
సాక్షి, తాడేపల్లి: ‘స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
మంగళవారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సీస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వైఎస్సార్‌సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అలజంగి జోగారావు, తిప్పల నాగిరెడ్డి, మళ్ళ విజయ్ ప్రసాద్, వాసుపల్లి గణేష్, పలువురు సీనియర్ నాయకులు సైతం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పించారు.

స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు.#AndhraKesari pic.twitter.com/GjqEztDO5D
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2025