
పవర్ లిఫ్టింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మంగళగిరి: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు జరిగే పవర్ లిఫ్టింగ్ నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ క్లాసిక్ మెన్, ఉమెన్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ టీమ్‌ను ఎంపిక చేసినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. పట్టణంలోని కార్యాలయంలో శనివారం వివరాలను వెల్లడించారు.ఉమెన్ సబ్ జూనియర్ టీమ్ 76 కేజీల విభాగంలో బి. లాలిత్య, 84 కేజీల విభాగంలో ఈ.ఎల్. వినయశ్రీ , జూనియర్ టీమ్ 47 కేజీల విభాగంలో ఎం. షానూన్, 76 కేజీల విభాగంలో ఎల్. చాతుర్య, 84 కేజీల విభాగంలో ఎన్. జ్ఞాన దివ్యలను ఎంపిక చేసినట్లు తెలిపారు. పురుషుల సబ్ జూనియర్ 53 కేజీల విభాగంలో టి. శివకార్తిక్, 83 కేజీల విభాగంలో ఎస్. మునీశ్వర్ రామ్, జూనియర్ 93 కేజీల విభాగంలో ఎస్. కౌశిక్, 105 కేజీల విభాగంలో డి. పృథ్వీకుమార్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న పవర్ లిఫ్టర్లను రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు తెలిపారు.