
ఉచితంగా వైద్య పరీక్షలు
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు వివరించి, బాధితులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాం. పాఠశాలల విద్యార్థులకు మందులు, విటమిన్ సీ బిళ్లలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 3,504 మంది ఫ్లోరైడ్ బాధితులకు నెక్ బెల్ట్, నడుం బెల్ట్, వాకింగ్ స్టిక్, ఫ్లోల్డింగ్ టాయిలెట్ చైర్ కిట్‌ను ఉచితంగా అందించాం. వ్యాధిపై అవగాహన కలిగేలా 1,315 ప్రాంతాల్లో పోస్టర్లు అంటించాం. మెడికల్ ఆఫీసర్లు 42 మందికి, పారా మెడికల్ సిబ్బంది 84 మందికి, హెల్త్ వర్కర్లు 335 మందికి, ఆశా వర్కర్లకు 980 మందికి ఫ్లోరోసిస్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించేలా నైపుణ్యం పెంపొందించాం.
– డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ, గుంటూరు