కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే...
శరీరంలో స్వచ్ఛమైన రక్తం ఉండేలా చేసే కిడ్నీలు చాలా కీలక పాత్రనే పోషిస్తుంటాయి. కాళ్ల వాపులు, మూత్రం ఎక్కువ సార్లు రావటం, మూత్రంలో మంట, మూత్రంలో రక్తం కారటం, ఆకలి లేకపోవటం, వాంతులు కావటం తదితర లక్షణాలు కనిపి స్తే మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధి గా అర్థం చేసుకోవాలి. నొప్పుల మాత్రలు, నాటు మందులు వాడటం, బీపీ, ఘగర్‌లు అదుపులో లేకపోతే మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్ ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
– డాక్టర్ చింతా రామకృష్ణ,
సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు.


