
ఏ క్షణం కావాలన్నా ఎంతైనా రెడీ...
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో అర్ధరాత్రి దాటాక 2.39 గంటలకు కూడా మద్యం విక్రయిస్తున్నారు. ప్రధాన షట్టర్‌కు చిన్న షట్టర్ అమర్చి అమ్మకాలు చేస్తున్నారు. పక్కనే మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో అర్ధరాత్రి దాటాక 2.53 గంటలకు కూడా పక్కన ఉన్న సన్న సందులో నుంచి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. ఈ బార్‌కు పక్కనే ఉండే మరొక బార్‌లో ఏకంగా ఒక వాచ్‌మెన్‌ను పెట్టి 3.05 గంటలకు కూడా విక్రయాలు జరుపుతున్నారు. వీటికి కొద్దిగా దూరంలో ఓల్డ్‌క్లబ్ రోడ్డు మూలన ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో అసలు టైంతో పనే లేదు. ఎప్పుడు కావాలన్నా మందుబాబులకు సొంత ఇంటికి వచ్చి వెళ్లినట్టే ఉంది పరిస్థితి.
పట్నంబజారు: అర్ధరాత్రి సమయాల్లో సైతం షట్టర్ కొడితే చాలు తలుపులు నిస్సంకోచంగా తెరుచుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. బహిరంగ మద్యపానం విచ్చలవిడిగా సాగుతున్నా... అనధికారిక పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు అవుతున్నా.. పట్టించుకునే నాథుడు కాదు కదా.. కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గుంటూరు నగరంలోని ఈస్ట్, వెస్ట్ పరిధిలో మొత్తం 37 వైన్స్ దుకాణాలు, 64 బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. అన్నిచోట్లా కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం విక్రయాలు 24/7గా మారాయి.
మద్యం మత్తులో గొడవలు
అరండల్‌పేట ఒకటో లైనులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కూడా మందుబాబులకు 24 గంటలూ సేవలను అందిస్తున్నారు. వెస్ట్ పరిధిలోని జేకేసీ కళాశాల రోడ్డులో ఉన్న పెద్ద బార్ అండ్ రెస్టారెంట్‌లు కస్టమర్‌లను బార్ వెనుక గార్డెన్‌లో కూర్చొబెట్టి మరీ తాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మణిపురం ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న బార్‌లో సైతం నిత్యం మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటితోపాటు ఈ ప్రాంతంలో అనేక వివాదాలు చెలరేగి అర్ధరాత్రి పూట దాడులు చేసుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. నందివెలుగు రోడ్డులోని ఉన్న రెండు బార్‌ల పరిస్థితి ఇక చెప్పాల్సిన పనే లేదు. మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లు.. అనే చందంగా సాగుతున్నాయి. వైన్స్ దుకాణాలలో కంటే బార్‌లలో క్వార్టర్‌కు రూ.60 అధికంగా తీసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయాల్లో రూ.100కుపైగానే అధికంగా తీసుకుంటున్నారు. ఇలా అందినకాడికి దండుకుంటున్నారు.
నిర్లక్ష్యంగా అధికారులు
అర్ధరాత్రి వేళ బార్‌లు, వైన్స్‌ల్లో మద్యం అమ్మకాలు బహిరంగ రహస్యమే అన్నట్లు పరిస్థితి మారింది. ఈ విషయం పోలీసు, ఎకై ్సజ్ అధికారులకు తెలిసినప్పటికీ తమకేమీ పట్టని చందంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మద్యం షాపులకు సంబంధించి కొంత మంది కూటమి నేతలు సిండికేట్‌గా ఏర్పడి వైన్స్ దుకాణాల వారి నుంచి రూ.12 వేలు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల వద్ద నుంచి రూ.15 వేలు చొప్పున వసూలు చేసి ఆయా పోలీసుస్టేషన్ అధికారులు, ఎకై ్సజ్ సిబ్బందికి నెలవారీగా యారక్ అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల్లో ఆయా స్టేషన్‌ల మఫ్టీ పార్టీ కానిస్టేబుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ వైన్స్‌లో కొత్తగా అనధికారిక పర్మిట్ రూమ్‌కు రిబ్బన్ కట్ చేశారు. కొద్ది కాలం క్రితం వరకు పక్కనే ఉన్న బడ్డీకొట్లలో యథేచ్ఛగా తాగేవారు. ఇప్పుడు బహిరంగ మద్యపానం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నేరుగా గోడ పగులకొట్టి మరీ పర్మిట్ రూమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ పక్కనే ఆంధ్రా ముస్లిం కళాశాల ఉంది. అదే క్రమంలో బైపాస్ పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ మేరీస్, పలు కళాశాలల విద్యార్థినులు ఇటుగానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ వైన్స్ నిర్వాహకులు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌కు తెరలను అడ్డుకట్టి మరీ తాగించేస్తున్నారు. పట్టపగలు మధ్యాహ్నం 2.34 గంటల సమయంలో సైతం మందుబాబులు ఇక్కడి రోడ్డుపై దర్జాగా తాగేస్తున్నారు. దీంతోపాటు వైన్స్ వెనుక భాగంలో, వైన్స్ ఉన్న డాబా పైభాగంలో అడ్డూ అదుపు లేకుండా పర్మిట్ రూములు పెట్టారు. ఇక నందివెలుగు రోడ్డులో అనేక వివాదాల మధ్యన ఏర్పాటు చేసిన వైన్స్ నిర్వాహకులు కూడా పర్మిట్ రూమ్ ఓపెన్ చేశారని, మద్యం అడ్డగోలుగా విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ లోపల అనుమతి లేని పర్మిట్ రూమ్
ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో క్వార్టర్ మద్యానికి ఫోన్‌పేలో పంపిన నగదు రశీదు
బహిరంగ మద్యపానంపై చర్యలు
బహిరంగ మద్యపానం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డ్రోన్‌లు, పోలీసు అధికారులు, సిబ్బంది ద్వారా చర్యలు చేపడుతున్నాం. బహిరంగంగా మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయటంతోపాటు కోర్టుకు హాజరు పరుస్తున్నాం. పూర్తి స్థాయిలో కట్టడిపై దృష్టి సారిస్తాం. – షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ, ఈస్ట్ డివిజన్
న్యూస్‌రీల్
కూటమి ‘మత్తు’కు చిత్తు
24/7 మద్యం అమ్మకాలు కాసుల కక్కుర్తిలో పాలకులు వంత పాడుతున్న అధికారులు
గోడలు పగులగొట్టి...
సమయపాలన పాటించేలా చూస్తాం
బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ దుకాణాలు సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడపాలి. లేకుంటే తనిఖీలు నిర్వహించి, తగిన చర్యలు చేపడతాం.
– అరుణకుమారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్

ఏ క్షణం కావాలన్నా ఎంతైనా రెడీ...

ఏ క్షణం కావాలన్నా ఎంతైనా రెడీ...

ఏ క్షణం కావాలన్నా ఎంతైనా రెడీ...

ఏ క్షణం కావాలన్నా ఎంతైనా రెడీ...