జయంత్యుత్సవాలు
వైభవంగా నృసింహస్వామి
మంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామి నామకరణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. – మంగళగిరి
● తలవంచని అమ్మతనం
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సుందరి. భార్యాభర్తలు ఇద్దరూ ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఓ ఆటో ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టడంతో నడుం విరిగింది. నిలబడి పనులు చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో ఇద్దరు పిల్లల పోషణ కష్టమైంది. వారి కడుపు నింపేందుకు మనసు చంపుకొని యాచన వృత్తి చేపట్టింది. చక్రాల కుర్చీలో తిరుగుతూ యాచన చేస్తోంది. తాడేపల్లికి చెందిన ఆమె హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతోంది. గతంలో ఇళ్లలో పనిచేసే సమయంలో యజవానులతో మాట్లాడే క్రమంలో భాషలు వచ్చాయని చెప్పింది. ప్రభుత్వం స్పందించి సొంత ఇల్లు, చిరు వ్యాపారానికి సాయం చేయడంతోపాటు, ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇప్పిస్తే తనకు ఆసరాగా ఉంటుందని ఆమె ప్రాథేయ పడుతోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
జయంత్యుత్సవాలు
జయంత్యుత్సవాలు


