
సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోండి
రాష్ట్ర పౌర సరఫరాలశాఖ
మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి అర్బన్: పేదల ఇళ్ల నిర్మాణాల్లో చేతివాటం ప్రదర్శించిన తెనాలి 28వ వార్డు సచివాలయ ఎమినిటీ సెక్రటరీ నవీన్‌పై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డీఎస్పీ జనార్దనరావును ఆదేశించారు. సాక్షి దినపత్రికలో శనివారం ‘గృహ యోగంలో అవినీతి పర్వం’ శీర్షికన కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి డీఎస్పీ జనార్దనరావును, డీఈ రఫీని మున్సిపల్ కార్యాలయానికి పిలిపిచ్చారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పందించారు. విచారణ జరిపి నివేదిక అందజేయాలని గృహ నిర్మాణశాఖ పీడీ ప్రసాద్‌ను ఆదేశించారు. బాధితులను పిలిపించి స్టేట్‌మెంట్‌లో రికార్డు చేయాలని ఈఈ భాస్కర్‌ను ఆదేశించారు. ఆయన శనివారం సాయంత్రం బాధితులను తెనాలిలోని గృహా నిర్మాణశాఖ కార్యాలయానికి పిలిపించి స్టేట్‌మెంట్లు రికార్డు చేయించారు. వీటిని పీడీకి అందజేయనున్నట్లు ఈఈ భాస్కర్ సాక్షికి తెలిపారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కూడా 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఇమ్యూనిటీ సెక్రటరీ నవీన్‌కు ఆదేశాలు జరిచేశారు. ఇవ్వని పక్షంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు విధుల నుంచి తప్పించనున్నట్లు ఆయన ప్రకటించారు.

సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోండి