
పోటీల్లో షానూన్ పతకాల పంట
డెహ్రాడూన్‌లో జరిగిన ఆసియన్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో తెనాలికి చెందిన మరో యువతి మదిర షానూన్ రాణించింది. జూనియర్స్‌లో 47 కిలోల కేటగిరీలో తలపడిన తొలి అంతర్జాతీయ పోటీల్లోనే రజత పతకం, మూడు కాంస్య పతకాలను సాధించింది. స్క్వాట్‌లో 100 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 42.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 110 కిలోల బరువులనెత్తిన షానూన్ డెడ్‌లిఫ్ట్‌లో రజతం, స్క్వాట్, బెంచ్‌ప్రెస్, ఓవరాల్ ప్రదర్శనలో మూడు కాంస్య పతకాలను అందుకుంది. ఆసియన్ యూనివర్సిటీ కప్–2025లో పాల్గొన్న షానూన్ తన అద్భుత ప్రదర్శనతో నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. రెండు ఈవెంట్లలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలను గెలుచుకుంది.