
ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు
గుంటూరు లీగల్: ఈనెల 19 నుంచి జులై 5 వరకు జరగనున్న లోక్ అదాలత్‌లో మోటార్ వెహికల్ ప్రమాదాల కేసులు ఎక్కువ సంఖ్యలో పరిష్కరించడానికి కృషి చేయాలని నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్‌బాబు చెప్పారు. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ప్రతినిధులు, న్యాయవాదులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. మోటార్ వెహికల్ ప్రమాదాల కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. కంపెనీ మెంబర్స్, కౌన్సెల్స్ పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. సమస్యలుంటే పిటిషనర్‌ను, అతడి కౌన్సెల్‌ను కూడా పిలిపించి ప్రీ సిట్టింగ్ ద్వారా కేసును రాజీ చేయాలని ఆయన సూచించారు. రెండో అదనపు జిల్లా జడ్జి వై. నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై.సూర్యనారాయణ, ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్‌కు పలు సలహాలు, సూచనలు చేశారు. సమావేశంలో బార్ కౌన్సెల్ సభ్యుడు వి.బ్రహ్మారెడ్డి, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్, నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్ పాల్గొన్నారు.
నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ బాబు