
ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో స్పోర్ట్స్ కోటా అడ్మిషన్లు
మంగళగిరి: నీరుకొండ గ్రామంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో స్పోర్ట్స్’ కోటా అడిషన్లు ప్రారంభమయినట్లు మంగళవారం డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. బీటెక్ ఇంజినీరింగ్‌తో పాటు బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డిగ్రీ కోర్సులలో అడిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు నూరు శాతం స్కాలర్‌షిప్ కల్పించామన్నారు. టెన్త్ , ఇంటర్ పాసై క్రీడారంగంలో ప్రతిభ చూపుతున్న విద్యార్థులు బీటెక్, బీఎస్సీ, బీఏ, బీబీఏ కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. బీటెక్‌లో చేరే విద్యార్థులు టెన్త్, ఇంటర్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి వుండాలని, అదే విధంగా బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సులలో విద్యార్థులు 45 శాతం మార్కులు వచ్చి వుండాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒలింపిక్ గేమ్స్, సౌత్ ఏషియన్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నవారు డైరెక్ట్‌గా అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. రాష్ట్రస్థాయిలో పేరున్న క్రీడాకారులకు స్పోర్‌ట్ప్ ట్రయల్ రన్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 18 వరకు స్పోర్ట్స్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
అంతర్జాతీయ ఎగుమతిదారుల సమావేశం
కొరిటెపాడు(గుంటూరు): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచి ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం ఎగుమతిదారుల సమావేశం జరిగింది. సమావేశానికి ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి.ప్రభు అధ్యక్షత వహించారు. ఎగుమతిదారులకు బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల రుణాలు, విదేశీ మారక ద్రవ్య లావాదేవీల పద్ధతులు, అంతర్జాతీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఎస్‌బీఐ ఏజీఎంలు రామ్‌ప్రసాద్, రమేష్‌బాబు, విజయ రాఘవయ్య, సూర్యశేఖర్, మేనేజర్ శ్రీను నాయక్, ఈసీజీసీ అధికారులు, పలువురు ఎగుమతిదారులు పాల్గొన్నారు.