
ఘనంగా జానపద కళాపీఠం రజతోత్సవం
అద్దంకి రూరల్: జానపద కళాపీఠం రజతోత్సవం శనివారం రాత్రి స్థానిక బంగ్లారోడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షుడు దేవపాలన మాట్లాడుతూ పల్లె ప్రజల గుండె చప్పుడు జాన పదమదన్నారు. జానపద కళలు ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలని తెలిపారు. దీనిలో భాగంగా చెన్నుపల్లి నాగేశ్వరరావు బృందం చేపట్టిన కోలాట ప్రదర్శన, జానపద రూపాలైన డప్పువాయిద్య కళాకారులు ప్రదర్శన, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జ్యోతి శ్రీరాములు స్మారక సాహిత్య పురస్కారాన్ని కొండా శ్రీనివాసులు, వీరవల్లి రంగయ్య, యశోదమ్మ స్మారక కళాపురస్కారాన్ని కారుమూరి సీతారామయ్యకు, గుర్రం జాఫువా స్మారక సాహితీ పురస్కారాన్ని పిన్నాబత్తిన వెంకట రమణయ్యకు, మారెడ్డి స్మారక కళాపురస్కారాన్ని బత్తుల ఆంజనేయులుకు, జానపద కళాపీఠం ఆత్మీయ సన్మానాన్ని ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆర్జేటి సుబ్బారావుకు అందజేశారు. కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు , జ్యోతి చంద్రమౌళి, గాడేపల్లి దివాకరదత్తు, జ్యోతి శ్రీమన్నారాయణ, మల్లాది శ్రీనివాసరావు, ధర్మవరపు శ్రావణ్‌కుమార్, తాళ్లూరి సుబ్బారావు పాల్గొన్నారు.