
సువర్ణ భారతి మహాద్వారం ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేటలోని శ్రీశృంగేరీ శంకరమఠం మార్గంలో నూతనంగా నిర్మించిన సువర్ణ భారతి మహాద్వారాన్ని మంగళవారం శ్రీశృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీ మహాస్వామి ప్రారంభించారు. అనంతరం శంకరమఠంలోని శ్రీశంకర చంద్రమౌళీశ్వరస్వామి, శ్రీశారదాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాద్వారం నిర్మాణానికి సహకరించిన వేదాంతం సీతారామ అవధాని, కపలవాయి విజయకుమార్‌లకు ఆశీస్సులు అందజేశారు. స్వామివారి రాకతో మఠంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళా బృందాలు కోలాటాలు, భక్తి గీతాలాపనలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.