
పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. గుండ్లపాడు టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా ఇద్దరు బలయ్యారు. బైక్‌పై వెళ్తున్న టీడీపీ నేతలు ముద్దయ్య, ఆయన సోదరుడు కోటేశ్వరరావును ఆ పార్టీకే చెందిన మరో వర్గం స్కార్పియో ఢీకొట్టి చంపేసింది. వెల్దుర్తి మండలం బోదలవీడులో ఈ ఘటన జరిగింది.
గత కొంతకాలంగా గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.