
తెలుగు పలుకుబడులకు చిరునామా చేరెడ్డి
అద్దంకి: తెలుగు పలుకుబడులు, పదబంధాల విన్యాసం చేరెడ్డి మస్తాన్‌రెడ్డి కవిత్వంలో కనిపిస్తాయమని సాహిత్యవేత్త గాడేపల్లి దివాకరదత్తు అన్నారు. సాహితీ కౌముది ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డికి పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన పుట్టంరాజు కళాక్షేత్రంలో 2025 సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సభకు గాడేపల్లి దివాకరదత్తు అధ్యక్షత వహించారు. దేవపాలన మాట్లాడుతూ చేరెడ్డి రచనలు ప్రాచీన కావ్యాలను తలపిస్తుంటాయని అభినందించారు. పోలూరి వెంకట శివరామ ప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ పద్య సాహిత్యానికి చేరెడ్డి గౌరవాన్ని చేకూర్చారని చెప్పారు. పద్య కవులను ప్రోత్సహించడంలో చేరెడ్డి పాత్ర గొప్పదని వివరించారు. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి ‘మహాభారతం.. కవిత్రయ శైలి’ అనేది గొప్ప పరిశోధన అని శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అనంతరం చేరెడ్డి మస్తాన్‌రెడ్డికి సాహిత్య పురాస్కారాన్ని ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.5వేలు, పట్టుబట్టలు, సన్మాన పత్రం, జ్ఞాపకను అందజేశారు. కార్యక్రమంలో వారణాశి రఘురామశర్మ, చుండూరి మురళీ సుధాకర్‌రావు, కడియం పాపారావు, కె. సుబ్బారావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, కొండకావూరి కుమార్, ఆర్. రాజశేఖర్, కూరపాటి రామకోటేశ్వరరావు, సాహిత్యవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.
పుట్టంరాజు సాహిత్య పురస్కారం అందజేత