
వినియోగదారుల హక్కులు కాపాడాలి
నరసరావుపేటటౌన్: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి అల్లూరయ్య మాట్లాడుతూ వినియోగదారుల దిన వారోత్సవాల్లో భాగంగా కల్తీలు, తూకాల్లో వ్యత్యాసాలపై వివిధ రూపాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా చట్టప్రకారం నడుచుకోవాలన్నారు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చట్టపరమైన అంశాలను వివరించారు. నరసరావుపేట, సత్తెనపల్లి ఇన్‌స్పెక్టర్‌లు సాయి శ్రీకర్, జాన్‌సైదా తదితరులు పాల్గొన్నారు.