
ఇవిగో ఇటీవల దుర్ఘటనలు...
పట్నంబజారు : మద్యం విక్రయాలతో ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో గుంటూరు జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 2024 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జరిగిన విక్రయాలే దీనికి సాక్ష్యం. కేవలం ఏడు నెలల కాలంలో జిల్లాలో 9.75 లక్షల లీటర్ల మద్యం విక్రయించారు. 8.87 లీటర్ల బీర్ కూడా అమ్మారు. ఈ ఎండాకాలం ప్రారంభం నుంచి అధికంగా బీర్‌ల విక్రయాలు జరిగినట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తమ్మీద రూ.9.10 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.
కేసులు పెడుతున్నా....
పండుగలు, ఉత్సవాలు, శుభకార్యాల పేరుతో మందుబాబులు తెగ తాగేస్తున్నారు. పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులే అత్యధికంగా పట్టుబడుతుండటం గమనార్హం. 40 – 55 ఏళ్ల వారు తర్వాత స్థానంలో ఉన్నారు. మైనర్‌లు కూడా మద్యం మత్తులో పట్టుబడటం మరింత ఆందోళన కలిగించే అంశం.
చిక్కుతూనే ఉన్నారు..
గుంటూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ల్లో గత మూడేళ్లలో 2,137 కేసులు నమోదు అయ్యాయి. 2023లో 1,004, తర్వాతి ఏడాదిలో 813, ఈ సంవత్సరం ఇప్పటివరకు 318 కేసులు నమోదు అయ్యాయి. బ్రీత్ ఎన్‌లైజర్‌లతో దొరుకుతున్న యువత సైతం వంద శాతానికిపైగా మద్యం తాగి పట్టుబడుతున్నట్లు తేలడం గమనార్హం. ఇలా ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.
శిక్ష తప్పదు
మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. మొదటి సారి చిక్కితే రూ.10 వేల వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష పడొచ్చు. రెండో సారి అదే తప్పు చేస్తే రూ.15 వేల వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. మద్యం తాగి ప్రమాదానికి కారకులై ఎవరికై నా ఐదేళ్ల వరకు తప్పనిసరి జైలు శిక్ష పడొచ్చు.
● మద్యం మత్తులో కొత్తపేట భగత్‌సింగ్ బొమ్మ సెంటర్ వద్ద యువకుడు కారు నడుపుతూ అనేక మందిని ఢీకొట్టాడు. పలువురిని తీవ్ర గాయాలపాలు చేశాడు.
● గుంటూరు నగరంలోని కోబాల్డుపేటలో ముగ్గురు మద్యం మత్తులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు. వారు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు.
● ఏటూకూరు రోడ్డులో సైతం మద్యం మత్తులో యువకులు బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో వారిద్దరితోపాటు మరో వాహనదారుడు కూడా మృతి చెందాడు.
● గుంటూరు ఈస్ట్ పరిధిలో ఒక మైనర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడ్డాడు. కనీసం అతనికి ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా తాగేశాడు. 183 శాతం.. అంటే భారీగా తాగినట్లు బ్రీత్ ఎన్‌లైజర్ మిషన్ ద్వారా తేలింది.
నిబంధనలు మీరితే కఠిన చర్యలు
జిల్లాలో పెరిగిపోతున్నడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మద్యం మత్తులో ప్రమాదాల్లో పలువురు మృత్యువాత ఇతరుల ప్రాణాలనూ బలిగొంటున్న మందుబాబులు ఆదాయంపైనే దృష్టి పెట్టడంతో ఏరులై పారుతున్న మద్యం
ఇటీవల జరిగిన ఈ ఘటనలన్నీ ఉదాహరణలు మాత్రమే. నిత్యం జిల్లాలో రోజూ మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే ప్రమాదాలకు గురికావటంతోపాటు, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉంది. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి మరణానికై నా ప్రమాదం రూపంలో కారణమైన వ్యక్తికి జైలు శిక్ష కూడా పడుతుంది. అదనపు కఠిన శిక్షలు కూడా విధించేలా చట్టాన్ని మార్చారు.
– ఎం. రమేష్, ట్రాఫిక్ డీఎస్పీ, గుంటూరు

ఇవిగో ఇటీవల దుర్ఘటనలు...