
సు‘భద్ర’ డబ్బులు కట్టించారు
పట్నంబజారు: ‘‘గత ఏడాది ఏం జరిగిందో నా తెలియదు.. దేవస్థానాల్లో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు వ్యవహరిస్తే.. నేను చూస్తూ ఊరుకోను.. కచ్చితంగా ప్రతి స్వామి వారి కార్యక్రమానికి డబ్బులు చెల్లించి రశీదు తీసుకోవాల్సిందే ’’ అంటూ గుంటూరు నగరంలోని లాలాపేటలో గల గ్రూప్ ఆలయాల అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) టి. సుభద్ర తేల్చి చెప్పారు. లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి నాజ్ సెంటర్‌లోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ అర్చకులు, సిబ్బంది, హనుమాన్ దీక్షా సమాజం సభ్యులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న అవకతవకలు, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆలయంలో హోమాలు, అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ.. ఆలయ ఆదాయానికి గండి పడేలా కొంత మంది వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి ఏడాది హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలు, పూజలకు డబ్బులు చెల్లించకుండా వ్యవహరిస్తే.. చూస్తూ ఊరుకోబోమని వారికి సైతం ఘాటుగానే వివరించారనే తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు లేనివిధంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఐదు రోజు కార్యక్రమాల్లో భాగంగా పట్టాభిషేకం, కల్యాణ కార్యక్రమాల్లో కూర్చునే కొంత మంది దాతల్లో ఒక ముఖ్య దాత రూ. 50,116 తొలిసారిగా చెల్లించి రశీదు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముందే చెప్పిన ‘‘సాక్షి’’...
నాజ్ సెంటర్‌లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ఎటువంటి రశీదులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని కొద్ది రోజుల కిందట సాక్షి పలు కథనాలు ప్రచురించింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ప్రతి అంశాన్ని కూలకషంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ఇప్పటీ దాకా జరిగింది నాకు
తెలియదు.. ఇకపై ఏ కార్యక్రమమైనా
రశీదు పొందాల్సిందే : ఏసీ
నాజ్ సెంటర్ ఆంజనేయస్వామి
దేవస్థాన వ్యవహారంపై అంతర్గత
సమావేశం

సు‘భద్ర’ డబ్బులు కట్టించారు

సు‘భద్ర’ డబ్బులు కట్టించారు