
ఉద్యోగాల పేరిట మోసం
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో మోసగించారని కొందరు, కంపెనీలో వచ్చే లాభాల్లో పర్సంటేజీలు ఇస్తామని మోసగించారని ఓ మహిళ వాపోయింది. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు– పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. బాధితుల ఫిర్యాదులను జిల్లా ఏఎస్పీలు (పరిపాలన) రమణమూర్తి, కె.సుప్రజ (క్రైం) స్వీకరించారు. వారి మొరను అలకించారు. ఫిర్యాదిదారులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు స్వీకరించిన వారిలో డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), శివాజీరాజు (సీసీఎస్), శ్రీనివాసరెడ్డి (మహిళ పీఎస్) ఉన్నారు.
బాధితుల గగ్గోలు
న్యాయం చేయాలని పీజీఆర్‌ఎస్‌లో మొర