
పన్నెండు గంటల నిర్విరామ నృత్య ప్రదర్శన
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక మార్కెట్ కూడలిలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విజయమాధవి సేవ సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయమాధవికిశోర్ ఆధ్వర్యంలో జరగ్గా, 12 గంటలపాటు రత్నాచార్యులు, నృత్య కళాకారులు చేపట్టిన నృత్యాలు అలరించాయి. అనేక మంది కళాకారులు, వారి శిష్యుల అద్భుత నృత్య ప్రదర్శనలు చక్కటి హావ భావాలతో ప్రదర్శించారు. అనంతరం నాట్యాచార్యులను, కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో సినీ నటులు రాగిణి, నాగమణి, టి.రజినీరెడ్డి, సీనియర్ గుండె వైద్యులు రామారావు, హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసమూర్తి ప్రసంగించారు.