
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025లో భాగంగా ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 కేంద్రాల పరిధిలో ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ)లకు దరఖాస్తు చేసిన 6,845 మంది విద్యార్థుల్లో 6,603 మంది హాజరయ్యారు. గుంటూరు జిల్లా పరిధిలోని 15 కేంద్రాల్లో 4,317 మందికిగాను 4,144, బాపట్ల జిల్లాలోని రెండు కేంద్రాల్లో 684 మందికిగాను 662, పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో 1,844 మందికిగాను 1,797 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తనిఖీ చేసి లోనికి అనుమతించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,603 మంది హాజరు