
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు
నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ అధికార, సిబ్బంది ఏకమై, ప్రధానమైన రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లు, లాడ్జిలు, దుకాణ సముదాయాలు, జనసంచారం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఆదివారం విసృత తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరించారు. బ్యాగ్‌లను పరిశీలించి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు, ఏం పనులకు వెళ్తారనే విషయాలను ఆరాతీశారు. గుర్తింపు కార్డులను సైతం కూలంకుషంగా పరిశీలించారు. ప్రధాన మార్గాల మీదగా వచ్చే, పోయే వాహనాలను తనిఖీ చేశారు. వాహన పత్రాలను పరిశీలించారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే స్థానిక పోలీసుల దృష్టికి తేవాలని సూచించారు.