత్యువాతకు గురయ్యాయి. గ్రామానికి చెందిన గోపీనాయక్, కె.నాగయ్యలతో పాటు మరికొందరు రైతులకు చెందిన 11 జీవాలు మృతిచెందాయి. వీటివిలువ సుమారు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితులు చెప్పారు. ఘటనా ప్రాంతాన్ని గుమ్మనంపాడు పశువైద్యుడు బి.సాల్మన్సింగ్ పరిశీలించారు. -
నాయక్.. నీ త్యాగం మరువలేనిది !
లక్ష్మీపురం: పాకిస్థాన్‌తో పోరాడే క్రమంలో తెలుగు బిడ్డ ముళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని, ఆ వీర సైనికుని త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరచిపోదని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, విద్యావేత్త ఆర్.వి సింగరయ్య పేర్కొన్నారు. స్థానిక అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో వీర జవాన్ మురళీ నాయక్‌కు శనివారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల వయస్సులో మాతృభూమి కోసం ప్రాణాలర్పించి అమరుడైన మురళీ నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని కొనియాడారు. మురళీ నాయక్ చూపిన ధైర్యసాహసాలు రాష్ట్రానికి గర్వకారణమని, యువ జవాన్ పేరు చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఇంజినీర్ ఎన్.సదాశివం, అవగాహన సంస్థ సాంస్కృతిక కార్యక్రమాల కో–ఆర్డినేటర్ బిళ్లా అశోక్, సంస్థ సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జిని కలిసిన ఉద్యోగుల సంఘం నేతలు
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా పోర్టుఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్యను న్యాయశాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర, గుంటూరు నగర సంఘ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా కోర్టులో శనివారం జరిగిన జ్యుడీషియల్ ఆఫీసర్స్ వర్క్‌షాప్‌నకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య హాజరయ్యారు. న్యాయమూర్తిని కలసిన వారిలో న్యాయశాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చంద్రశేఖర్, నగర అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాసరావు, కార్యదర్శి సొర్రా బైరాగి, సంఘ సభ్యులు ఉన్నారు.మల్లేశ్వరస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తిపెదకాకాని: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు దంపతులు శనివారం పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరసామి ఆలయానికి విచ్చేశారు. న్యాయమూర్తి దంపతులకు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, అర్చక స్వాములు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ మేళతాళాలతో సాదర స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన వారు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకస్వాములు, వేద పండితులు ఆశీర్వవచనం అందించారు. న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులను స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటం, ప్రసాదాలను డీసీ అందజేశారు.నేడు రెడ్ల రామమందిరం పునఃనిర్మాణానికి శంకుస్థాపనతాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న రెడ్ల రామమందిరం పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8.20 గంటలకు జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.అంగన్వాడీ కేంద్రంలో మదర్స్‌డే వేడుకలుగుంటూరు రూరల్: తల్లి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీఎస్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం మదర్స్‌డే వేడుకలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తల్లులు ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి తల్లి, గర్భిణి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా విని యోగించుకుని ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వాలన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి పంచారు. కార్యక్రమంలో మోడల్ ఆఫీసర్ శ్రీవాణి, ప్రత్తిపాడు ప్రాజెక్ట్ సీడీపీవో విజయ నిర్మల, సూపర్వైజర్ వెంకటరత్నం, ఏఎన్ఎమ్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు గర్భిణులు పాల్గొన్నారు.రేపు త్రికోటేశ్వరస్వామికి లక్ష మల్లెల పూజనరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామికి ఈనెల 12వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించే లక్షమల్లెల పూజకు వేలాదిగా భక్తులు హాజరై స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.చంద్రశేఖరరావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. దాతల సహకారంతో ప్రతి ఏడాది వైశాఖ పూర్ణమి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
సు‘భద్ర’ డబ్బులు కట్టించారు
పట్నంబజారు: ‘‘గత ఏడాది ఏం జరిగిందో నా తెలియదు.. దేవస్థానాల్లో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు వ్యవహరిస్తే.. నేను చూస్తూ ఊరుకోను.. కచ్చితంగా ప్రతి స్వామి వారి కార్యక్రమానికి డబ్బులు చెల్లించి రశీదు తీసుకోవాల్సిందే ’’ అంటూ గుంటూరు నగరంలోని లాలాపేటలో గల గ్రూప్ ఆలయాల అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) టి. సుభద్ర తేల్చి చెప్పారు. లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి నాజ్ సెంటర్లోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ అర్చకులు, సిబ్బంది, హనుమాన్ దీక్షా సమాజం సభ్యులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న అవకతవకలు, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆలయంలో హోమాలు, అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ.. ఆలయ ఆదాయానికి గండి పడేలా కొంత మంది వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి ఏడాది హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలు, పూజలకు డబ్బులు చెల్లించకుండా వ్యవహరిస్తే.. చూస్తూ ఊరుకోబోమని వారికి సైతం ఘాటుగానే వివరించారనే తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు లేనివిధంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఐదు రోజు కార్యక్రమాల్లో భాగంగా పట్టాభిషేకం, కల్యాణ కార్యక్రమాల్లో కూర్చునే కొంత మంది దాతల్లో ఒక ముఖ్య దాత రూ. 50,116 తొలిసారిగా చెల్లించి రశీదు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందే చెప్పిన ‘‘సాక్షి’’... నాజ్ సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ఎటువంటి రశీదులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని కొద్ది రోజుల కిందట సాక్షి పలు కథనాలు ప్రచురించింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ప్రతి అంశాన్ని కూలకషంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇప్పటీ దాకా జరిగింది నాకు తెలియదు.. ఇకపై ఏ కార్యక్రమమైనా రశీదు పొందాల్సిందే : ఏసీ నాజ్ సెంటర్ ఆంజనేయస్వామి దేవస్థాన వ్యవహారంపై అంతర్గత సమావేశం -
సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోండి
రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి అర్బన్: పేదల ఇళ్ల నిర్మాణాల్లో చేతివాటం ప్రదర్శించిన తెనాలి 28వ వార్డు సచివాలయ ఎమినిటీ సెక్రటరీ నవీన్‌పై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డీఎస్పీ జనార్దనరావును ఆదేశించారు. సాక్షి దినపత్రికలో శనివారం ‘గృహ యోగంలో అవినీతి పర్వం’ శీర్షికన కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి డీఎస్పీ జనార్దనరావును, డీఈ రఫీని మున్సిపల్ కార్యాలయానికి పిలిపిచ్చారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పందించారు. విచారణ జరిపి నివేదిక అందజేయాలని గృహ నిర్మాణశాఖ పీడీ ప్రసాద్‌ను ఆదేశించారు. బాధితులను పిలిపించి స్టేట్మెంట్లో రికార్డు చేయాలని ఈఈ భాస్కర్‌ను ఆదేశించారు. ఆయన శనివారం సాయంత్రం బాధితులను తెనాలిలోని గృహా నిర్మాణశాఖ కార్యాలయానికి పిలిపించి స్టేట్మెంట్లు రికార్డు చేయించారు. వీటిని పీడీకి అందజేయనున్నట్లు ఈఈ భాస్కర్ సాక్షికి తెలిపారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కూడా 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఇమ్యూనిటీ సెక్రటరీ నవీన్‌కు ఆదేశాలు జరిచేశారు. ఇవ్వని పక్షంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు విధుల నుంచి తప్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. -
సైనికుల సహాయనిధికి రూ.5 లక్షల విరాళం
బాపట్లటౌన్: ర భారత సైనికుల సహాయనిధికి చీరాల పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ రూ.5 లక్షల చెక్కును శనివారం ఎస్పీ తుషార్ డూడీకి అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ భారత సైనికులు దేశ భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారన్నారు. వారిని గౌరవించడమే కాదు, ఇటువంటి విపత్కర సమయాల్లో సాయంగా నిలవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. బాపట్ల జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ చూపిన ఉదారత అభినందనీయమన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ దేశానికి సేవ చేయాలనే తపన వారి చర్యలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇలాంటి విరాళాలు అందించేవారు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారని కొనియాడారు. బాపట్ల ఎస్పీకి చెక్కు అందజేసిన చీరాలకు చెందిన ఎన్ఆర్ఐ -
గుంటూరు
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025బ్రహ్మంగారి తిరునాళ్ల రెంటచింతల: పశర్లపాడు గ్రామంలో శనివారం బ్రహ్మంగారి తిరునాళ్ల వేడుకలను వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావన్నారాయణ స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 513.40 అడుగుల వద్ద ఉంది. ఇది 137.5158 టీఎంసీలకు సమానం. 9