హరికృష్ణకు పోలీసుల వేధింపులపై వైఎస్ జగన్ ఫైర్ | YS Jagan criticizes the coalition government for harassing YSRCP sympathizers | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై వైఎస్ జగన్ ఫైర్

May 23 2025 7:52 PM | Updated on May 23 2025 8:48 PM

YS Jagan criticizes the coalition government for harassing YSRCP sympathizers

సాక్షి,తాడేపల్లి : హరికృష్ణకు పోలీసుల వేధింపులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబు సర్కారును ఎక్స్‌ వేదికగా ఎండగట్టారు.

‘పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్ప‌డ‌డం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు?’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా?.స్వయంగా టీడీపీ నేత కారులో   హరికృష్ణను తరలించి, స్టేషన్‌లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్‌లో దాచిపెడతారా? 

హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు?. ఎవరి ఆదేశాలతో,ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు?. ఇది రాజ్య హింస కాదా?. ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది?. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా?. చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా?. 

చంద్రబాబు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంతమాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని వైఎస్‌ జగన్‌ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement