పవర్‌ లిఫ్టింగ్‌లో షబీనాకు 4 స్వర్ణాలు | - | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌లో షబీనాకు 4 స్వర్ణాలు

May 12 2025 12:57 AM | Updated on May 13 2025 5:24 PM

మంగళగిరి: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరుగుతున్న ఏషియన్‌ జూనియర్‌ ఎక్యూప్డ్‌ ఉమెన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌లో దేశం తరఫున పాల్గొన్న షేక్‌ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్‌ సంధానిలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్‌ 190 కేజీలు, బెంచ్‌ ప్రెస్‌ 85 కేజీలు, డెడ్‌ లిఫ్ట్‌ 180 కేజీలు, ఓవరాల్‌ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్‌ లిఫ్టింగ్‌ కోచ్‌ షేక్‌ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన షబీనాను రాష్ట్ర, జిల్లా అసోషియేషన్‌ ప్రతినిధులు అభినందించారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు

పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం పంచామృత స్నపన, తిరుమంజనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భావనారాయణ స్వామి అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. గజ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం

తాడేపల్లి రూరల్‌: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనంలో ఉదయం 9 గంటలకు సర్వగ్రహ దోష నివారణ, దృష్టి దోష నివారణ కోసం లక్ష్మీ నారసింహస్వామి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించామని, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్వామి వారి కల్యాణం, మల్లె పుష్పార్చన ఉత్సవాలు నిర్వహించామని అనంతరం తీర్ధ ప్రసాద గోష్టి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

ద్వారకాతిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో వీకే శీనానాయక్‌ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల వెళ్లిన దుర్గగుడి ఈవో శీనానాయక్‌ దంపతులను ఆ దేవస్థాన ఈవో ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులు, దుర్గగుడి ప్రధానఅర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్‌, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు.

పవర్‌ లిఫ్టింగ్‌లో షబీనాకు 4 స్వర్ణాలు 1
1/1

పవర్‌ లిఫ్టింగ్‌లో షబీనాకు 4 స్వర్ణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement