
అర్జీల పరిష్కారం వేగవంతం
పీజీఆర్‌ఎస్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు
గుంటూరు వెస్ట్: వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీల పరిష్కారం మరింత వేగవంతం చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గంగరాజు మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో వివిధ శాఖల సమన్వయం బాగుండాలని తెలిపారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. 199 అర్జీలను గంగరాజు, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, జడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పరిశీలించారు.
దర్గాను స్వాధీనం చేసుకోవాలి
స్థానిక హజరత్ కాలే మస్తాన్ వలి దర్గాను డైరెక్ట్ మేనేజ్‌మెంట్‌లోకి తీసుకోవాల్సిందిగా వక్ఫ్‌బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో దర్గాను స్వాధీనం చేసుకుని పవిత్రను కాపాడాలి. దర్గా ముతవల్లి కుమారుడు డ్రగ్స్ కేసులో చిక్కుకుని దర్గా పరువును, ప్రతిష్టను మంటగలిపారు. భక్తుల మనోభావాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని మనవి. – షేక్ సుభాని, నాగూల్ మీరా,
గుంటూరు
బతుకు భారంగా మారింది ఆదుకోండి
నేను నా భార్య కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాం. మా అబ్బాయి రాజేష్‌కు చిన్నప్పటి నుంచి నూరు శాతం అవిటితనం ఉంది. మా బాబుకు రూ.15 వేలు పెన్షన్ వచ్చేట్లు చూడండి. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరు బాబుతో 24 గంటలు ఉండాల్సిందే. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. మమ్మల్ని ఆదుకోండి. – కుమారునితో
కె.రాము, సుజాత దంపతులు

అర్జీల పరిష్కారం వేగవంతం

అర్జీల పరిష్కారం వేగవంతం