
పేదల ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
గుంటూరు వెస్ట్: పేదల ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి సోమవారం అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం ఒక ప్రభుత్వ శాఖతో వీలుపడదని, అన్ని శాఖల మండల, జిల్లా అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇనుము అందుబాటులో ఉందని, ఇసుక కూడా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌసింగ్ లేఅవుట్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని తెలిపారు. గృహ నిర్మాణాలకు గానూ లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. పొలాల్లో నీటి కుంటల తవ్వకాల టార్గెట్ పూర్తి చేయాలని జేసీ చెప్పారు. రైస్ కార్డును ఏడురకాల సర్వీసు ప్రొవైడర్లు ఇస్తున్నారని, కొన్ని కేటగిరిల్లో వచ్చిన 11,446 సర్వీసు రిక్వెస్టులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పురోగతిలో ఉండాలని, దీనికి సంబంధించి ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని జేసీ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, హౌసింగ్ పీడీ ప్రసాద్, స్టెప్ సీఈఓ ఆర్.చంద్రమణి, డ్వామా పీడీ శంకర్, సీపీఓ శేషశ్రీ , అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ