
ప్రభుత్వానికి నివేదించాం
ఇంటి ప్లాన్ల దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవటంపై ప్రభుత్వానికి నివేదించాం. నూతన జీవోలో రెండు సవరణలు చేశారు. ప్రస్తుతమున్న ప్లానర్లు కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించారు. భవన నిర్మాణం చేయదలచినవారు పట్టణ ప్లానింగ్ అధికారులు లేదా హెల్ప్ డెస్క్‌ను సంప్రదిస్తే ప్లాను ఇస్తారు. కొత్తగా అర్హత కలిగిన ప్లానర్లు ఎవరైనా ముందుకొస్తే లైసెన్సులు ఇస్తాం. వారి చేత ప్లాన్లు తీసుకోవచ్చు.
– మధుకుమార్, రీజినల్ డెప్యూటీ డైరెక్టర్, టౌన్‌ప్లానింగ్ విభాగం