గుండె కోసం ఇవి పాటించాలి...
శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. గుండె కోసం తప్పని సరిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి.న నూనె అధికంగా ఉండే పదార్థాలు, చికెన్, మాంసం వంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. బీపీ, ఘగర్‌లను నియంత్రణలో పెట్టుకోవాలి. 35 సంవత్సరాలు దాటిన వారు ఏడాదికోసారి రక్తంలో కొవ్వు శాతం పరీక్షలు చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానం జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి.
– డాక్టర్ పోలవరపు అనురాగ్,
ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, గుంటూరు.


